బిగ్ బాస్ సీజన్ 6కి రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రోమో మరియు లోగో లాంచ్ కావడం తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ గ్లింప్స్ తో పాటు టెలికస్ట్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 4వ తేదీ నుండి టేలికాస్ట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే సభ్యుల ఎంపిక..వారి గ్రాండ్ ఎంట్రీ షూట్ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని సీన్స్ గ్లింప్స్ లో కనిపిస్తున్నాయి.
మరి ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వెళ్లారు అన్నది తెలుసుకోవాలంటే ఇంక మూడు రోజులు ఆగాల్సిందే. టాప్ మోస్ట్ సీనియర్ నటులు..యాంకర్స్ తో పాటు యూట్యూబ్ సెలబ్రిటీస్ సెలెక్ట్ అయినట్లు సమాచారం. దాదాపు వంద రోజులు ఈషో ప్రసారం కానుంది. ఈ క్రమంలో షోకి సంబంధించి ఎపిసోడ్ ప్రసారం కాకుండా ఏది కూడా ముందుగానే లీక్ లు ఏమీ కాకుండా కూడా టెక్నికల్ గా కూడా షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అంటున్నారు.
మరి ముఖ్యంగా షో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు..? ఎవరు నామినేషన్ లో ఉన్నారు..? అనే విషయాల ముందే లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారని టాక్. ఎట్టి పరిస్థితుల్లో సీజన్ సిక్స్ అందరిని అలరించే రీతిలో ఉండే విధంగా ఫిజికల్ టాస్కులు మరియు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు రూపొందించినట్లు సమాచారం. దాదాపు 19 మంది సభ్యులు ఇంటిలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు..వీరిలో 15 మంది చేత ఫస్ట్ ఎంట్రీ ఇప్పించనున్నట్లు సమాచారం. మిగతా నలుగురు వైల్డ్ కార్డ్ రూపంలో ఎంట్రీ ఇచ్చే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!