Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రస్తుతం సాగుతోంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఏడు వారాలు గడిచాయి. ప్రస్తుతం ఎనిమిదవ వారం గేమ్ జరుగుతుంది. హౌస్ లో ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఏడుగురు కూడా లేడీ కంటెస్టెంట్ లే. సీజన్ సెవెన్ లో మగవాళ్ళు చాలా గట్టిగా ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఐదవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ బయట అదిరిపోయే ఛాన్స్ అంటుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో శుభశ్రీ ఉన్నది ఐదు వారాలైనా గాని మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ ఈషో ద్వారా ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ క్రమంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత శుభశ్రీకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అందుకోవటం జరిగింది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెబుతూ.. నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన పంచుకోవడానికి నాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పక్క పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన భోజి సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చినందుకు నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. నాలో ఉన్న టాలెంట్ నీ నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సుజిత్, నిర్మాణ సంస్థ డివివి మూవీస్ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతిక్షణం నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ నన్ను ప్రేమిస్తున్న అభిమానులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అని తెలిపింది. శుభశ్రీ పోస్ట్ వైరల్ కావడంతో… హౌస్ లో ఐదు వారాలు ఉన్నాగాని బయట మంచి ఛాన్స్ అందుకుందని కామెంట్లు చేస్తున్నారు. “OG”లో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. అటువంటి ఈ సినిమాలో శుభశ్రీ ఛాన్స్ అందుకోవటం జరిగింది.