21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Big Boss 6 Telugu Entertainment News

Bigg Boss Telugu: 2017 నుండి బిగ్ బాస్ తెలుగు ఫైవ్ సీజన్స్‌లో టాప్-5 కంటెస్టెంట్స్‌..బిగ్‌బాస్‌ తోపులు వీరే

Share

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ షో తెలుగులో దిగ్విజయంగా నడుస్తోంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తిచేసుకుని ఆరవ సీజన్‌లోకి కూడా అడుగు పెట్టింది. మరి కొద్ది రోజుల్లో సిక్స్త్ సీజన్ విన్నర్ ఎవరో కూడా తేలిపోనుంది. ఈ నేపథ్యంలో గత ఐదు సీజన్లలో టాప్-5గా(All time top contestants of Bigg Boss Telugu) నిలిచిన కంటెస్టెంట్స్‌ ఎవరో ఓసారి తెలుసుకుందాం.

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 1

Bigg Boss Telugu: List of Big Boss Telugu Top Contestants of All Time from Bigg Boss Telugu Season 1 to Bigg Boss Current Season.
Bigg Boss Telugu: List of Big Boss Telugu Top Contestants of All Time from Bigg Boss Telugu Season 1 to Bigg Boss Current Season.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ సంబంధిత సహాయక లింక్‌లు:

Bigg Boss 6: శ్రీహాన్ కి ఆ రీతిలో హింట్ ఇచ్చిన సిరి..?

వరల్డ్స్‌ బిగ్గెస్ట్ రియాలిటీ టీవీ షో బిగ్‌బాస్ 1 స్టార్ మాలో 16 జులై 2017న ప్రారంభమైంది. ఈ సీజన్‌కి జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. లోనావాలాలో హౌస్ సెట్‌ను నిర్మించారు. శివ బాలాజీ విజేతగా నిలిచి రూ.50 లక్షలు ప్రైజ్ మనీగా గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో ఆదర్శ్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిస్తే ఆ తర్వాతి స్థానాల్లో యాంకర్ హరి తేజ, యాక్టర్ నవదీప్, యాక్ట్రెస్ అర్చన నిలిచారు.

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 2

Bigg Boss Telugu Season 2 Winner: Nani and Venkatesh in pictures
Bigg Boss Telugu Season 2 Winner: Nani and Venkatesh in pictures

బిగ్‌బాస్ 2 స్టార్ మాలో 2018, జూన్ 10న ప్రారంభమైంది. ఈ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు హౌస్‌మేట్స్‌గా వచ్చారు. ఈ సీజన్‌ కోసం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకరాల బ్యాక్‌లాట్‌లో హౌస్ సెట్‌ను నిర్మించారు. ఈ సీజన్ ట్రోఫీని కౌశల్ మండ గెలుచుకున్నాడు. గీతా మాధురి ఫస్ట్ రన్నరప్‌గా నిలిస్తే.. మిగతా 3 ప్లేసెస్‌లో తనీష్, దీప్తి నల్లమోతు, సామ్రాట్ నిలిచారు.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ సంబంధిత సహాయక లింక్‌లు:

Bigg Boss 6: ఇనాయాకి మా పేరెంట్స్ బిగ్ ఫ్యాన్ చెప్పిన సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ వైరల్ కామెంట్స్..!!

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 3

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6
Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్  3

బిగ్‌బాస్ సీజన్ 3 స్టార్ మాలో 2019, జులై 21న ప్రారంభమైంది. ఈ సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించాడు. నాగార్జున 60వ పుట్టినరోజు సంబరాలు స్పెయిన్‌లో జరగగా అతను ఆరవ వారం పోస్ట్ చేయలేకపోయాడు. నాగ్‌కి బదులుగా 6వ వారం రమ్యకృష్ణ హోస్ట్‌గా చేసింది. ఈ సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా నిలిచాడు. శ్రీముఖి రన్నరప్‌గా నిలిస్తే.. మిగిలిన మూడు ప్లేసుల్లో బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రైజా నిలిచారు.

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4

Bigg Boss Telugu Top Contestants of All Seasons
Bigg Boss Telugu Top Contestants of All Seasons

బిగ్‌బాస్ సీజన్ 4 స్టార్ మాలో 2020 సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా చేశాడు. కాగా ఓ వారం సమంత గెస్ట్‌ హోస్ట్‌గా వచ్చి బాగా అలరించింది. ఈ సీజన్‌లో అభిజీత్ దుద్దుల విన్నర్‌గా నిలిచాడు. రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్, ఓ బైక్‌ను కూడా గెలుచుకున్నాడు. ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. ఇక అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత మూడు స్థానాల్లో సోహెల్, హర్యానా గ్లోరీ, హారిక నిలిచారు.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ సంబంధిత సహాయక లింక్‌లు:

Bigg Boss 6: ఫ్యామిలీ ఎపిసోడ్ లు చూస్తూ గుక్కపెట్టి ఏడుస్తున్న గీతూ రాయల్… వీడియో వైరల్..!!

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5
Bigg Boss Telugu

బిగ్‌బాస్ సీజన్ 5 స్టార్ మాలో 2021 సెప్టెంబర్ 6న మొదలైంది. ఈ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో వి.జె సన్నీ విన్నర్‌గా నిలిచి 50 లక్షల క్యాష్ , 25 లక్షలు విలువ చేసే ఫ్లాట్, ఒక బైక్ గెలుచుకున్నాడు . రన్నరప్‌గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచాడు. ఆ తర్వాత మూడు స్థానాల్లో శ్రీరామ్, మానస్, సిరి నిలిచారు.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ సంబంధిత సహాయక లింక్‌లు:

Bigg Boss 6: కీర్తిపై ట్రోలింగ్ విషయంలో సీరియస్ అయినా బిగ్ బాస్ 5 కంటెస్టెంట్..!!

 


Share

Related posts

Liger: “లైగర్” కంప్లీట్ అయిన థియేటర్ లో రాకపోవడానికి కారణం అతడేనట..??

sekhar

వ‌ర్కింగ్ డేలోనూ వీక్ అవ్వ‌ని `బింబిసార‌`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

kavya N

మ‌హేష్ కెరీర్‌లో న‌మ్ర‌త మెచ్చే సినిమా ఏదో తెలుసా?

kavya N