గత కొంత కాలం నుండి సరైన హిట్లు లేక సతమతం అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్.. రీసెంట్గా `బింబిసార` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంతో మల్లాడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తే.. వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 5న అట్టహాసంగా విడుదలైన ఈ చిత్రం.. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ బాగుండటంతో.. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను బద్దలు కొట్టి లాభాల బట్టింది.
అయితే నాల్గొవ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో.. బింబిసార బాక్సాఫీస్ వద్ద వీక్ అవుతుందేమో అని ఖంగారు పడ్డారు. కానీ, 4వ రోజు కూడా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.27 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ మూవీ.. వరల్డ్ వైడ్‌గా రూ. 2.56 కోట్ల షేర్‌ను దక్కించుకుంది. ఇక ఏరియాల వారీగా `బింబిసార` నాలుగు రోజుల టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 6.55 కోట్లు
సీడెడ్: 3.96 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.61 కోట్లు
తూర్పు: 1.16 కోట్లు
పశ్చిమ: 0.84 కోట్లు
గుంటూరు: 1.42 కోట్లు
కృష్ణ: 1.00 కోట్లు
నెల్లూరు: 0. 56 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ= 18.10 కోట్లు(28.20కోట్లు~ గ్రాస్)
———————————–
కార్ణాటక+రెస్టాఫ్ ఇండియా= 1.23 కోట్లు
ఓవర్సీస్ – 1.52 కోట్లు
———————————–
టోటల్ వరల్డ్ వైడ్: 20.85 కోట్లు(34.30 కోట్లు~ గ్రాస్)
———————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 15.6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను బ్రేక్ చేసిన బింబిసార.. 4వ రోజు సాధించిన కలెక్షన్స్ తో రూ. 4.65 కోట్ల ప్రాఫిట్ తో దూసుకెళ్తోంది.