నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే తొలిసారి చేసిన చారిత్రక చిత్రం `బింబిసార`. ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కొత్త దర్శకుడు శ్రీ వశిష్ఠ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు.
ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ బాగుండటంతో.. తొలి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించిన బింబిసార.. మూడు రోజు కూడా అదరగొట్టేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను గల్లంతు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 6.30 కోట్లు, రెండో రోజు రూ. 4.52 కోట్ల షేర్‌ను వసూల్ చేసిన ఈ చిత్రం.. మూడో రోజు సండే కావడంతో రూ. 5.02 కోట్ల రేంజ్ లో షేర్ ని కొల్లగొట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 5.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని లాభాల బాట పట్టింది. ఇక ఏరియాల వారీగా `బింబిసార` ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 5.72 కోట్లు
సీడెడ్: 3.40 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.29 కోట్లు
తూర్పు: 1.03 కోట్లు
పశ్చిమ: 0.74 కోట్లు
గుంటూరు: 1.27 కోట్లు
కృష్ణ: 0.89 కోట్లు
నెల్లూరు: 0.50 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ= 15.84 కోట్లు(24.50కోట్లు~ గ్రాస్)
———————————–
కార్ణాటక+రెస్టాఫ్ ఇండియా= 1.10 కోట్లు
ఓవర్సీస్ – 1.35 కోట్లు
———————————–
టోటల్ వరల్డ్ వైడ్: 18.29 కోట్లు(30.00 కోట్లు~ గ్రాస్)
———————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 15.6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను బ్రేక్ చేసిన బింబిసార.. రూ. 2.09 కోట్లతో లాభాల్లో కొనసాగుతోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!