నందమూరి కళ్యాణ్ రామ్ నుండి వచ్చిన తాజా చిత్రం `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎం.ఎం. కీరవాణి, చిరంతన్ భట్ స్వరాలు అందించారు.
ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ సోసియో ఫాంటసీ చిత్రం ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. తొలి షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ బాగుండటంతో.. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించిన బింబిసార.. రెండో కూడా ఊచకోత కోసింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.30 కోట్ల షేర్‌ను వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 4.52 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 12.37 కోట్ల షేర్‌ను దక్కించుకుంది. ఇక ఏరియాల వారీగా `బింబిసార` 2 రోజుల టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 3.92 కోట్లు
సీడెడ్: 2.24 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.55 కోట్లు
తూర్పు: 0.70 కోట్లు
పశ్చిమ: 0.55 కోట్లు
గుంటూరు: 0.89 కోట్లు
కృష్ణ: 0.59 కోట్లు
నెల్లూరు: 0.38 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ= 10.82 కోట్లు(16.50కోట్లు~ గ్రాస్)
———————————–
కార్ణాటక+రెస్టాఫ్ ఇండియా= 0.50 కోట్లు
ఓవర్సీస్ – 1.05 కోట్లు
———————————–
టోటల్ వరల్డ్ వైడ్: 12.37 కోట్లు(20.00కోట్లు~ గ్రాస్)
———————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 15.6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వల్ల క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 3.83 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే సరిపోతుంది.