Bimbisara OTT Release Date: చాలా కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇటీవల విడుదలైన `బింబిసార` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కొత్త దర్శకుడు శ్రీ వశిష్ఠ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న అట్టహాసంగా విడుదలై.. తొలి షో నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తోంది. రెండు కాదు మూడో వీకెండ్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దూసుకుపోతోంది.
ఇక కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించిన `బింబిసార`.. ఇప్పుడు ఓటీటీ సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. బింబిసార డిజిటల్ రైట్స్‌ను జీ5 వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 16న స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
కాగా, థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య ఆరు వారాల నుండి ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని టాలీవుడ్ నిర్మాతలు ఇటీవలే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఒప్పందానికి కట్టుబడే ఆరు వారాల తర్వాత అంటే సెప్టెంబర్ 16న బింబిసారను ఓటీటీలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని ప్రచారం జరుగుతోంది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!