నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో తెరకెక్కిన తొలి ఫాంటసీ యాక్షన్ చిత్రం `బింబిసార`. శ్రీ వశిష్ఠ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు జీవత కథ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఇదో టైమ్ ట్రావెల్ మూవీ. ఫ్లాష్‌బ్యాక్, ప్రెజెంట్ సిట్యువేషన్స్‌లో స్క్రీన్ ప్లే సాగుతుంది. ఇప్పటికే చిత్రం నుండి బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
అయితే ఆ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేందుకు మేకర్స్ తాజాగా బింబిసార నుండి మరో ట్రైలర్‌ను బయటకు వదిలారు. `హద్దులను చెరిపేస్తూ, మన రాజ్యపు సరిహద్దులు ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి` అని నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం విశేషంగా ఆకట్టుకుంది.
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఓవైపు మహారాజుగా, మరోవైపు మోడ్రన్ లుక్‌లో కళ్యాణ్ రామ్ అదరగొట్టేశారు. `నాడైనా నేడైనా త్రిగర్తల చరిత్రను తాకలంటే.. ఈ బింబిసారుడి కత్తిని దాటాలి` డైలాగ్ హైలైట్ నిలిచింది. మొత్తానికి అద్భుతంగా ఈ ట్రైలర్ సినిమాపై వేరె లేవల్‌లో బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది.