Adivi Sesh-Ravi Teja: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇటీవలె `మేజర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధించింది.
సందీప్ గా అద్భుతమైన నటనతో అదరగొట్టేసిన అడివి శేష్.. మరి కొద్ది రోజుల్లోనే `హిట్-2`తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా, న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో 2020లో రూపొందిన `హిట్` మూవీ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా `హిట్-2`ను తెరకెక్కించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో విశ్వక్ సేన్‌కు బదులుగా అడివి శేష్ నటిస్తున్నాడు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూలై 29న విడుదల కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
కానీ, ఊహించని విధంగా మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూట్` రిలీజ్‌కు అదే తేదీని ఖాయం చేశారు. ఇది ఒకరకంగా శేష్‌కు షాక్ అనే చెప్పాలి. రెండు సినిమాల జానర్ లు వేరు అయినా రామారావు ఆన్ డ్యూటీ, హిట్2 ఒకేరోజు విడుదలైతే హిట్2 సినిమా నష్టపోక తప్పదు. ఎందుకంటే, రవితేజ క్రేజ్ అలాంటిది. మరి రిలీజ్ డేట్ విషయంలో అడివి శేష్ వెనక్కి తగ్గుతాడా..? లేదా రవితేజకు పోటీగా వెళ్తాడా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.