Brahmamudi 11 ఆగస్ట్ 172 ఎపిసోడ్: కావ్య రాజ్ ఇచ్చిన జాబ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసి తన పుట్టింటికి వెళ్లి వినాయకుడి విగ్రహాలను తయారు చెయ్యడం మీడియా ప్రత్యేక కథనాలు వేసి దుగ్గిరాల కుటుంబానికి చాలా డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు కావ్య ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చెయ్యడానికి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రెస్ మీట్ ని దుగ్గిరాల కుటుంబం వారు కూడా చూస్తారు.

ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కావ్య :
ఈ ప్రెస్ మీట్ లో కావ్య మాట్లాడుతూ మీడియా ని కడిగేస్తుంది. మీ తప్పుడు కథనాల వల్ల దుగ్గిరాల కుటుంబ పరువు ని తీస్తున్నారు , అసత్యాలను పరిచయం చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు ఒక మీడియా రిపోర్టర్ మీరు బయట బొమ్మలకు రంగులు వెయ్యడం నిజమే కదా, దుగ్గిరాల కుటుంబానికి కోడలు అనే విషయం కూడా నిజమే కదా, మరి మేము అబద్దాలను ప్రచారం చేసాము అంటున్నారేంటి అని అడగగా అప్పుడు దానికి కావ్య సమాధానం చెప్తూ మీకు పెళ్లయిందా అని అడుగుతుంది. అవును అయ్యింది అని చెప్తుంది ఆ మీడియా రిపోర్టర్. మీ భర్త ఉద్యోగం చేస్తున్నాడా అడగగా చేస్తున్నాడు అని బదులిస్తుంది. మరి మీ భర్త పెళ్లి ఉద్యోగం చేస్తున్నా కూడా మీరు ఎందుకు రిపోర్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు అని అడుగుతుంది కావ్య. అప్పుడు ఆ రిపోర్టర్ ఇది నా పాషన్ అని సమాధానం ఇస్తుంది.

మీకు మీరు చేసే పని ప్యాషన్ అయ్యినప్పుడు నేను చేసే పనిని ఎందుకు ఆ దృష్టిలో చూడరు..?, అంత మాత్రానా మా అత్తవాళ్ళు నన్ను వేదిస్తున్నట్టు, ఇష్టమొచ్చినట్టు కథనాలు ప్రచారం చేస్తారా..?, దుగ్గిరాల కుటుంబం లో ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుంది, నేను అడిగితే నా భర్త లక్షలు ఇవ్వగలడు, కానీ నేను నా కష్టం తో మా పుట్టింటి సమస్యలు తీర్చాలి అనుకున్నాను అంటూ సమాధానం ఇస్తుంది కావ్య. ఒక ఆడపిల్ల అనుమతి లేకుండా ఇలాంటి కథనాలు ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేసి మీరు పొందగలిగేది ఏమి లేదు. ఇది ఎవరో బలవంతం చేస్తేనో ఇక్కడి వచ్చి నేను చెప్పలేదు, నా అంతటా నేను వచ్చి చెప్తున్నాను. దుగ్గిరాల కుటుంబం లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అంటూ చెప్పి ప్రెస్ మీట్ ని ముగిస్తుంది. ఇదంతా చూసిన దుగ్గిరాల కుటుంబ సభ్యులు ఆవేశం తో రగిలిపోతూ ఉంటారు.

Krishna Mukunda Murari: ముకుందకి నిజం చెప్పేసిన కృష్ణ.. మురారికి దూరమవుతుందా.!?
కావ్య ని ఇంట్లో నుండి గెంటేసిన అపర్ణ:
రుద్రాణి మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకు కేవలం కొంతమందికి మాత్రమే తెలిసిన ఈ విషయాన్నీ, ఇప్పుడు మీ కోడలు ప్రెస్ మీట్ ద్వారా ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది అని అంటుంది. అప్పుడు ధాన్య లక్ష్మి అక్కడ కావ్య ఏమి తప్పు చేసింది..? మన కుటుంబం గురించి గొప్పగానే చెప్పింది కదా అని అంటుంది. అప్పుడు రుద్రాణి ఆమె ఉద్దేశ్యం అదే అయ్యుండొచ్చు, కానీ బయట జనాలు మనమే ఈ ప్రెస్ మీట్ ని కావాలని పెట్టించామని అనుకుంటారు అని అంటుంది రుద్రాణి. మరోవైపు రాజ్ కూడా ఈ ప్రెస్ మీట్ ని ఆఫీస్ లో చూసి చిరాకు పడుతాడు. అది గమనించిన రాహుల్ తన స్నేహితుడి చేత రాజ్ కి ఫోన్ చేయించి భలే కంట్రోల్ లో పెట్టించారుగా, దెబ్బకి మీడియా చేసిన నెగటివిటీ మొత్తం పోయింది అని అంటాడు.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
అలా రాజ్ ని అందరూ చిరాకు పెట్టిస్తున్న సమయం లో రాహుల్ రాజ్ వద్దకి వచ్చి, ఆ విగ్రహాల కాంట్రాక్టు ని నీ పలుకుబడి ఉపయోగించి రద్దు చేయించు, అప్పుడు కావ్య ఉద్యోగం అవకాశం కోసం నీ వద్దకే వస్తుంది అని అంటాడు. మరోవైపు అపర్ణ కనకం ఇంటికి వెళ్లి, కావ్య చేస్తున్న పనులన్నీ వివరించి కడిగిపారేస్తుంది, మరుసటి ఎపిసోడ్ ప్రోమోలో అపర్ణ నువ్వు ఈ ఇంటి కోడలిగా ఉండాలంటే ఇక్కడ అందరికీ నచ్చే విధంగానే ఉండాలి అని అంటుంది. అప్పుడు కావ్య తప్పు చేసింది మీరు, మా వాళ్ళని బెదిరించారు, నా స్వేచ్ఛ ని లాగుకున్నారు, నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని అంటుంది. అయితే ఇంట్లో నుండి తక్షణమే వెళ్ళిపో అని సమాధానం ఇస్తుంది అపర్ణ, తర్వాత ఏమి జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.