Brahmamudi 14 ఆగస్ట్ 174 ఎపిసోడ్: కావ్య పుట్టింటికి వెళ్లి పని చెయ్యడానికి అపర్ణ ఏమాత్రం ఒప్పుకోదు.కావ్య కూడా తానూ అనుకున్న దానికి ఏమాత్రం తగ్గకుండా అపర్ణ కి సమాధానం చెప్తూ ఉంటుంది. అప్పుడు అపర్ణ ఈ ఇంట్లో అందరికీ ఇష్టం ఉండేటట్టు నడుచుకోకపోతే ఈ ఇంట్లో స్థానం లేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్లి పని చేస్తాను అంటే ఎట్టిపరిస్థితిలో కూడా నేను ఒప్పుకోను. నీకు ఈ కుటుంబం తో శాశ్వతంగా సంబంధం తెగిపోయినట్టే. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో, ఇక ఆ తర్వాత నీకు ఇష్టమొచ్చినట్టు చేసుకో అని అంటుంది అపర్ణ.

Brahmamudi 12 ఆగస్ట్ 173 ఎపిసోడ్: కావ్య పుట్టింటికి శాశ్వతంగా దూరం కాబోతుందా..?
కావ్య ని ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పిన అపర్ణ :
అపర్ణ మాట్లాడిన ఈ మాటలకు కావ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇందిరా దేవి అడ్డుపడి అమ్మా అపర్ణ అని ఆపినా కూడా అపర్ణ మాట వినదు. ఇన్ని రోజులు మీ మాట వింటూ వచ్చాను, ఈ ఒక్క విషయం లో మాత్రం నన్ను క్షమించండి అత్తయ్య అని బదులిస్తుంది అపర్ణ.

Nuvvu Nenu Prema : పుట్టింట్లో పద్మావతి హడావిడి.. భక్త ఆండాళ్ పద్మావతిని క్షమించనున్నారా?
కావ్యకి మద్దతుగా నిల్చిన సీతారామయ్య :
ఇంత లోపే ఇక చాలు ఆపండి అంటూ సీతారామయ్య అరుస్తాడు. అపర్ణ ని మందలించే ప్రయత్నం చేస్తాడు. అసలు నా కోడలు ఏమి తప్పు చేసిందని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నావు అని అంటాడు సీతారామయ్య. అప్పుడు రుద్రాణి, అది కాదు నాన్న కావ్య ప్రెస్ మీట్ లో అని మాట్లాడబోతుండగా నేను అంతా విని చూసే వస్తున్నాను. కావ్య మన ఇంటి పరువు ఏమాత్రం తియ్యలేదు. ఇంకా కాపాడింది, తాను ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా మన కుటుంబ పరువు తీస్తూ మాట్లాడలేదు, ఈ ఇంట్లో వాళ్ళు ఏ పని చెయయడానికైనా స్వేచ్ఛ ఇస్తారు అని చెప్పింది. మనం నిజంగా స్వేచ్ఛ ఇస్తున్నామా? అని అడుగుతాడు సీతారామయ్య. దానికి అపర్ణ నుండి ఎలాంటి సమాధానం రాదు, కావ్య ఆత్మాభిమానం ఉన్న మనిషి. నువ్వు ఆరోజు తన పుట్టింటికి ఈ ఇంటి డబ్బు ఇచ్చినప్పుడు నిలదీసిన రోజే నాకు అర్థం అయ్యింది, కావ్య ఇక ఈ ఇంటికి ఒక్క పైసా కూడా తీసుకొని వెళ్ళదు అని, తానూ ఎంచుకున్న మార్గం లోనే వెళ్తుంది. దీనికి ఎవ్వరూ అడ్డు చెప్పడానికి వీలు లేదు రేపటి నుండి కావ్య తన పుట్టింటికి వెళ్లి పని చేస్తుంది అని సమాధానం ఇస్తాడు సీతారామయ్య.

Krishna Mukunda Murari: దూరమవుతున్న కృష్ణ మురారి లను ఒక్కటి చేయడానికి నందు, గౌతమ్ ప్లాన్..
ఇల్లు అమ్మేయడానికి సిద్ధపడ్డ మూర్తి :
తనని ఇంట్లో అందరూ అపార్థం చేసుకుంటున్న సమయం లో సరిగ్గా అర్థం చేసుకున్నందుకు కావ్య సీతారామయ్య కి కృతఙ్ఞతలు తెలియచేస్తుంది. మరోపక్క మూర్తి , కనకం మంచి జరుగుతుంది అని ఆనందనించే లోపే , రెండు మూడింతలు నష్టం జరుగుతుంది అని అనుకంటూ ఉంటారు. ఇక కావ్య ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఈ ఇల్లు ని అమ్మేసి, అప్పులు మొత్తం తీర్చి , మిగిలిన డబ్బుతో అప్పు పెళ్లి చేసి, మనం ఎక్కడైనా తల దాచుకుందాం అని అంటాడు మూర్తి. కూతురు కాపురం చెడిపోకూడదు అంటే ఇదే సరైన నిర్ణయం అని అంటుంది కనకం.

మరోపక్క ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా కూడా నేను నువ్వు పుట్టింటికి వెళ్లి పని చెయ్యడానికి ఒప్పుకొని అని అంటాడు రాజ్. మీకు నిజంగానే నేను పుట్టింటికి వెళ్లి పని చెయ్యడం ఇష్టం లేదా అని అంటుంది కావ్య, అవును ఇష్టం లేదు అని అంటాడు రాజ్. సరే అయితే మీ మాట కాదు అని నేను ఏ పని చెయ్యను, ఇక నుండి మానేస్తాను అని అంటుంది కావ్య . ఇదేంటి నేను చెప్పగానే ఎలాంటి గొడవ లేకుండా ఇంత సింపుల్ గా ఒప్పేసుకుంది, ఇందులో ఏదైనా మెలికలు ఉన్నాయా అని అనుకుంటూ ఉంటాడు రాజ్. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.