Brahmamudi 17 ఆగస్ట్ 177 ఎపిసోడ్:కనకం తో మూర్తి కాంట్రాక్టు పోయింది , దాని వాళ్ళ వచ్చే ఆదాయం కూడా పోయింది, ఇక ఇల్లు అమ్మడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. అలా వాళ్లిద్దరూ బాధ పడుతున్న సమయం లో రాజ్ మరియు కావ్య కార్ లో అక్కడికి వస్తారు. కావ్య చేతిలో బ్యాగ్ చూసి కాంట్రాక్టు పోతే పోయింది, మన కూతురు కాపురం కూడా పడిపోయింది అంటూ మూర్తి మరియు కనకం అనుకుంటారు.

కావ్య ని పుట్టింటికి పంపేశారని ఆందోళన చెందిన మూర్తి – కనకం:
ఇద్దరూ కూడా కార్ వద్దకి వెళ్లి కావ్య ని వద్దు వద్దు అని చెప్పినా కూడా ఇక్కడికి వచ్చి పని చేసి కాపురం మీదకి తెచుకున్నావా అమ్మా, ఒక్క బ్యాగ్ తోనే వచ్చావు, అంటే బట్టలు పూర్తిగా సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదా అంటూ ఏడుస్తుంది. మరో పక్క మూర్తి రాజ్ తో మాట్లాడుతూ ఇదేమి మీకు భావ్యం కాదు బాబు అని అంటాడు. మూర్తి మాటలకు రాజ్ కార్ దిగి క్రిందకి వస్తాడు.

రాజ్ మాటలకు ఆనందించిన మూర్తి – కనకం :
అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అండీ అని అడుగుతాడు. కావ్య మీ మాట వినలేదని పుట్టింటికి పంపిస్తున్నారు కదా అని అనగా, అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, కావ్య ఇక్కడ పని చెయ్యడం వల్ల ఇంట్లో గొడవలు, సమస్యలు వస్తున్నాయి కాబట్టే ఆ కాంట్రాక్టు ని మీకు రానివ్వకుండా ఆపేసాను. ఇప్పుడు ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఆ కాంట్రాక్టుని మళ్ళీ మీకే వచ్చేలాగా చేశాను అని అంటాడు. ఆ మాట విన్న తర్వాత కనకం మరియు మూర్తి సంతోషిస్తారు. లోపలకి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళు బాబు అని కనకం అంటుంది. అయ్యో నాకు అర్జెంటు మీటింగ్ ఉంది, వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు కావ్య రాజ్ తానూ క్రింద పడిపోవడానికి నూనె పోసిన వీడియో ని చూపిస్తాను అని అన్నట్టుగా ఫోన్ చూపించి సైగలతో బెదిరిస్తుంది, అప్పుడు రాజ్ లోపలకి వచ్చి టిఫిన్ చెయ్యడానికి ఒప్పుకుంటాడు.

రాజ్ మీ కొడుకేనా అని అపర్ణ ని నిలదీసిన కావ్య:
మరోపక్క అపర్ణ సీతారామయ్య ని మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు మామయ్య గారు అని అంటుంది. ఏమైంది అమ్మా అని అడగగా, నాకు ఇష్టం లేకపోయినా కూడా కావ్య ని పుట్టింటికి పంపించడానికి ఒప్పుకున్నారు, నేనేమి ఒక్క మాట ఎదురు చెప్పలేదు, కానీ ఇప్పుడు రాజ్ ని ప్రతీ రోజు అక్కడకి కావ్యని దింపి రమ్మనడం నాకు అసలు నచ్చడం లేదు అని అంటుంది. అప్పుడు సీతారామయ్య ఈ గొడవల వల్ల వాళ్లిద్దరూ ప్రశాంతం గా లేరు, ఇలా ఏకాంతంగా కాసేపు గడిపితే మనసు విప్పి మాట్లాడుకుంటారు అనే నేను అలా చేశాను అని అంటాడు సీతారామయ్య. ఇక ఆ తర్వాత రుద్రాణి నీ కొడుకు రాజ్ నీ చేతుల్లో నుండి జారిపోయి, కావ్య చేతిలో కీలుబొమ్మ అయిపోతున్నాడు అని అంటుంది.

అప్పుడు అపర్ణ ఇందులో నీకు వచ్చిన నష్టం ఏమి ఉంది, నా కొడుకు మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అని బలంగా సమాధానం ఇస్తుంది. అప్పుడు రుద్రాణి ఇటీవల కాలం లో రాజ్ కావ్య చేస్తున్న ప్రతీ పనిని వెనకేసుకొని రావడాన్ని గుర్తు చేస్తుంది, దీంతో అపర్ణ ఆలోచనల్లో పడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమో లో రాహుల్ కావ్య మరియు రాజ్ కలిసి మట్టి తొక్కుతున్న వీడియో ని మీడియాలో వచ్చేలా చేస్తాడు, దానిని రుద్రాణి అపర్ణ కి చూపిస్తుంది. ఆవేశం కట్టలు తెంచుకున్న అపర్ణ కావ్య ని నిలదియ్యగా, మీ కొడుకు ఎక్కడ నాకు దగ్గరైపోతాడో అని భయపడుతున్నారు, అసలు మీరు మీ అబ్బాయిని నిజంగానే కన్నారా అని అంటుంది. దీనికి రాజ్ కి కోపం వచ్చి కావ్య చెంప పగలగొట్టబోతాడు, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.