Brahmamudi 18 ఆగస్ట్ 178 ఎపిసోడ్:కావ్య ని పుట్టింట్లో డ్రాప్ చేసి వెళ్తున్న సమయం లో అనుకోకుండా రాజ్ దేవుడి విగ్రహాలు తయారు చేసే మట్టిలో అడుగుపెడతాడు. అప్పుడు కనకం మరియు మూర్తి అయ్యో సూట్ బూట్ వేసుకొని మట్టిలో కాళ్ళు వేశారు ఏంటి బాబు అని అడుగుతారు. అప్పుడు కావ్య ఏ శుభకార్యం అయినా ఆయన తన చేతుల మీదుగా చెయ్యడం అలవాటు. అలాగే ఈ పనిని ఆయన తన కాళ్ళ మీద చెయ్యాలని ప్రారంభించారు అంటూ చెప్పుకొచ్చింది.

రాజ్ – కావ్య మట్టి తొక్కుతున్న వీడియో ని రాహుల్ కి పంపిన మీడియా రిపోర్టర్:
ఆ తర్వాత కావ్య ని కూడా అల్లుడితో కలిసి మట్టి తొక్కు అమ్మా అని అంటాడు మూర్తి. అలా ఇద్దరు మట్టిని తొక్కుతూ కాసేపు సరదాగా సమయం గడుపుతారు. ఇదంతా రాహుల్ అరేంజ్ చేసిన మీడియా రిపోర్టర్ రహస్యం గా ఫోటోలు మరియు వీడియోలు తీసి రాహుల్ కి పంపుతాడు. అప్పుడు రాహుల్ కి ఫోన్ చెయ్యగా , ఆయన చిరాకు పడుతాడు, ఎప్పుడుపడితే అప్పుడు కాల్ చేస్తావ్ ఏంటి అని, అప్పుడు ఆ మీడియా రిపోర్టర్ నా దగ్గర ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంది, అది నీకు ఉపయోగపడేది, ఒక్కసారి ఓపెన్ చేసి చూడు అని అంటాడు . ఆ ఫోటోలు చూడగానే సంబరపడిపోతాడు రాహుల్.

అనామిక కోసం కవిత రాస్తున్న మీడియా రిపోర్టర్ :
మరోపక్క తన అజ్ఞాత ప్రేయసి అనామిక ఫోన్ నెంబర్ కనుక్కునేందుకు కళ్యాణ్ మళ్ళీ కవిత రాయడమే మార్గం అని అర్థం చేసుకొని కవిత రాయడానికి కూర్చుంటాడు. సరైన ఐడియా ఒక్కటి కూడా తోచకుండా, రాసిన ప్రతీ పేపర్ ని విసిరేస్తూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ పేపర్స్ ని ఏరుకుంటూ ఉండడాన్ని గమనించిన కళ్యాణ్, అతనిని పిలిచి ఇక్కడ నా చుట్టూ తిరుగుతూ ఏమి చేస్తున్నావ్ రా అని అడుగుతాడు.

అప్పుడు ఆ వ్యక్తి మీరు రాసి విసిరేస్తున్న కాగితాలను కేజీల లెక్కన అమ్ముకుంటే బాగా డబ్బులొస్తాయి, అందుకే ఏరుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ ఇక్కడ నాకు సరైన ఐడియాలు దొరకడం లేదని మనసులో అనుకొని అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత అతను ఆ కాగితాలను అనామిక కి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఆ పేపర్స్ లో కళ్యాణ్ రాసిన కవితలను చదువుతూ మురిసిపోతుంది అనామిక.

తన తల్లిని ఎదిరించినందుకు కావ్య ని ఇంట్లో నుండి మెడపట్టుకొని గెంటేసిన రాజ్:
మరోపక్క రాహుల్ రుద్రానికి కావ్య రాజ్ తో కలిసి మట్టి తొక్కుతున్న వీడియో ని చూపిస్తాడు. దానికి ఎంతో మురిసిపోయిన రుద్రాణి, ఇక ఈ కొంపలో చిచ్చు పెట్టేస్తా అంటూ అపర్ణ వద్దకి వెళ్తుంది. అక్కడ ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా పిలుస్తుంది రుద్రాణి, అప్పుడు అపర్ణ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నది కనిపించలేదా అని సమాధానం చెప్తుంది. అప్పుడు రుద్రాణి నీ కొడుకు మట్టి కుండలు తొక్కుతూ ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నావా అని అంటుంది రుద్రాణి. అప్పుడు అపర్ణ కోపం తో పిచ్చి పట్టిందా నీకు, నా కొడుకు అలాంటి పనులు ఎందుకు చేస్తాడు అని అంటుంది. అప్పుడు రుద్రాణి కావ్య తో కలిసి రాజ్ మట్టి తొక్కుతున్న వీడియో ని చూపిస్తుంది. ఒక్కసారిగా అపర్ణ షాక్ కి గురి అవుతుంది ఇక మరుసటి ఎపిసోడ్ లో అపర్ణ కావ్య ని ఈ విషయమై నిలదీసి గొడవకి వస్తుంది. అప్పుడు కావ్య అపర్ణ కి ధీటుగా సమాదానాలు చెప్పడాన్ని గమనించిన రాజ్, కావ్య ని కొట్టబోతాడు. నువ్వెంత నీ బ్రతుకెంత, మా అమ్మనే అంటావా, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని ఇంటి నుండి గెంటేస్తాడు రాజ్. అప్పుడు కావ్య నేను ఎక్కడికీ వెళ్ళను, ఈ గుమ్మం వద్దే నిల్చుంటాను అని చెప్పి , జోరు వర్షం లో కూడా ఆమె ఇంటి బయటే ఉంటుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.