Brahmamudi 19 ఆగస్ట్ 178 ఎపిసోడ్: రాజ్ కావ్య తో కలిసి మట్టి తొక్కించడాన్ని కళ్యాణ్ మీడియా రిపోర్టర్ తో వీడియో చేయించి రుద్రాణి కి పంపడం, ఆమె అపర్ణ కి చూపించడం వంటివి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది చూసి ఆవేశం తో రగిలిపోయిన అపర్ణ రాజ్ కి ఫోన్ వెంటనే ఇంటికి రా అని కోపం తో పిలుస్తుంది .

రాజ్ తో మట్టి తొక్కించినందుకు కావ్యని నిలదీసిన అపర్ణ:
అప్పుడే కావ్య కూడా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్తున్న సమయం లో అపర్ణ ఆపేస్తుంది. ఈరోజు ఏ గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అని కావ్య అడగగా, నా కొడుకు నీకు ఎలా కనిపిస్తున్నాడు, వాడి చేతనే మట్టి తొక్కిస్తావా అని అంటుంది అపర్ణ. అప్పుడు కావ్య మాట్లాడుతూ ఓహో ఇదంతా మీ పనా అని రుద్రాణి వైపు చూసి మాట్లాడుతుంది. మా ఇంటిని 24 గంటలు గమనించమని ఏ మీడియా కి చెప్పారు అంటూ నిలదీస్తుంది.

రాజ్ కి మీరు నిజంగా తల్లేనా అంటూ అపర్ణ ని నిలదీసిన కావ్య :
అప్పుడు రుద్రాణి నోరు ముయ్, ఏమి వాగుతున్నావ్ అని అనగా అప్పుడు కావ్య మీరు మీ అబ్బాయి చేసే పనులే కదా ఇవి, ప్రతీ చిన్న విషయాన్నీ భూతద్దం లో చూపించి మా అత్తయ్య ని రెచ్చగొట్టి ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తున్నారు నువ్వు నీ కొడుకు అని అంటుంది కావ్య. అప్పుడు అపర్ణ ఇక చాలు ఆపు, నువ్వు చేసే తప్పుని కప్పి పుచ్చుకోవాలని చూడకు, నా కొడుకు చేతనే మట్టి తొక్కిస్తావా, ఎంత ధైర్యం నీకు అని అంటుంది. అసలు మీ సమస్య ఏమిటి అత్తయ్య, ప్రతీ చిన్న విషయాన్నీ పెద్దది చేస్తూ, ప్రతీరోజు ఎదో ఒక గొడవ పెట్టుకోవాలని ఎందుకు చూస్తున్నారు?, నేను మీ అబ్బాయి ఎక్కడ ఒకటైపోతామో అని మీకు భయం వేస్తుందా?, నన్ను ఈ ఇంట్లో నుండి బయటకి గెంటేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారా?, మీ కొడుకు కాపురాన్ని మీరే కూల్చేయాలని చూస్తారా?, అసలు మీరు రాజ్ కి నిజంగా తల్లి యేనా అని నిలదీస్తుంది కావ్య.

కావ్య ని ఇంటి నుండి గెంటేసిన రాజ్ :
అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్, ఏమన్నావు మా అమ్మ ని అని చెంప పగలగొట్టబోతాడు. మా తాతయ్య నేర్పించిన సంస్కారం అడ్డు వచ్చింది కాబట్టే ఈరోజు నువ్వు బ్రతికిపోయావ్ అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య మీ అమ్మకి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అని అంటుంది కావ్య. మా అమ్మకి ఏంటి, నువ్వు ఇంట్లో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. నిన్ను మా అమ్మ సంప్రదాయంగా పెళ్లి చూపుల ద్వారా చూసుకొని, ఇష్టం తో పెళ్లి చేయించిందా?, మోసం చేసి నువ్వే ఈ ఇంట్లోకి అడుగుపెట్టావ్, పోనీలే పాపం అని నిన్ను ఇంట్లో ఉండనిచ్చింది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా ఇంట్లో పెద్దలని గౌరవించి నా గదిలోకి రానిచ్చాను, నిన్ను భార్య నేనే ఒప్పుకోలేదు, ఇక మా అమ్మ నిన్ను కోడలిగా ఎందుకు చూడాలి అని అంటాడు రాజ్.

ఆయన అన్న మాటలకు కావ్య మనస్సు ముక్కలైపోతుంది. నీ ఇంటి ఆర్ధిక సమస్యలు, ఆత్మాభిమానం పేరుతో ఈ ఇంటి గౌరవాన్ని బజారుకి ఈడ్చావు, నీ ఇష్టమొచ్చినట్టు చేసుకుంటూ పోయి నీ హక్కులన్నీ సాధించుకున్నావు, నేను కూడా నీకు స్వేచ్చని ఇచ్చాను, ఈరోజు నువ్వు నా తల్లినే ఎదిరించి ఆ స్వేచ్చని దుర్వినియోగం చేసావు. ఇక ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, పో బయటకి అంటూ మెడపట్టుకొని గెంటేస్తాడు. అప్పుడు కావ్య ఎక్కడికి పోవాలి నేను అని అంటుంది, నీ పుట్టింటికి వెళ్ళు అని అంటాడు రాజ్. పెళ్ళైన తర్వాత ఇదే నా ఇల్లు, ఇప్పుడు నేను పుట్టింటికి వెళ్లి రెండు కుటుంబాలకు మచ్చ తీసుకొని రాలేను, మీరు నన్ను లోపలకు రానివ్వకపోతే, ఇక్కడే గుమ్మం వద్దే నేను నిల్చుంటాను అని అంటుంది కావ్య. అలాగే నిల్చుంటుంది కూడా, జోరు వాన పడుతున్నా కూడా లెక్క చెయ్యదు. ఇక మరుసటి ఎపిసోడ్ లో కనకం మరియు మూర్తి ఈ విషయాన్నీ తెలుసుకొని దుగ్గిరాల ఇంటికి వస్తారు. అక్కడ కావ్య వానలో నిలబడి తడుస్తూ ఉండడాన్ని చూసి చలించిపోయిన వాళ్లిద్దరూ ఇంత పెద్ద శిక్ష వేస్తారా, వీళ్ళు మనుషులా రాక్షసులా అని దుగ్గిరాల కుటుంబాన్ని నిలదియ్యడానికి లోపలకి వస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.