NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 29 జూలై 161 ఎపిసోడ్: అందరి ముందు రాజ్ కి స్వప్న చేత స్వారీ చెప్పించిన కావ్య..

Brahmamudi 29 july 2023 today 161 episode highlights

Brahmamudi 29 జూలై 161 ఎపిసోడ్: ఇక్కడ తినడానికి వచ్చినట్టు లేదు సంతాపానికి వెళ్లి వచ్చినట్టు ఉంది అని రుద్రాణి అంటుంది. నీ కోడలు చేసిన దానికి కడుపు నిండి ఏం మాట్లాడాలో తెలియకుండా ఉన్నామని అపర్ణ అంటుంది. వదిన మరదలు ఇద్దరూ ఒకరి మీద మాటలతో యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అయినా కోడలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకొని ఎవరికీ తెలియకుండా మందలించాలి కానీ, ఇలా అందరి ముందు తనని అవమానించడమే కాకుండా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని అనుకోవడం తప్పు.. కొడుకు కాపురం చక్కదిద్దాలే కాని కూలిపోవాలని చేయకూడదు అంటూ వాళ్ళ అమ్మ రుద్రానికి గడ్డి పెడుతుంది. ఈరోజు ఈ టాపిక్ కి ముగింపు పలకాలనే ఇక్కడికి వచ్చాను అని రాజ్ అంటాడు.

Brahmamudi 29 july 2023 today 161 episode highlights
Brahmamudi 29 july 2023 today 161 episode highlights

Brahmamudi Serial july 28 160 ఎపిసోడ్: స్వప్న చేసిన యాడ్ టెలికాస్ట్ ని ఆపించేసిన రాజ్..రాజ్ పై మండిపడ్డ స్వప్న!

ఆ యాడ్ చేసిన వాళ్ళకి 30 లక్షలు ఇచ్చి టెలికాస్ట్ కాకుండా బ్యాన్ చేశాను అని రాజ్ అంటాడు ఆ మాట వినగానే అపర్ణ తోపాటు ఇంట్లో వాళ్ళందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఇక ఆ యాడ్ ఇక ఎందులోనూ రాదా అని అనగానే రాదు నానమ్మ అని అంటాడు. ఆ మాటలు విన్న స్వప్న కోపంగా రాజ్ అని పెద్దగా అరుస్తుంది. ఎవరి పర్మిషన్ తీసుకొని ఈ యాడ్ బయటికి రాకుండా చేశావు రాజ్ అని రాజ్ మీద కోపంగా అరుస్తుంది స్వప్న. ఆ మాటలు విన్న కావ్య కోపంగా వాళ్ళ అక్కని అరుస్తుంది. నువ్వెవరివి నా భర్తని అరవటానికి నీ పరువు పోకుండా నా భర్త కాపాడాడు. అంతేకాకుండా లక్షలు పోసి నీ పరువు పోకుండా చేశాడు.

Brahmamudi 29 july 2023 today 161 episode highlights
Brahmamudi 29 july 2023 today 161 episode highlights

అందుకు నువ్వు కృతజ్ఞత చెప్పకుండా తననే తిరిగే అరుస్తావా అంటూ స్వప్నని తిడుతుంది. నా భర్త జోలికి వస్తే ఊరుకోను అంటూ స్వప్నకి చివాట్లు పెడుతుంది. కావ్య నీ అత్త నీ భర్త ఇంట్లో నుంచి నువ్వు వెళ్లాలని అనుకుంటున్నారు. కానీ నా భర్త మాత్రం నీ పరువు కాపాడి ఇంట్లో ఉండేలాగా చేశాడు అని కావ్య అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పగా ఆగు మర్యాదగా నా భర్తకి సారీ చెప్పేసి వెళ్ళు అని కావ్య అంటుంది. ఇక స్వప్న తప్పని పరిస్థితుల్లో రాజ్ కి స్వారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయికి కోపం కూడా వస్తుందా అని కావ్య ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

Brahmamudi 29 july 2023 today 161 episode highlights
Brahmamudi 29 july 2023 today 161 episode highlights

కావ్య రాజ్ దగ్గరికి వెళ్లి థాంక్యూ చెబుతుంది. నువ్వేదో నీకోసం మీ అక్క కోసం ఇదంతా చేశానని అనుకుంటున్నావేమో, నేను నా ఫ్యామిలీ పరువు కోసం ఇదంతా చేశాను అని రాజ్ అంటాడు. నాకు నీ థాంక్స్ ఏమీ అక్కర్లేదు అని రాజ్ అనగానే, అయితే నాకు తిరిగి ఇచ్చేయండి అని కావ్య రాజ్ తో అంటుంది. అలా ఎలా థాంక్స్ తిరిగిచ్చేస్తాం అని అంటే అయితే నేను మీకు ముద్దిస్తాను‌. మీకు అవసరం లేకపోతే నా ముద్దు నాకు తిరిగి ఇచ్చేసేయండి అని అంటుంది. వామ్మో దీనితో జాగ్రత్తగా ఉండాలి అని రాజ్ మనసులో అనుకుంటాడు.

Brahmamudi 29 july 2023 today 161 episode highlights
Brahmamudi 29 july 2023 today 161 episode highlights

స్వప్న కిందకి వెళ్లి కప్పులో గాజులు తీసుకొని వస్తుంది. ఏంటి ఇవి తీసుకొచ్చావు అని రాహుల్ అడుగుతాడు. నీకే వేసుకోవడానికి తీసుకొచ్చాను అని స్వప్న అంటుంది. నేను నీ భార్యను నా యాడ్ ఆపేసింది రాజ్. నువ్వు ఏమి చేయలేదు కదా అందుకే గాజులు వేసుకోమని ఇస్తున్నాను అని స్వప్న అనగానే.. కోపంగా రాహుల్ స్వప్నని కొట్టబోతాడు. ఇంకెందుకు ఆగావు కొట్టు అని స్వప్న అంటుంది కానీ నీకు ఇక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. స్వప్న మీ అక్కే నీకు పేరు రాకుండా ఆపుతుంది. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు నీకు మాత్రమే నేను చెప్పేదాకా ఆ విషయం తెలియడం లేదు అంటూ రాహుల్ స్వప్నకి కోపం వచ్చేలాగా చేస్తాడు. కావ్యకి ఎదురు తిరిగి నిలబడటం నావల్ల మా అమ్మ వాళ్ళే కాలేదు. నీవల్ల ఏమవుతుందని స్వప్న ఇంకా రెచ్చగొడతాడు రాహుల్. నేనంటే ఏంటో మీ అక్కకి చూపించి తీరుతాను అంటూ స్వప్న రాహుల్ కి ఛాలెంజ్ విసిరే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

కృష్ణమూర్తి ఇంటికి సేట్ పెద్ద మనుషులను తీసుకొని వస్తాడు. ఆ సెట్ కి బాకీ ఉన్న డబ్బులను వెంటనే కట్టమని అంటాడు. ఈ సీటు కను మా ఇంటి మీద పడిందని నేను తనకి ఈ ఇంటిని అమ్మనని డబ్బులు కట్టడానికి కాస్త టైం కావాలని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు ఆరు నెలలు సమయంలో 10 లక్షల అప్పు కట్టాలని రెండు రోజుల్లో నా వడ్డీ 50,000 కట్టకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని ఆ సేటు కనకంని బెదిరిస్తాడు ఇక అదే విషయాన్ని కళ్యాణ్ కావ్యతో చెబుతాడు కావ్య ఏం జరిగింది అని రాజ్ అడుగుతాడు తను ఏమీ చెప్పకపోవడంతో కళ్యాణ్ దగ్గరకు వెళ్లి రాజ్ అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాడు వదిన వాళ్ళింట్లో ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కళ్యాణ్ చెబుతాడు ఇక రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu