Brahmamudi 187 ఎపిసోడ్: స్వప్న కి వాంటింగ్స్ అవ్వడంతో ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లమని రుద్రాణి మరియు రాహుల్ కి చెప్తుంది ఇందిరా దేవి. ఆమె అలా చెప్పడం తో స్వప్న కంగారు పడిపోతుంది. తన డాక్టర్ స్నేహితురాలికి ఫోన్ చేసి మీ హాస్పిటల్ కి వస్తున్నాం, నువ్వే ఎలా అయినా మ్యానేజ్ చేసి నాకు కడుపు ఉన్నట్టు చెప్పు అని అడుగుతుంది స్వప్న. అప్పుడు ఆమె ఈరోజు నేను హాస్పిటల్ కి రావడం లేదు, మా అత్తయ్య వ్రతం చేస్తుంది నన్ను క్షమించు అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే రుద్రాణి, రాహుల్ స్వప్న వద్దకి వచ్చి ఇక హాస్పిటల్ కి పోదామా అని అడుగుతారు.

స్వప్న స్నేహితురాలు హాస్పిటల్ కి డుమ్మా..ఏమి చెయ్యాలో తోచని స్థితిలో స్వప్న:
అప్పుడు స్వప్న ఎప్పుడూ నాకు చెకప్ చేసే డాక్టర్ ఈరోజు రావడం లేదట, వేరే ఎప్పుడైనా చూపిద్దాం అత్తయ్య అని అంటుంది స్వప్న. వేరే రోజు రోజు ఎందుకు మీ డాక్టర్ రాకపోతే అమ్మకి తెలిసిన స్పెషలిస్ట్స్ ఉన్నారు , వాళ్ళతో టెస్ట్ చేయిద్దాంలే అని అంటాడు రాహుల్. అప్పుడు స్వప్న అలా డాక్టర్స్ ని మారిస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని అనగా, ఏమి అవ్వదు మేము చూసుకుంటాం పదా, మళ్ళీ వేరే రోజు అంటే నా టైం మొత్తం వేస్ట్ అవుతుంది అని అంటాడు.

అపర్ణ ఇంట్లో విధించిన రూల్స్ గురించి సుభాష్ కి చెప్పిన ఇందిరా దేవి :
మరోపక్క కావ్య ఇంట్లో అన్నీ వంటలు చేసి అందరిని డైనింగ్ టేబుల్ వద్దకి పిలవడానికి గంట కొడుతుంది. హోటల్ లో పెట్టినట్టుగా ప్రతీ ఐటెం దగ్గర పేపర్ తో రాసి పెడుతుంది. ఇదంతా చూసిన సుభాష్ ఏంటమ్మా ఇదంతా, వంట రెడీ అవ్వగానే మమల్ని పిలిస్తే సరిపోయేదిగా, హోటల్ లో పెట్టినట్టు ఇలా పెట్టావ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు సీతారామయ్య ఏమైందమ్మా , మీ మామయ్య ఎదో అడుగుతున్నాడు, దానికి సమాధానం చెప్పాలిగా, మౌన వ్రతం చేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఇందిరా దేవి కాదు , అత్త వ్రతం చేస్తుంది అని అంటుంది. అదేమీ వ్రతం అమ్మా అని సుభాష్ అడగగా, అందరి నోర్లను మూయించే వ్రతం. ఇంట్లో ఉన్నవాళ్లు, బయట నుండి వచ్చిన ఒక అమ్మాయిని ఒంటరి దానిని చేసిన వ్రతం.ఆ వ్రతం లో మా వయస్సు,పెద్దరికం అన్నీ కూడా హోమగుండం లో ప్రదేశం.అసలు ఏమైంది అమ్మా అని ఇందిరా దేవి అడగగా, ఈమె ఇంట్లో ఎవ్వరూ కూడా కావ్య తో మాట్లాడకూడదు అని రూల్ పెట్టింది అని చెప్తుంది.

వరలక్ష్మి వ్రతం ఇక నుండి కావ్య చేస్తుంది అని చెప్పిన ఇందిరా దేవి :
నీ భార్య ఇంట్లో అందరిని రూల్ చెయ్యాలని చేస్తుంది, మాకే ఆంక్షలు పెట్టి మమల్ని అదుపులో పెట్టాలని అనుకుంటుంది అని ఇందిరా దేవి సుభాష్ చెప్తుంది. అంత పెద్ద మాటలు ఎందుకు అత్తయ్య అని అపర్ణ అడగగా, దానికి ఇందిరా దేవి నేనేమైనా అబద్దాలు చెప్తున్నానా..? ఉన్న మాటే కదా చెప్తున్నాను అని అంటుంది. ఇదంతా నిజమేనా అపర్ణ అని సుభాష్ అడగగా, నేనేదో నేరం చేస్తున్నట్టు చెప్తున్నారు ఏమిటి, ఆ అమ్మాయి మట్టి తొక్కుతూ ఇంటి పరువు తీస్తుంటే ఎవరికీ పట్టదా? అని అంటుంది. మీరెన్ని చెప్పినా కావ్య ని ఈ జన్మలో క్షమించేది లేదు అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది.

మరోపక్క హాస్పిటల్ లో స్వప్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ అని అడుగుతారు. ఇక ఆ తర్వాత మెయిన్ డాక్టర్ రాలేదు అని తెలియడం తో ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య మళ్ళీ ఎప్పుడైనా వద్దాం అని అంటుంది. అప్పుడు రాహుల్ మాకేమి పనిపాట లేదు అనుకుంటున్నావా?, కాసేపు వెయిట్ చేస్తే పని అవుతుంది వెయిట్ చెయ్ అని అంటాడు. ఇక మరుసటి ఎపిసోడ్ లో వరలక్ష్మి వ్రతం కి ఏర్పాట్లు చేస్తూ ప్రతీ ఏడాది వరలక్ష్మి వ్రతం అపర్ణ చేస్తూ వచ్చింది, ఈసారి కావ్య చేస్తుంది అని అంటుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.