Brahmamudi 193 ఎపిసోడ్: అపర్ణ ని అవమానించిన రాజ్ : కావ్య ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయం లో రాజ్ ఫోన్ మాట్లాడుతూ వస్తూ పొరపాటున ముగ్గుని తొక్కబోతాడు. అప్పుడు కావ్య గట్టిగా అరుస్తుంది, రాజ్ అందుకు బెదిరిపోయి ఎందుకు అలా అరిచావు అని అంటాడు. అప్పుడు కావ్య ముగ్గు తొక్కేయబోయారు అని అంటుంది, నీ తొక్కలో ముగ్గు కోసం అంత గట్టిగా అరవాలా అని అంటాడు. ఆ తర్వాత తాతయ్య సీతారామయ్య అటు రావడాన్ని గమనించిన రాజ్, ఆయన ముందు కావ్య తో ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఎంత అందమైన ముగ్గు వేశావో, ఈ ముగ్గు మామూలు ముగ్గు కాదు , పెయింటింగ్ లాగ ఉంది.

మీ కుటుంబం మొత్తం కళాకారుల వంశం, అందుకే ఇంత అందమైన కళాకృతులు గియ్యగల్తున్నారు. మా అమ్మ ఉంది ఎందుకు, ఆమె ముగ్గు వేస్తె సాలెపురుగు గూడు కట్టుకున్నట్టు చండాలంగా ఉంటుంది అని అంటాడు. ఇదంతా అపర్ణ వింటుంది, అది గమనించిన రాజ్, తాతయ్య ముందు నటించడానికి ఈ కళావతి పొగిడితే సరిపోదా, అమ్మని అవమానించాలా అని మనసులో తనని తాను తిట్టుకుంటాడు.

అనామిక ని కలిసిన కళ్యాణ్ :
మరోపక్క అప్పు మరియు కళ్యాణ్ బైక్ లో వస్తుండగా ఒక కార్ వచ్చి గుద్దేస్తుంది. ఇద్దరు క్రింద పడిపోతారు, అప్పుడు అప్పు నేరుగా ఆ కార్ వద్దకి వెళ్లి, ఎవరు నువ్వు క్రిందకి దిగు అని అంటుంది. అప్పుడు ఆ కార్ నుండి అనామిక దిగుతుంది. మీ అయ్యా బాగా డబ్బులిచాడని, దారిన పొయ్యే ప్రతీ ఒక్కరిని ఇలాగే గుద్దుకుంటూ పోయి చంపేస్తావా అని అంటుంది అప్పు. అప్పు అనామిక తో గొడవపడడాన్ని చూసిన కళ్యాణ్ వెంటనే అక్కడికి వచ్చి బ్రో ఈ అమ్మాయి అనామిక అని చెప్తాడు.

అప్పుడు అప్పు అవునా, నీ పిచ్చి కవితలు చదివి పిచ్చిదైన అభిమాని ఈమేనా? అని అంటుంది. అలా వాళ్ళ మధ్య సంభాషణ పూర్తి అవ్వగా, అనామిక కళ్యాణ్ ని ఒక చోటుకి తీసుకొని వెళ్లాలని అంటుంది. అప్పుడు కళ్యాణ్ అప్పు ని అక్కడే వదిలేసి అనామిక తో కార్ లో వెళ్ళిపోతాడు. అనామిక కళ్యాణ్ ని తన ఇంటికి తీసుకెళ్లి అమ్మా నాన్నలకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఆమె తన రూమ్ కి కళ్యాణ్ ని తీసుకెళ్తుంది.

మాయమైపోయిన రాహుల్ – స్వప్న గురించి ఇంట్లో చర్చ :
అందమైన కవితలాగానే మీ గది కూడా ఉంది అంటూ కళ్యాణ్ పొగుడుతాడు. అలా అనామిక రూమ్ మొత్తం చూసిన తర్వాత గోడ మీద కళ్యాణ్ కవితలకు అనామిక ఫ్రేమ్ కట్టించడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నా కవితలను ఫ్రేమ్ కట్టించుకున్నారా అని అడగగా, కేవలం అక్కడి వరకే ఆగినందుకు చింతిస్తున్నాను అని జవాబిస్తుంది అనామిక. తన మీద చూపించిన అభిమానం కి కళ్యాణ్ ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. మరోపక్క దుగ్గిరాల ఇంట్లో రాహుల్ మరియు స్వప్న కనిపించకుండా పోవడం గురించి రుద్రాణి ని అడుగుతారు. ఏమో నాకు తెలియదు, తెల్లవారు జామున నన్ను నిద్ర లేపి ఇద్దరు కలిసి బయటకి వెళ్లిపోయారు అంటుంది రుద్రాణి.
అప్పుడు ఇందిరా దేవి కడుపుతో ఉన్న అమ్మాయిని తీసుకొని ఎవరైనా బుద్ధి ఉన్నోళ్లు హనీమూన్ కి వెళ్తారా,వాళ్ళు అలా వెళ్తుంటే నువ్వు ఎలా వెళ్లనిచ్చావు, ముందు వాళ్లకి ఫోన్ చేసి వెంటనే తిరిగి ఇంటికి రమ్మను అని రుద్రానికి చెప్తుంది ఇందిరా దేవి. అప్పుడు రుద్రాణి రాహుల్ కి ఫోన్ చెయ్యగా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఇంతకీ రాహుల్ మరియు స్వప్న ఎక్కడికి వెళ్లారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్, తదుపరి ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే.