Brahmamudi 8 ఆగస్ట్ 169 ఎపిసోడ్: కావ్య ని ఇరికించి ఇంట్లో అందరి చేత తిట్టించినందుకు రాహుల్ సంతోషం తో ఫుల్లుగా మందు తాగి స్వప్న దగ్గరకి వస్తాడు. నేను ఎంతో సంతోషపడే పని చేసావు, నీకు ఏమి కావాలో కోరుకో అని అడగగా, స్వప్న ఇదే మంచి సమయం , ఎలా అయినా శోభనం జరిపించుకోవాలి అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత స్వప్న మాట్లాడుతూ నాకు ఏమి వద్దు రాహుల్, నీ మనసులో నాకు కొంచెం చోటు కావాలి అంటుంది.

రాహుల్ తో శోభనం జరిపించుకున్న స్వప్న :
ఆ తర్వాత మెల్లగా రాహుల్ ని ట్రాప్ లోకి లాగి శోభనం జరిపించుకుంటుంది. పక్క రోజు రాహుల్ నిద్ర లెయ్యగానే, ఏమి జరిగింది అని అడుగుతాడు. అప్పుడు స్వప్న మనకి రెండవసారి శోభబనం జరిగింది అంటూ సిగ్గు పడుతూ చెప్తుంది. అప్పుడు రాహుల్ తాగేసి వచ్చి మళ్ళీ దీనితో కమిట్ అయ్యినట్టు ఉన్నాను అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత స్వప్న హమ్మయ్య మొత్తానికి నేను అనుకున్న పని పూర్తి చేశాను, త్వరలో నెలతప్పితే ఇక నాతో ఆడుకునేవాళ్ళే ఉండరు అంటూ మనసులో అనుకుంటుంది.

నాన్న షాప్ లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ రాజ్ కి చెప్పిన కావ్య :
మరోపక్క కావ్య మంచిగా రెడీ అయ్యి తన పుట్టింటికి వెళ్తూ రాజ్ వద్దకి వస్తుంది. ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్తున్నావు అని రాజ్ కావ్య ని అడగగా, నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్తుంది. నిన్న అంత గొడవ జరిగిన తర్వాత కూడా అక్కడికి వెళ్తున్నావా అని రాజ్ అడగగా, దానికి కావ్య సమాధానం చెప్తూ నేనేమి అత్తింటి సొమ్ము ని పుట్టింటికి తీసుకెళ్లడం లేదు, కావాలంటే నా బ్యాగ్ చూడండి అని అంటుంది. అప్పుడు రాజ్ ఇక్కడ నిన్ను దొంగ అని ఎవరూ అనలేదు అని అంటాడు. దొంగతనం చేశాను అని చెప్పినా బాగుండేది,కానీ నా శ్రమ ని దోచిపెడుతున్నాను అంటూ కామెంట్ చేసారు అని అంటుంది కావ్య. నేను నాన్న వాళ్ళ షాప్ లో పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది కావ్య. అదేంటి మీ ఇంట్లో వాళ్లకి అవసరమైన డబ్బులను ఇచ్చేసావు కదా, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు రాజ్. డబ్బు అవసరం తీరింది కానీ, సమస్య ఇంకా తీరలేదు అని సమాధానం ఇస్తుంది కావ్య. నీకు మన కంపెనీ లో జాబ్ ఆఫర్ ఇచ్చిన తర్వాత దానిని వదులుకొని ఇలాంటి పనులు చెయ్యడం ఏమిటి అని అంటాడు రాజ్. ఎందుకు చెయ్యాల్సి వస్తుందో రాత్రే మీకు చెప్పాను, ఈ ఇంటి నుండి నేను కష్టపడినా సొమ్ము అయినా కూడా రూపాయి కూడా పుట్టింటికి చేర్చను అని అంటుంది కావ్య. నువ్వు వెళ్తాను అంటే నేను ఆపను, కానీ నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య నాకు కూడా ఇష్టం లేదండి, కానీ తప్పడం లేదని బదులిచ్చి అక్కడి నుండి బయలుదేరుతుంది.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కను అంటూ తల్లితండ్రులకు వార్నింగ్ ఇచ్చిన కావ్య:
ఇదంతా రాహుల్ వింటాడు, దుగ్గిరాల కుటుంబానికి చెందిన కోడలు , ఇలా బయట పనిచేస్తుందంటే పెద్ద న్యూస్, మనకి బాగా పనికి వస్తుంది అని అనుకుంటాడు. మరోపక్క మూర్తి పెద్ద కాంట్రాక్టు చేతిదాకా వచ్చి వెళ్లిపోయిందే అని బాధపడుతుండగా, అప్పుడు శ్రీను మళ్ళీ మూర్తి వద్దకు వచ్చి, ఈ కాంట్ట్రాక్ట్ మీకే ఖాయం చేస్తున్నాను, ఇదిగో అడ్వాన్స్ అని ఇవ్వబోతాడు. అదేంటి కావ్య లేకపోతే కాంట్రాక్టు చెయ్యను అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చారు అని అంటాడు. కావ్య గారు ఈ కాంట్రాక్టు చేస్తానని చెప్పారు, మీకు తెలియదా అని మూర్తిని అడుగుతాడు శ్రీను. కావ్య ఈ పని చెయ్యడానికి ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను అని తెగేసి చెప్తాడు మూర్తి. అప్పుడు అక్కడకి వచ్చిన కావ్య ఎందుకు ఒప్పుకోరు అని నిలదీసి, మీరు అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళండి శ్రీను గారు , నేను మా నాన్న తో మాట్లాడి ఓపిస్తాను అని అంటుంది. శ్రీను అడ్వాన్స్ ఇచ్చి వెళ్లిన తర్వాత మూర్తి మళ్ళీ అదే మాట అంటాడు.

Krishna Mukunda Murari: మురారిని ఇరకాటంలో పెట్టిన కృష్ణ ప్రశ్న.. రేపటికి సూపర్ ట్విస్ట్..
ఇంట్లో వాళ్లంతా కూడా అదే మాట అంటారు. నువ్వు ఇక్కడ పనిచేస్తున్నట్టు మీ అత్తింట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని అంటారు. అయితే ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే జీవితం లో నేను మళ్ళీ ఈ గడప తొక్కను అని కావ్య బెదిరించి వెళ్తుండగా , మూర్తి మళ్ళీ వెనక్కి పిలిచి, సరే ఒప్పుకుంటున్నాను, కానీ నీ సంసారానికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ క్షణమే ఈ పని వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి అని అంటాడు మూర్తి, సరే అని అంటుంది కావ్య. మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో కావ్య చేస్తున్న పనులను మీడియా లో చూపించి దుగ్గిరాల కుటుంబం నరకయాతన పెట్టడం వల్లే కావ్య ఇలాంటి పనులు చేస్తుందా అని మీడియాలోకి వస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.