NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights

Brahmamudi June 01 Episode 425:  ఇందిరా దేవి ఆలోచిస్తూ ఉంటే కావ్య వచ్చి కాఫీ ఇస్తుంది. నేను కొన్ని అలవాట్లను మానుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది అమ్మమ్మ గారు. కావ్య మీకు తలకాయ నొప్పిగా ఉందని చెప్పారు అందుకే కాఫీ తీసుకొచ్చాను ఇది తాగండి తగ్గిపోతుంది అని అంటుంది. దుర్ వ్యసనాలు కొన్ని ఉంటాయని నాకు తెలుసు అవి ఒకలని అతిగా ప్రేమించడం అతిగా గౌరవించడం నమ్మడం అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది నేను నీ నుంచి దూరం అవ్వాలని అనుకుంటున్నాను నీకు నేను బాగా అలవాటు పడిపోయాను. నీ చేతి కాఫీ తాగడం నాకు అలవాటైపోయింది నువ్వు ఇప్పుడు నీ నిర్ణయం తీసుకున్నావు ఇకనుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డావు ఇవాళ కాకపోతే రేపైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అలాంటప్పుడు నేను నువ్విచ్చే కాఫీ తాగాలి అని అనుకుంటే ఎలాగూ అందుకనే నా నిర్ణయాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను నేను నిన్నేమీ తప్పు పట్టట్లేదు నువ్వు ఇవాళ కాకపోతే రేపైనా ఇకనుంచి వెళ్ళిపోయే దానివే కదా అని అంటుంది. దానికి కావ్య మనసులో బాధపడుతూ ఉంటుంది. మీకు నిజం చెప్పలేను ఆ మాయ నిజమైన మాయ కాదన్న విషయం మీకు చెప్పలేను అని బాధపడుతూ ఉంటుంది సైలెంట్ గా ఉన్నావంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డావు కదా అని అంటుంది. ఇక కావ్య కావ్య అక్కడ పెట్టబోతుంటే అవసరం లేదు తీసుకెళ్ళి ఓ అని అరుస్తుంది దాంతో కావ్య ఇందిరా దేవి అన్న మాటలకు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళిన తర్వాత అమ్మమ్మ గారు నేను నీకు ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నాను సహాయం చేద్దాం అంటే నువ్వే నీ సమస్యని కొని తెచ్చుకుంటున్నావు ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది.

Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights
Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights

మరోవైపు అప్పు మాయ కోసం వెతుకుతూ ఉంటుంది మాయ అడ్రస్సు ఒక షాప్ ఆవిడ చెప్తే అడ్రస్ కి వెళ్లి తలుపు కొడుతుంది తలుపు తీసిన అమ్మాయి మా ఫ్రెండ్ అని చెప్తుంది. అయితే మా ఎక్కడికి వెళ్లిందని అప్పుడు అడుగుతుంది ఊర్లోనే లేదు బయటికి వెళ్ళింది అని చెప్తుంది ఎప్పుడు వస్తుంది అని అడిగితే నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్పాలి అని అడుగుతుంది మాయ ఫ్రెండ్. నేను మాయ చిన్నప్పటి ఫ్రెండ్ ని మాయ కోసమే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది నా పేరు అప్పు అని కూడా చెప్తుంది దాంతో నేనైనా నమ్మలేకపోతున్నాను అని అంటుంది మాయ ఫ్రెండ్. సరే మాయ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు అంటే నేను ఇవ్వలేను మీరు ఎవరో తెలియకుండా అలా ఫోన్ నెంబర్ ఎలా ఇస్తాను అని అంటుంది సరే నా ఫోన్ నెంబర్ నీకు చెప్తాను మాయ రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు నా పేరు అప్పు అని చెప్పు తనకి గుర్తు పడుతుంది అని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తుంది కానీ మాయ ఎప్పుడు వస్తుంది? మీ పేరేంటి అని అడిగినా కూడా అమ్మాయి చెప్పదు. నువ్వు ఇంకా పాత రోజుల్లో మనిషిలానే ఉన్నావు ఈ రోజుల్లో వాళ్ళు ఇలా ఉండట్లేదు నేను ఏమైనా అబద్ధం చెప్తున్నాను పోలీస్ ట్రైనింగ్ అవుతున్నాను అని తెలుసా అని అంటుంది. మాయ రేపు వస్తుంది అని అమ్మాయి చెప్తుంది దాంతో అప్పు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ పేరేంటి అని అడిగితే సాహితీ అని చెప్తుంది ఆ తర్వాత అప్పు వెళ్ళిపోతుంది. మరోవైపు రుద్రాణి మాయ ఇద్దరు కలిసి కావ్య ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వచ్చి కావ్యని ఎవరో ఇక్కడ ఏదో చేస్తాను అని అన్నారు సైలెంట్ గా ఉన్నారు సంతకం కూడా చేయారు ఇక ఇప్పుడు అర్థమైందా ఈ రుద్రాణి అంటే, గొప్పలు చెప్పడం ఛాలెంజ్ లు చేయడం ఎవరైనా చేస్తారు కానీ గెలవడం చాలా కష్టం ఈ రుద్రాణి మీద గెలవడం ఇంకా కష్టం. ఇప్పటికైనా చాలెంజ్ చేస్తుందేమో అని రుద్రాణి అంటుంది మాయ ఇక గెలిచేది మనమే కదా అని అంటుంది. కావ్య మాత్రం సైలెంట్ గా ఉంటుంది.

Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights
Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights

ఇక మరోవైపు అదే టైంకి అప్పు కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అక్క అని అడుగుతుంది. ఎంగిలి విస్తరాకులు ఎంత ఎగసిపడినా చేరుకోవాల్సింది చెత్తలోకే కదా అని అప్పుతో మాట్లాడుతుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అక్క నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. నువ్వు ఎందుకు చేసావో అది చెప్పు అని అంటుంది కావ్య రేపు ఉదయం మాయ ఇక్కడికి వస్తుంది ఈ అడ్రస్ మాయదట అని అంటుంది సరే నేను వస్తాను అని అంటుంది కావ్య రేపు ఉదయాన్నే వెళ్దాం అని అంటుంది. అదంతా రుద్రాణి వింటుంది ఎక్కడికి అని అడిగితే గుడికి వెళ్లి దండం పెట్టుకుందామని అని అంటుంది మాయ దాంతో ఒక పిట్ట కథ చెబుతానని కావ్య స్టార్ట్ చేస్తుంది. రెండు గుంట నక్కలు స్టోరీ చెప్తుంది కావ్య వేటగాడు ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్న గుంటనక్కలు ఓవరాక్షన్ చేయకూడదు అలా చేస్తే గుండెనక్కకి ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య అమ్మో కావ్య తో జాగ్రత్తగా ఉండాలి అని మాయ అనుకుంటుంది ఇది అంత కాన్ఫిడెన్స్ గా ఉందంటే మనం ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండాలి అని రుద్రాణి కూడా మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు హాల్లో అందరూ కూర్చొని ఉంటే మాయ లగేజీ పట్టుకొని కిందకి వస్తుంది ఏంటి ఇలాగ జీతం వచ్చావు అని అడుగుతుంది రుద్రాణి. పార్టీ ఏమైనా ఇద్దామనుకుంటుందేమో అని స్వప్న అంటుంది నేను వెళ్తున్నాను అని అంటుంది మాయ ఎక్కడికి అని అడుగుతుంది రుద్రాణి సూట్ కేస్ పట్టుకొని బాత్రూంకి వెళ్తున్నావా అని స్వప్న అంటుంది. మరి సూట్ కేసు పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది రుద్రాణి ఇంటికి గుమ్మం బయట పడుకోవాలి ఇంట్లో పడుకోవాలి తెలియట్లేదు అని అంటుంది మాయ.

Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights
Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights

ఇక మాయ ఇన్నర్ ఫీలింగ్ అందరికీ అర్థమవుతుంది రాజు గదిలో తను పడుకోవాలి అని అనుకుంటుంది ఆ మాటని తన నోటితో అలా చెప్పకుండా కావాలని, ఇంట్లో అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుతూ ఉంటుంది ఈ ఇంట్లో నా స్థానం ఏంటో అర్థం కావట్లేదు ఎక్కడ పడుకోవాలి తెలియట్లేదు అని డ్రామా స్టార్ట్ చేస్తుంది మాయ, రుద్రాణి మాయకి వంత పలుకుతూ నీ పెళ్లికి అభ్యంతరం లేదని కావ్య పేపర్ మీద రాసి ఇచ్చింది. ఇంకా దేనికి భయపడుతున్నావు అని అంటుంది. నేను నా బిడ్డతో ఉండాలని అనుకుంటున్నాను నా బిడ్డ నన్ను ఇప్పటికే చాలా మిస్ అయ్యాడు ఇక వాని వదిలిపెట్టి నేను ఉండాలనుకోవట్లేదు కానీ నా బిడ్డ రాజ్ కి దగ్గరయ్యాడు.వాన్ని వదిలిపి నేను ఉండలేకపోతున్నాను వాడు నాకోసం దిగులు పెట్టుకుంటున్నాడు. మీరే ఆలోచించి ఏదో ఒక నిర్ణయం చెప్పండి అని అంటుంది మాయ ఇక రాజు గదిలో వెళ్లేందుకు మాయ ప్లాన్ చేస్తుందని ఇంట్లో అందరికీ అర్థం అవుతుంది వెంటనే స్వప్న నువ్వు మాట్లాడేది ఏంటి రాజు గదిలో కావ్య ఉంది నీకు ఆ విషయం తెలియట్లేదా నీకన్నా ముందు వచ్చింది కావ్య అని అంటుంది. ఇప్పుడు నువ్వు రాజు గదిలోకి వెళ్తే మా కావ్య ఏం కావాలి అని అంటుంది వెంటనే బిడ్డని వదిలి కన్నతల్లి ఉండలేకపోతుందేమో అని రుద్రాణి అంటుంది. ఇక ఇందిరా దేవి సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇన్నాళ్లు ఈ తల్లి ప్రేమ ఏమైంది ఈ తల్లి మనసు ఏమైంది తను ఉండలేకపోతున్న విషయం నువ్వు చెప్తున్నావా రుద్రాణి అని అంటుంది ఇందిరా దేవి. ఇక మాయ నేను నా బిడ్డతో ఉండాలి అనుకుంటున్నాను నా బిడ్డ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని అంటుంది. ఆ బిడ్డ రాజు గదిలో ఉన్నాడు కదా అని అంటారు నువ్వు వెళ్లి రాజు గదిలో ఉంటావా ఏంటి అని స్వప్న అంటుంది. ఆ ఉంటాను అని మాయ అనబోతుంటే, ఇందిరా దేవి అవునా రాజ్ గదిలో ఉంటావా అని అంటుంది. మీరు అనుమతిస్తే అని అంటుంది. వెంటనే ఇందిరా దేవి కోపంతో పళ్ళు రాలుతాయి అని అంటుంది. మాయ షాక్ అవుతుంది నీ మొఖం ఎప్పుడైనా చూసుకున్నావా? ఏ రోజైనా నీ ముఖంలో అమ్మతనం కానీ ఆడతనం కానీ నాకు కనిపించట్లేదు నువ్వు వెళ్లి నా మనవడి గదిలో పడుకుంటావా అని ఇందిరాదేవి అంటుంది. మీకెందుకో నేనంటే కోపంగా ఉంది మొదటినుంచి అని అంటుంది మాయ కోపం కాదు కోసి కుక్కలు చేయాలన్నంత కంపరంగా ఉంది అని అంటుంది ఇందిరాదేవి ఆ గదిలో ఉండే హక్కు నాకు మాత్రమే ఉంది కదా అని మాయ అంటుంది ఇక దాంతో ఇందిరా దేవి కోపంగా ఏమన్నా ఎంత ధైర్యం నీకు నా ముందే హక్కుల గురించి మాట్లాడుతున్నావా అలా ఉండడానికి నువ్వేమైనా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావా, సక్రమంగా నీకు పెళ్లి జరిగిందా సక్రమంగా బిడ్డని కొన్నావా? అక్రమంగా బిడ్డను కానీ ఇప్పుడు వచ్చి ఆకుల గురించి మాట్లాడుతున్నావా అని ఇందిరా దేవి మాయని కడిగి పడేస్తుంది.

Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights
Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights

ఇక వెంటనే స్వప్న చీర కొంగు, ధోపి ఏది వెళ్లి చూద్దాం ఎలా వెళ్తావో నువ్వు వెళ్లి రాజు గదిలోకి పడుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు అని అంటుంది స్వప్నం చూసి మాయ భయపడుతుంది. ఇక రాజు తప్పు చేస్తే అంతా నన్ను అంటున్నారు ఏంటి అని అంటుంది నువ్వు ఇంకాఇక్కడ ఉన్నావు అంటే అది అంతా మా సంస్కారం అని చెప్పుకోవాలి నీ తప్పు నా మనవడుమాత్రమే చేశాడా నువ్వు చేయలేదా రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లేదు అయినా కానీ నా మనవడు మాత్రమే తప్పు చేసినట్లు మాట్లాడుతున్నావు నేను ఇంట్లోకి రాణించాము అంత వాడికి సంతోషించు నువ్వు వచ్చి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడుతున్నావా అని ఇందిరా దేవి మాయం మీద కోప్పడుతుంది వెంటనే రుద్రాణి ఇప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటే మా అమ్మకి కోపం వచ్చి ఈ మాయని గెంటేస్తుందో ఏమో అని అనుకోని వెంటనే అమ్మ సైలెంట్ గా ఉండు నువ్వు కాస్త ఆవేశపడకు అని అంటుంది. ఇదంతా చూస్తున్న అపర్ణాదేవి కావ్య పెళ్లికి ఒప్పుకుంది పెళ్లికి ఒప్పుకున్నంత మాత్రాన నువ్వే పెళ్లి కాకముందే వెళ్లి గదిలో ఉంటానంటే కుదరదు ముందు పెళ్లి కానివ్వు తర్వాత ఆలోచిద్దాం ఎవరు ఎక్కడ ఉండాలో అని అంటుంది. సరేనని అంటుంది మాయ మా వదిన మాటంటే మాట కచ్చితంగా చేసి తీరుతుంది నువ్వే ఎవరికి తప్పిన తప్పక పోయినా నేను మాత్రం భరిస్తాను వచ్చి నా గదిలో ఉండు అని అంటుంది రుద్రాణి అందరి ముందు. ఇక వెంటనే స్వప్న ఇద్దరు ఒకటే కదా వెళ్లి ఉండండి అని అంటుంది. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్ స్వప్న అని అంటుంది నేను అందరూ ఉన్నారని చాలా తక్కువ మాట్లాడుతున్నాను అని అంటుంది. ఇక ఇద్దరూ, ఒకరికి ఒకరు పంచులు వేసుకుంటారు వికా స్వప్న ముందు ఏమీ మాట్లాడలేక రాహుల్ రుద్రాణి ఇద్దరు వెళ్ళిపోతారు ఇక అపర్ణ కూడా లేచి వెళ్ళిపోతుంటే మాయ కావాలని అందరి ముందు అత్తయ్య గారు అని పిలుస్తుంది దాంతో ఒక్కసారిగా కోప్పడుతుంది అపర్ణ. ఏమన్నావ్ అని అడుగుతుంది అత్తయ్య అని అన్నాను అంటే నాలిక చీరేస్తా నువ్వు తప్పు చేసి, ఇప్పుడు అత్తయ్య అని పిలుస్తున్నావా నా కొడుకుకి నీకు బిడ్డ పుట్టాడన్న ఒక కారణంతో నేను నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను అంతేకానీ నువ్వేదో మంచి దానివని కాదు ఇంకొకసారి నన్ను అత్తయ్య గారు అని పిలిచావంటే బాగోదు నువ్వు నన్ను జీవితంలో అత్తయ్య గారు అని పిలవడానికి నేను ఒప్పుకోను తొందరపడి బిడ్డని కన్నా ఆడది నా దృష్టిలో ఎప్పటికీ మంచిది కాదు అని అక్కడి నుంచి అపర్ణ కోప్పడి వెళ్ళిపోతుంది. తర్వాత మాయ భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న కావ్య ని చూసి, స్వప్న నువ్వు ఇక్కడే ఉంటే అది ఏదో ఒకరోజు రాత్రి నీ భర్త గదిలోకి దొరుకుతుంది వెళ్ళు అని అంటుంది. కావ్య కూడా వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights
Brahmamudi Today Episode June 1st  2024 Episode 425 highlights

ఇక మరోవైపు కళ్యాణ్ బుక్కు చదువుకుంటుంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రం బాగా ఉంటారు చేయని వాళ్ళు మాత్రం తప్పుకు బలైపోతుంటారు అని అంటుంది. వెంటనే ఎందుకు గొనుకుతున్నావు సరిగ్గా చెప్పు అని అంటాడు అవును బావగారి తప్పు చేస్తే మాయ ఎందుకు అవమానపడాలి అని అంటుంది ఆయనతో ఉండే అర్హత మాయకు మాత్రమే ఉంది అని అంటుంది అనామిక, మరి మా వదిన ఏమై పోతుంది అని అంటాడు ఇంకా వదిన అని ఎలా అని కలుగుతుందో బావగారి జీవితంలో ఇంకో ఆడది ఉందని తెలిసి కూడా ఇంకా ఈ ఇంటినే పట్టుకొని వేలాడుతుందంటే ఆమెకు ఎలాంటిదో అర్థం కావట్లేదా నీకు మోసం చేసి పెళ్లి చేసుకుంది ఇంటి హోదా కోసం దుగ్గిరాల ఇంటి గోడలు మాత్రమే అవడం కోసం ఇక్కడ ఉంటుంది అని అనామిక అంటుంది ఆ మాటలకు కల్యాణ్ ఆమె మీద కోపడతాడు. అవును ఎప్పుడు మీ వదిన చేయడమే నీకు సరిపోతుంది అని అంటుంది. నీకు అసలు ఆమె గురించి పూర్తిగా తెలియట్లేదు అని అంటే ఒకప్పుడు నీకు నాకు మధ్య ఆమె ఉన్నది ఆ విషయం నీకు అర్థం కావట్లేదు ఎంత హెల్ప్ చేసిందో నువ్వు మర్చిపోయావా అని అంటాడు కళ్యాణ్, అవును అప్పుడు హెల్ప్ చేసినట్టు నాటకం ఆడింది ఆ తర్వాత నేను కూడా ఆమె వెనకాల పడతాననుకుంది. నేను ఆమె మాట వినకపోయేసరికి అప్పుడు అడ్డం పెట్టుకొని మన మధ్య గొడవలు పెట్టింది ఎవరికి తెలియవు ఆమె నాటకాలు అని అంటుంది అనామిక ఇక ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో పెళ్లికి ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా అని పంతులు గారిని పిలిచి అడుగుతుంది అపర్ణ రెండు రోజుల్లో ఒక ముహూర్తం ఉంది. అతి కష్టం మీద అని అంటాడు పంతులుగారు. మరోవైపు అప్పు కాల్ చేస్తుంది కావ్యకి, అప్పుడే రుద్రాన్ని కూడా అటువైపు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి అప్పు కావ్య మాట్లాడుకోవడం వింటుంది అప్పుతో కావ్య ఆ నిజమైన మాయ నిజంగానే వస్తుంది కదా అని అంటుంది. వస్తుంది అని అప్పు ఉంటుంది ఇక ఆ మాట విని రుద్రాన్ని షాక్ అవుతుంది. కావ్యకి తెలియకుండా కావ్య ప్లాన్ ముందే తెలుసుకుంటుంది రుద్రాణి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella