NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi May 11 Episode 407

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు అలాగని నేను నిజం చెప్పకుండా తప్పు చేస్తున్నాను అపర్ణకు ఏదో జరుగుతుందని నేను బాధపడుతూ కూర్చుంటే ఇంట్లో నుంచి నా కొడుకు కోడలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఏ తప్పు చేయని రాజ్ ఈరోజు నిందలు పడాల్సి వచ్చింది ఏమీ తెలియని కావ్య ఇంట్లో నుంచి వెళ్లి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే నేనే పెద్దవాడిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అపర్ణకు ఏదో జరుగుతుందని చాలా పెద్ద తప్పు చేస్తున్నాను ఇప్పుడు అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఆపాలి ఇంట్లోనూ ఆఫీస్ లోనే సమస్యలు వస్తాయి నావల్ల రాజ్ కావ్య ఇద్దరు అవమానాలు కూడా పడుతున్నారు ఇక నేను ఇంట్లో పెద్ద వాడినై ఉండి ఏం లాభం నేను ఏదో ఒకటి చేయాలి ఇలా మౌనంగా ఉంటే కరెక్ట్ కాదు అని సుభాష్ అనుకుంటాడు. అపర్ణకు నిజం చెప్తే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది తన కాళ్లు పట్టుకొని నా ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపుతాను తను అప్పుడు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అంతే కానీ రాజ్ నీ ఇంట్లో నుంచి వెళ్ళనివ్వను అని అనుకుంటాడు.

Brahmamudi May 11 Episode 407
Brahmamudi May 11 Episode 407

ఇక మరోవైపు స్వప్న కొట్టిన దెబ్బలు చూసుకొని తల్లి కొడుకులు ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఈ స్వప్న కావాలనే కొట్టింది మమ్మీ, డబ్బులు దాని దగ్గర పెట్టుకొని మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో దాని అంతు చూడాలి అని అంటాడు రాహుల్. ఇప్పుడు దాని గురించి కాదు ఆలోచించాల్సింది ఈరోజు వదిన రాజకీయ ఇచ్చిన ఆఖరి రోజు ఇంట్లో నుంచి రాచి వెళ్ళిపోయే రోజు వదిన వెళ్లకుండా మనం ఆపాలి రాజుని బయటికి పంపించాలి అని కొడుకుతో చెప్తుంది రుద్రాణి. అవును మమ్మీ నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ స్వప్న గురించి తర్వాత చూసుకుందాం ముందుఅరాచని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని అంటాడు రాహుల్ సరే వెళ్దాం పద అని అంటే నువ్వు ముందు నువ్వు వెళ్లి మమ్మీ, నేను ఇలా వస్తే నాకు అన్ని చూసి అందరూ పెళ్ళాం చేతిలో దెబ్బలు తిన్నవా అని అనుకుంటారు అని అంటాడు. ఇప్పుడు మాత్రం అనుకోకుండా ఉన్నారా అని అంటుంది రుద్రాణి మమ్మీ నువ్వునన్ను అనడం కాదు ముందు హాల్లోకి వెళ్ళు నేను తర్వాత వెనకాలే వస్తాను అని రాహుల్ రుద్రాణిని పంపిస్తాడు. తర్వాత రాహుల్ వెనకాలే వెళ్తాడు ఇద్దరూ హాల్లోకి వెళ్లి ఏం జరుగుతుందో అని సోఫాలో కూర్చుని చూస్తూ ఉంటారు.

Brahmamudi May 11 Episode 407
Brahmamudi May 11 Episode 407

ఇక మరోవైపు అపర్ణ లగేజీతో సహా హాల్లోకి వస్తుంది ఇక అందరూ హాల్లోనే ఉంటారు.వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నావా అని అంటాడు. మీ వంతు వంశోద్ధారకుడు రానివ్వండి ఎవరు వెళ్లాలో ఎవరింట్లో ఉంటారో తెలుస్తుంది అని అంటుంది.అప్పుడే రాజ్ బాబుని ఎత్తుకొని కిందటి వస్తాడు రాజు కూడా లగేజీతో కిందకి దిగుతాడు అది చూసి అపర్ణ షాక్ అవుతుంది. అప్పుడే రుద్రని కూడా రాజ్ లగేజీతో వచ్చాడు అంటే వాళ్ళ అమ్మ కాకుండా వీడు వెళతాడు అంటుంది బయటికి అని అనుకుంటుంది. మనలాంటి వాళ్లకు దేవుడు సహాయం చేస్తాడు మమ్మీ అని అంటాడు రాహుల్. రాజ్ నా మూలంగా నువ్వు ఇల్లు వదిలి వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదమ్మా అని అంటాడు. నువ్వు ఇంట్లోనే ఉండు నేనే వెళ్ళిపోతాను అని అంటాడు అదే నిర్ణయం అని అడుగుతుంది అపర్ణ అవును అని అంటాడు రాజు అర్థమైంది. నువ్వు ఎప్పటికీ రహస్యాన్ని బయట పెట్టవు నీ ప్రాణం పోయినా నీమనసులో ఉన్న రహస్యాన్ని మాత్రం బయట పెట్టమని తేలిపోయింది ఆ బిడ్డ కోసం ని సర్వస్వాన్ని ద్వారపోసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నావు నేను ఇంట్లో నుంచి పంపించేస్తే నిజం బయటపడుతుందేమోనని నేను అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నిజం బయట పెట్టట్లేదు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డావు నీ ఒంట్లోనూ నా ఒంట్లోను ఒకటి రక్తం ప్రవహిస్తుంది. నేను ఎంతమంది గా ఉన్నాను నువ్వు అంతే మొండిగా ఉన్నావు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇల్లు రచ్చబండ అవుతుంది నేను నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను ఇంట్లో అందరి ముందు దోషులా మారిపోతాను ఇంట్లో అందరూ ధర్మాసం మీద నిలబడి తీర్పు చెప్పడం మొదలుపెడతారు. నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళిపోతాను అని లగేజీ పట్టుకుని అపర్ణ బయలుదేరుతూ ఉంటుంది. రాజ్ ఒక్క నిమిషం మమ్మీ అని అంటాడు. అపర్ణ ఆగుతుంది నువ్వు వెళ్లిపోయి, వేరే చోట ఉండలేవు మమ్మీ నువ్వు ఇంట్లోనే ఉండు అంటే అంత జాలి నా మీద చూపించాల్సిన అవసరం లేదు అని అపర్ణ దండం పెడుతుంది.

Brahmamudi May 11 Episode 407
Brahmamudi May 11 Episode 407

ఇక ఆపన్న మాట్లాడుతూ నువ్వు నా మాటకు విలువ ఇవ్వనప్పుడు ఇంట్లో నా నిర్ణయం తప్పని అందరూ తేల్చినప్పుడు నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా అని అంటుంది. నీ త్యాగాలను చూసి భరించే అంత శక్తి నాకు లేదు ఈ లోకంలో చాలా పెద్దది నాకెంతో కొంత చోటు ఉంటుంది సంతోషం లేకపోయినా ఇంకో దారి చూసుకుంటాను అంతే తప్ప వెనక్కి తిరిగి రాను అని అపర్ణ చెప్పి లగేజీ తీసుకొని బయటికి వెళుతూ ఉంటే వెంటనే సుభాష్ ఒక్క నిమిషం అపర్ణ అని అంటాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు కదా వెళ్లే ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి అని అంటాడు. దాంతో రాజు షాక్ అవుతాడు ఇక రాజు తప్పు చేయలేదని నిజం దాచి పెడుతున్నాడని కోపంతో నువ్వు ఇంట్లో నుంచి వెళ్లాలని అనుకుంటున్నావు కానీ అసలు ఎందుకు దాచిపెడుతున్నాడు దాని వెనక ఎంత పెద్ద కారణం ఉంటే దాచి పెడుతున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించావా అని అంటాడు సుభాష్. ఆ నిజం ఏంటో మీకు తెలుసా ఆ బిడ్డ ఎవరో మీకు తెలుసా ఆ బిడ్డ తల్లి ఎవరో మీకు తెలుసా అని అపర్ణ అంటుంది. అవును ఇవాల్టితో ఈ రిసల్ట్ అయిపోవాలి. అసలు రాజు ఎలాంటి వాడో మీ అందరికీ తెలియాలి అని సుభాష్ అంటాడు. అసలు రాజ్ అని సుభాష్ నిజం చెప్పబోతూ ఉంటే కావ్య ఒక్క నిమిషం మావయ్య గారు అని ఆపుతుంది. అది కాదు కావ్య నన్ను మాట్లాడు నువ్వు అని అంటూ ఉంటే ఒక నిమిషం మావయ్య గారు ఇప్పుడు మీరు ఏం చెప్పాలి అని అంటుంది. నేను మీతోను మీ అబ్బాయి తోను మా అత్తగారితోను మాట్లాడాలి అని కావ్య అంటుంది. నేను చెప్పేది కూడా ఒకసారి విను అని సుభాష్ అంటాడు ఏం చెప్తారు మీరు బిడ్డతో వచ్చిన మీ అబ్బాయి గుణవంతుడు అని చెప్తారా ఈ గుణవంతుడికి తల్లి అయిన మీ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని కట్టుబట్టలతో రెడీ అవ్వడం చూసి, కోడలు కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆపలేని మీరు ఇప్పుడు భార్య వెళ్ళిపోయేసరికి మీకు నష్టం జరిగిపోతుందని ఆపడానికి ముందుకు వచ్చారా అని అంటుంది. అది కాదు కావ్య నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అంటాడు సుభాష్ అవును అదే నిజం నా ఉద్దేశం అది కాదు అని సుభాష్ అన్నా కానీ మీరు ఆగండి మీ అబ్బాయితో మీతో నేను తర్వాత మాట్లాడతాను ముందు మా అత్త గారితో మాట్లాడి ఇవ్వండి అని అంటుంది. ఇక కావ్య అపర్ణ వైపు తిరిగి మీరు ఇంట్లో నుంచి వెళ్లడానికి ఒక గడప తేడా ఉంది ఆ గడప దాటి మీరు బయటికి వెళ్తే నేను అడగాల్సినవి అడగలేను అందుకే ఇప్పుడే అడుగుతాను అని కావ్య అంటుంది. మీరు ఏదైనా సాధించి ఆ గర్వంతో ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారా అలా వెళ్తే, ఎవరు ఏమీ అనుకోరు. నేనంటే మీకు లెక్క లేదని నాకు తెలుసు కానీ మీ గురించి లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం నాకు వచ్చింది అని అంటుంది కావ్య. అసలు మీరు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్తున్నారు? ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళమన్నారు మీరు ఏం సాధించి ఇంట్లో నుంచి వెళ్తున్నానని మీరు అనుకుంటున్నారు మీరు ఓడిపోయి ఎవరి ముఖం చూపించలేక వెళ్తున్నారా అని కావ్య అంటుంది. ఇక రుద్రాణి ఇదే మంచి సమయం అనుకొని, ఏంటి మా వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావా కడుపులో ఉన్నవన్నీ కట్టేస్తున్నావా అని అంటుంది. గడప దాటక ముందే అవమానించాలని నిర్ణయించుకున్నావా అని రుద్రాణి అంటుంది దాంతో ఒక్కసారిగా రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది కావ్య. ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు నన్నే ఏక వచనంతో పిలుస్తున్నావా అని అంటుంది అవును మా అత్త కోడల మధ్య దూరితే ఇట్లానే పిలుస్తాను ఇంకా ఆగితే ఏమైనా అంటుందేమో అవసరమా మీకు అని స్వప్న అంటుంది. ఇక రాహుల్ కూడా స్వప్నని అర్వబోతే ఇది దిగ్గిరాల ఇంటి సమస్య మీరు ఇందులో మధ్యలో దొరికితే దుమ్ము కొట్టుకొని పోతారు అని అంటుంది స్వప్న దాంతో రాహుల్ రుద్రాణి సైలెంట్ అవుతారు.

Brahmamudi May 11 Episode 407
Brahmamudi May 11 Episode 407

ఇక మరోవైపు కావ్య తో అపర్ణ నువ్వు నన్ను ఆపుతున్నావు అంటే నేను ఓడిపోయానని నువ్వు మాట్లాడుతున్నావా అని అంటుంది. మరి గెలిచానని మీరు అనుకుంటున్నారా అని అంటుంది కావ్య తల్లిగా తప్పుకొని గెలిచారా లేదంటే భార్య గా ఓడిపోయి వెళ్ళిపోతున్నారా కోడలిగా తప్పుకుని గెలిచారా ఇందులో గెలిచారు ఒక నిమిషం ఆలోచించి నాకు చెప్పండి అని అంటుంది కావ్య. మీరు ఎందులో గెలిచారు రుజువు చేయగలరా అని అడుగుతుంది మీ మీద మీకు నమ్మకం లేదు అందుకే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు మీ కొడుకు నిజం చెప్పలేదని కోపంతో వెళ్లి పోవాలి అనుకుంటున్నారు నిజం బయటపెట్టించాల్సిన అవసరం మీకు లేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. మీ పెంపకం మీద మీకే నమ్మకం లేకపోతే మీ కొడుకు మీద మీకే నమ్మకం లేకపోతే ఉండి మాత్రం న్యాయం చేయగలను అని మీరు అనుకుంటే ఆ న్యాయం ఏదో ఇక్కడ నిలబడి చేయండి అంతేకానీ బయటికి వెళ్లిపోతే గెలిచినట్టు కాదు కదా అని అంటుంది కావ్య మీరు ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేస్తే అప్పుడు ఓడిపోయిన గెలిచిన ఒక లెక్కగా ఉంటుంది అంతేకానీ ఇలా బయటికి వెళ్లిపోయి గెలిచాను అనుకుంటే ఎలాగో అని అంటుంది కావ్య. వెంటనే రాజ్ మా అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావా తప్పొప్పులు మా అమ్మకే చెప్పేంతదానివి అయిపోయావా? కళావతి అని అంటాడు రాజ్. మీ అమ్మగారు వెళ్లిపోతానంటే నన్ను దిక్కు లేని దానిలా చేసి మీరు మీ దారి చూసుకుంటాను అంటే అప్పుడు మీకు ఏది తప్పు ఏది రైటో అని అడిగే అర్హత లేదు. మిమ్మల్ని అడిగే టైం వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను అంతవరకు మీరు సైలెంట్ గా ఉండండి అని అంటుంది కావ్య. నువ్వేంటి మమ్మల్ని నిలదీసేది మాతో లెక్కలు తెచ్చుకునే అంతదానివి అయిపోయావా పెళ్లి కొనులా పడి ఉండే దానివి నేను వెళ్ళిపోతాను గడప దాటతాను అని నీకు అర్థమయ్యేసరికి ఇప్పుడు పులిలా నూరేళ్లు మాట్లాడుతున్నావా అని అంటుంది అపర్ణ. అవును మీరు గడప దాటించడం ఈ పిల్లి కోన కూలవుతుంది ఈ రుద్రాణి రాజమాత అనుకుంటుంది ఈ దాని లక్ష్మీ ఏక చక్రాతిపత్రం వహిస్తుంది. ఈ అనామిక నేను మహారాణిని అయిపోయాను అని మొగుణ్ణి కూడా లెక్కచేయకుండా ఇంటికి పెద్దరికనే ప్రశ్నిస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది అలాంటి పరిస్థితి ఇంట్లో వస్తుంది నేను పిల్లిగా ఉన్న నేను పులిగా మారడం కాదు ఈ ఇంట్లో పిల్లిగా ఉన్న వాళ్ళందరూ ఎలా మాట్లాడుతారు ఆలోచించుకోండి.మీరు ఇల్లు వెళ్లిపోతే నిజం బయటపడిపోతుందని మీరు అనుకుంటున్నారా అబద్ధమే ఇక్కడ అలానే ఉంటుంది అసమర్థులైన వాళ్ళందరూ ఎక్కుతారు మీరు ఒక తాటిపై నడిపించిన ఇల్లు ముక్కలైపోతుంది అంతకన్నా మీరేం మారుతుంది అని అనుకుంటున్నారు అని అంటుంది దాంతో అపర్ణ ఆలోచిస్తుంది. మీరంతా ప్రపంచ చాలా స్వచ్ఛంగా ఉండాలి అని కోరుకుంటున్నారు అసలు ఇల్లు అంత స్వచ్ఛంగా ఉందా ఇంట్లో నిజం నిద్రపోతుంది అబద్ధం రాజ్యం ఏలుతుంది మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే మీ అబ్బాయి దుగ్గిరాల వారసుడు గా ఈ బాబుని ఇక్కడ ఉండిపోతాడు అని అంటాడు. అప్పుడు ఇంట్లో ఉండండి మీరు ఒక్కరే అవుతారు అది మర్చిపోకండి అని అంటుంది ఇక మరి మీరు ఏం సాధించారని ఇల్లు వెళ్లి వెళ్లిపోదాం అనుకుంటున్నారు అని కావ్య అడగానే వెంటనే అపర్ణ నేను ఎలా ఉన్నాను అది పక్కన పెట్టు నేను ఎలా వెళ్లాలో ఎలా వెళ్ళకూడదు అన్నది తర్వాత, నువ్వు చెప్పినట్లు నేను అందరితో కలిసి ఇక్కడే ఉంటాను ఇదంతా భరించే శక్తి నాలోనే ఉందని ఇక్కడే ఆగిపోతాను మరి నిజం బయట పెట్టే సత్తా నీలో ఉందా అని అపర్ణ కావ్యకు పెద్ద ప్రశ్న వేస్తుంది దాంతో కావ్య ఏం చెప్పాలో తెలియక షాక్ అవుతుంది. నేను ఇంట్లోనే ఉంటాను మరి నువ్వు నిజం బయటపెడతావా అని అపర్ణ అడిగేసరికి రాజ్ కావ్య ఇద్దరు షాక్ అవుతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 11 Episode 407
Brahmamudi May 11 Episode 407

రేపటి ఎపిసోడ్లో కావ్యతో సుభాష్ నేను ఆరోజు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఈరోజు చెప్పాలి అని అనుకొని వచ్చాను అంటాడు. మీరు చెప్పకపోయినా నాకు అంతా తెలుసు అని అంటుంది కావ్య దాంతో సుభాష్ షాక్ అవుతాడు. అందుకే అత్తయ్య ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపాను అని అంటుంది. కావేరి నిజం తెలిసిపోయిందని సుభాష్ ఆశ్చర్యపోతాడు. మరోవైపు రాజుతో కావ్య సవాల్ చేస్తుంది ఎలాగైనా ఆ అమ్మాయి సప్త సముద్రాల అవతల మేడ మీద ఉన్నా గాని నేను తీసుకొచ్చి తీరతాను ఆ అమ్మాయి ఎవరో కనిపెడతాను ఆ బిడ్డ తల్లిని ఆ తీసుకొచ్చి అత్తయ్య ముందు నిలబడతాను మీరు దయచేసి నాకు అడ్డం రావద్దు అని కావ్యా రాజ్ తో అంటుంది. రాజ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా అలానే కావ్య వైపు చూస్తూ నిలబడతాడు. కావ్యకి నిజం తెలిసిపోయిందని సుభాష్ కావ్య ఎక్కడ నిజం బయటపడుతుంది అని రాజ్ కళావతి గురించి ఆలోచిస్తారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri