NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

Brahmamudi May 13 Episode 408

BrahmaMudi:అపర్ణ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని చెప్పడంతో, కావ్య ఇంట్లో నుంచి వెళ్లి మీరేం సాధిస్తారని నిలదీస్తుంది. అయితే నేను ఇంట్లోనే ఉంటాను నువ్వేం సాధిస్తావు అని అడుగుతుంది. నేను అడిగింది తీసుకొస్తావా ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకురావాలి అలా తీసుకొచ్చేటట్టు అయితే నేను ఇంట్లోనే ఉంటాను అని అంటుంది. కళావతికి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉంటుంది ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉన్నా సరే మీ అబ్బాయి నోరు తెరిచి నిజం చెప్పకపోయినా సరే ఆమెని అజ్ఞాత నుంచి బయటికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అని సవాల్ విసురుతుంది కావ్య. సరే చూద్దాం నేను ఇంట్లోనే ఉంటాను నువ్వు వెళ్లి ఆ బిడ్డ ఎలా తీసుకొస్తావో చూస్తాను అని అంటుంది. అత్త కోడలు సై అంటే సై అని సవాల్ చేసుకుంటారు. రాజ్ సుభాష్ ఇద్దరు ఆశ్చర్యపోతారు.

Brahmamudi May 13 Episode 408
Brahmamudi May 13 Episode 408

ఇక రాజ్ కావ్యతో రూమ్లో నీకు అసలు ఏం తెలుసని మా అమ్మతో అలా మాట్లాడావు మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే నేను చెప్పే సమాధానం అదేనా అని అడుగుతాడు మరి ఏం చెప్పమంటారు అని అడుగుతుంది కావ్య. ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తానని ఎందుకు మా అమ్మకి ప్రతిజ్ఞలు చేశావు అని అడుగుతాడు. ముందైతే ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపాను కదా అని అంటుంది కావ్య. ఆపడానికి ఇదేనా దారి అని అడుగుతాడు. ఇంతకన్నా నాకు ఆ టైంలో ఏం చెప్పాలో తెలియలేదు అయినా ఆ బిడ్డకు ఎవరో ఒకరు తల్లి ఉంటారు కదా ఆ తల్లినే తీసుకొస్తాను అని అంటుంది. మీ పాటికి మీరు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతే నేనేమైపోవాలి ఇంట్లో పనిమనిషిలా పడి ఉండాలా ఆ వంటగదికి మహారాణి అనుకోని బతకాల, ఈ పడక గదిలో మీరు లేకుండా నేను ఒక్కదాని స్వర్గ సుఖాలు అనుభవించాలా అని అంటుంది. మీరు బ్యాక్ సర్దుకొని వెళ్ళిపోయి నాకు అన్యాయం చేస్తే ఊరుకోవాలా అని అంటుంది ఇంట్లో ఒక భార్య ఉందని ఆవిడకి సంవత్సరం క్రితం మీరు మెడలో తాళి కట్టాలని బ్రహ్మముడి పడిందని మీకు గుర్తు రాలేదా అని రివర్స్లో కావ్య రాజు మీద ఎటాక్ చేస్తుంది. నువ్వు మాట మార్చొద్దు నేను అడిగేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అని అంటాడు నేను చెప్తుంది కూడా అదే కదా మీ అమ్మగారిని ఆపడానికి నా దగ్గర ఇంకో దారి దొరకలేదు అందుకే ఇలా చెప్పాను అపర్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా మీ ఇంట్లో వాళ్ళు ఒకలైన ఆపగలిగారా అంటూ, నువ్వు ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తే అని రాజ్ అంటూ, ఆగిపోతాడు ఏంటి ఆగిపోయారు ఆ బిడ్డకు తల్లి లేదా ఏంటి ఎవరో కడుపులో నుంచే కదా వాడు కూడా వచ్చింది. నువ్వు మా ఇంట్లో విషయాలు జోక్యం చేసుకోవద్దు అని అంటాడు. వెంటనే కావ్య అవును నేను జోక్యం చేసుకోకుండా రాహుల్ రుద్రాణిలా ఏం జరుగుతుందో ఆ నిలబడి చేతులు కట్టుకొని చూస్తూ ఉండమంటారా నాకు అలాంటివి చేతకాదు అని అంటుంది కావ్య. మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీకు పర్వాలేదా ఆమె ఇంట్లో నుంచి వెళ్లకుండా ఎవరైనా ఆపగలిగారు. ఎవరు ఆపలేదు కానీ ఇప్పుడు మాత్రం నా మీద అరుస్తున్నారు. నాకు రెస్పెక్ట్ ఇవ్వడం ముందు నేర్చుకోండి అని అంటుంది కావ్య. మీరు ఎన్నైనా చెప్పండి, ఆవిడ ఈ భూమండలం మీదే ఉంది కదా ఈ బిడ్డ తల్లి చంద్రమండలంలో లేదు కదా సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి మీ అమ్మగారి ముందు నిలబెడతాను దయచేసి నాకు అడ్డు రాకండి అని అంటుంది. ఇక కావే వెళ్ళిపోయిన తర్వాత ఈ తింగరిది ఏది అనుకుంటే అది జరిగేదాకా నిద్రపోదు ఇప్పుడు ఏం చేయాలి అని రాజు ఫీల్ అవుతాడు.

Brahmamudi May 13 Episode 408
Brahmamudi May 13 Episode 408

ఇక కావ్య రాజ్ తో మాట్లాడి బయటికి వచ్చేసరికి ఎదురుగా సుభాష్ ఉంటాడు. నేను మీ అత్తగారితో మాట్లాడదాం అనుకునే టైం కి నువ్వు ఎందుకమ్మా నన్ను ఆపావు అని అంటాడు. నువ్వు ఎందుకు నన్ను ఆపావో నాకు అర్థం కాలేదు అని అంటాడు బిడ్డ విషయంలో నా కొడుకు సర్వస్వం వదులుకోవడం మీ అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అంతా చూస్తూ ఉండలేకపోయాను అందుకే నిజం చెప్పాలనుకున్నాను అంటాడు సుభాష్. అందుకే అడ్డుపడ్డాను మావయ్య గారు నాకు మొత్తం తెలుసు అని అంటుంది ఆ మాటలకు సుభాష్ షాక్ అవుతాడు మీరు ఏ దారుణం జరిగిందని నిజాన్నిదాచారో ఆ నిజం ఏంటో నాకు తెలుసు అది నిజంగా బయట పెడితే ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు అని అంటుంది కావ్య. ఏ మామగారు ఏ కోడలితో మాట్లాడలేని చర్చించలేని తప్పు జరిగిపోయింది అని అంటాడు సుభాష్ ఇప్పుడు తప్పులు గురించి చర్చించి ఏం లాభం లేదు నన్ను క్షమించండి నాకు ఈ విషయం గురించి తెలిసిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. చివరికి మీ అబ్బాయి కూడా ఈ విషయం తెలియదు అందుకే మీరు మాత్రం ఈ విషయం బయట పెట్టొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రాహుల్ ఋతురా నీ దగ్గరికి రెండు బాక్స్ తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అని అంటాడు. నీకు ఈ టైంలో వెకేషన్ ఎంజాయ్ చేయడం కావాలా అని అంటుంది వెకేషన్ కాదు మమ్మీ ఆ కావ్య ఉంటే మనం ఇంట్లో ఏమి చేయలేము ఆ కావ్య మనల్ని మెడ పట్టుకొని బయటికి గెంటే ముందే మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే గౌరవంగా ఉంటుంది అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది అవును మమ్మీ ఇంట్లో మనం ఉంటే ఆ కావ్య ఏదో ఒక రోజు నేను చెప్పినట్లుగా మన ఇంట్లో నుంచి బయటికి వస్తుంది అని నువ్వు చూసావు కదా వాళ్ళ అత్తని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపింది. రాజ్ ఇంట్లో నుంచి వెళ్లలేదు ఇక కావ్య ఏం చేస్తుందో ఏంటో అని అంటాడు నువ్వు నీ తల్లి గురించి తక్కువ అంచనా వేయొద్దు. నేను చెప్పే దాని గురించి ఆలోచించు ఆ కావ్య ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తానంది అలా జరిగితే నష్టపోయేది ఎవరు ఆ కావ్య కదా పోనీ తీసుకురాకపోతే నష్టపోయేది కూడా కావ్య కదా మా వదినకి మాట ఇచ్చింది ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తానని తీసుకురాకపోతే మా వదిన ఊరుకుంటుందా? కావ్య ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటికి పంపిస్తుంది. రెండిట్లో ఏది జరిగిన మనకే చూస్తూ ఉందాం అని అంటుంది. దానితో రాహుల్ నిజమే మమ్మి నువ్వు చెప్పింది అని అంటాడు.

Brahmamudi May 13 Episode 408
Brahmamudi May 13 Episode 408

ఇక మరోవైపు ఇందిరా దేవి కావ్య దగ్గరికి వచ్చి నువ్వు అసలేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అని అంటుంది. నేనేం చేశాను అమ్మమ్మ గారు అని అంటుంది లేకపోతే వదిలేసి వెళ్లిపోయిందని తీసుకొస్తావా మీ అత్తకి మాట ఇచ్చావు ఇప్పుడు ఏం చేస్తావు ఇంట్లోని స్థానం గురించి ఆలోచించావా ఆ బిడ్డ తల్లి ఇంటికి వస్తే నీకు సవతి అవుతుంది అన్న విషయం నీకు తెలియదా అని అంటుంది. కావ్య మనసులో నా సవతి కాదు మా అత్తకి సవతవుతుంది అని అనుకుంటుంది. అభయ మీకు అవసరం లేదులే అని అంటుంది వెంటనే అదేంటి అని అంటుంది. వెంటనే కావ్య అదేం లేదు మా అత్తగారింట్లో నుంచి వెళ్లిపోకుండా ఉండడానికి నాకు ఇంతకన్నా దారి దొరకలేదు అని అంటుంది. ఈ మంచితనమే వద్దని చెప్పాను అని ఇందిరా దేవి అంటుంది. అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రాజు తప్పు చేస్తే ఆ బిడ్డతల్లి కూడా వచ్చిన్యాయం చేయమని అడగాలి కదా అలాంటిది ఎందుకు రాలేదు. బిడ్డని వదిలిపెట్టి తల్లి ఎక్కడైనా ఉంటుందా అని అంటుంది. వెంటనే కావ్యకి అనుమానం వస్తుంది ఇందిరా దేవి మాట్లాడి మాటలకి కావ్యకి అనుమానం వస్తుంది. దాంతో కావ్య థాంక్స్ అమ్మమ్మ గారు అని అంటుంది ఇప్పుడు నేను ఏమన్నాను దీనికి అర్థమైంది అని అనుకుంటుంది.

Brahmamudi May 13 Episode 408
Brahmamudi May 13 Episode 408

ఇక మరోవైపు కళ్యాణ్ ని తన వైపుకు తిప్పుకోవడానికి అనామిక అందంతో పడేయాలి అనుకుంటుంది. కళ్యాణ్ రూమ్ లోకి వచ్చేసరికి అనామిక నీటుగా రెడీ అయ్యి ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడే కళ్యాణ్ లోపలికి వస్తాడు నేను ఒక పర్ఫ్యూమ్ వాడాను అది ఎలా ఉందో చూడు అని అంటుంది దానికి కళ్యాణ్ నాకు అలాంటి ఇష్టం లేదు అని అంటాడు. అనామిక కళ్యాణ్ మీద చేయి వేసి కళ్యాణ్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకోబోతుంది కళ్యాణ్ చేతిని వెనక్కి లాక్కుంటాడు. ఏం చేస్తున్నావ్ నువ్వు అని అడుగుతాడు దానికి అనామిక ప్రతి భార్య భర్తతో చేసేదే చేస్తున్నాను ఏం ముద్దు పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా అని అంటుంది. ఆ ఇంట్రెస్ట్ నాకు లేదు అని అంటాడు ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 13 Episode 408
Brahmamudi May 13 Episode 408

రేపటి ఎపిసోడ్ లో కావ్య సుభాష్ దగ్గరికి వెళ్లి మాయ గురించి డీటెయిల్స్ అడుగుతుంది. ఆ బిడ్డ తల్లి బిడ్డను వదిలిపెట్టి ఎలా వెళుతుంది. వచ్చి తనకి న్యాయం చేయమని అడగాలి కదా అలా సైలెంట్ గా ఎందుకు ఉంది అని అడుగుతుంది దానికి సుభాష్ నేను ఆమెకి డబ్బులు పంపిస్తున్నాను కాబట్టి సైలెంట్ గా ఉంది అని అంటాడు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మావయ్య గారు అని అంటుంది ఏ విషయంలో అని అంటే ఆ బిడ్డ తల్లి ఎందుకు ఇక్కడికి బిడ్డతో పాటు రావట్లేదు అని అంటుంది. చెప్పాను కదా డబ్బులు ఇస్తున్నానని అని అంటాడు. అయితే మీరు డబ్బులు ఇచ్చిన అడ్రస్సు ఫోన్ నెంబర్లు నాకు ఇవ్వండి అని అంటుంది సరే అలాగే అని సుభాష్ అవన్నీ ఇస్తాడు. ఇక అడ్రస్ పట్టుకొని కావ్య కారులో బయలుదేరుతుంది మాయ బండారం బయట పెట్టాలి అని అనుకుంటుంది. మాయ గురించి నిజం తెలిసిందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri