NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 15 Episode 410: సుభాష్ నుంచి నిజం రాబట్టిన కావ్య.. మాయ కోసం భార్యాభర్తల వేట..కావ్య కిడ్నాప్.. ఊహించని ట్విస్ట్..?

Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights

BrahmaMudi:కళ్యాణ్ అనామిక మీద కోపంతో, అనామిక నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను తనని భార్యగా గౌరవించాల్సిన అవసరం లేదని ఇంట్లో అందరూ ముందు చెప్తాడు. ఇంట్లోనే కవితలు రాసుకుంటానని అందరి ముందు చెప్పడంతో అపర్ణ ఆఫీస్కి ఎవరు వెళ్తారు అని అడుగుతుంది అది నీ ప్రాబ్లం పెద్దమ్మ అని అంటాడు. అన్నయ్య మాత్రమే ఆఫీస్ కి వెళ్లడానికి అర్హుడ అని తెలిసి కూడా నువ్వు అన్నయ్యని ఆఫీస్ బాధ్యత నుంచి తప్పించారు. ఇప్పుడు ఆఫీసు గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా నీదే, అయోధ్యని ఎంతమంది పరిపాలించిన అది రామరాజ్యం అని అంటారు ఆఫీస్ కి అన్నయ్య వెళ్లడమే కరెక్టు, నేనెలా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు నన్ను క్షమించండి అని అంటాడు. కళ్యాణ్ అని పెద్దగా అరుస్తుంది అపర్ణ. ఎందుకు అరుస్తున్నావ్ అపర్ణ వాడు చెప్పింది నిజమే కదా సంవత్సరం క్రితం రాజ్ గొప్పవాడు ఆఫీస్చూసుకోవడానికి అర్హుడు అని వాడికి పట్టాభిషేకం చేశాము ఇప్పుడేమో వద్దని నువ్వేఆఫీస్ కి వెళ్లకుండా ఆపేసావు ఇక వాడుఅన్నది కరెక్టే కదా నువ్వే ఆఫీస్ గురించి ఆలోచించు అని అంటాడు.

Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights
Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights

ఇక కళ్యాణ్ పైకి వెళ్తూ అనామిక దగ్గరికి వచ్చి గాడిదని గ్రాంధికంలో అన్నా తెలుగులో అన్నా ఒకటే కదా నువ్వు నా దృష్టిలో గాడిదవే, నీవు ఎంత మొరిగినా నేను కవితలు రాయడం ఆపను ఆఫీస్ కి వెళ్ళను నీకు ఇష్టమైతే ఉండు లేదంటే వెళ్ళిపో, ఇంకా మాట్లాడితే కేసు పెట్టుకో కావాలంటే అంతేకానీ నేను మాత్రం నువ్వు చెప్పినట్టు నడుచుకోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ రాజ్ దగ్గరికి వెళ్లి సారీ అన్నయ్య అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. ఇందిరా దేవి ఈ పరిస్థితిని అంతా చూసి ఇంట్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అలాంటప్పుడు నేను బావ కఠినమైన నేను తీసుకోవాల్సి ఉంటుంది ఇల్లు ఒకప్పుడు ఇలా లేదు ఇలా మారడానికి కారణమైన వాళ్ళు నేను ఊరికే వదిలిపెట్టను అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా గుర్తుపెట్టుకోండి అని వారిని ఇస్తుంది ఇంట్లో వాళ్లకి, ఇక అక్కడి నుంచి సీరియస్ గా వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights
Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights

ఇక మరోవైపు రాహుల్ ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటాడు. రాహుల్ ని చూసి రుద్రాణి నేను ఈరోజు ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు అని అంటుంది నేను జస్ట్ కంపెనీకి మేనేజర్ ని మాత్రమే మనం సీఈవో కాలేదు అని అంటాడు రాహుల్ చుట్టూ ఇన్ని అవకాశాలు ఉంటే నువ్వు ఈ అవకాశాన్ని వాడుకొని ఎలాగైనా సీఈవో అయిపోవాలి. రాజ్ ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు కళ్యాణ్ ఆఫీస్ కి రానని చెప్పాడు ఇక ఆఫీస్ కి వెళ్తున్న నువ్వు అక్కడ బాగా పనిచేసే అందరి దృష్టిలో నువ్వు సీఈఓ అయినా పర్వాలేదు పైకి తీసుకొస్తావా కంపెనీని అనిపించుకునేలా చేస్తే నేను నీకే పట్టం కడతారు అని అంటుంది. కానీ నువ్వు నీ వంకర బుద్ధిని అక్కడ చూపించొద్దు అని రాహుల్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే స్వప్న లోపలికి వచ్చి ఏంటండీ మీ నోటి వెంట మంచి మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. నీ కొడుకు నీకు మాత్రమే మంచివాడు అనిపిస్తే సరిపోదు ఇంట్లో అందరికీ అనిపించాలి కదా అని అంటుంది. ఇక రాహుల్ నేనేం మంచివాడిగా ఉంటాను అని అంటాడు అది నీ వల్ల కాదు రాహుల్ మీ అమ్మ రక్తం నీది ఒకటే మీరు ఎప్పుడు చెడుగాని ఆలోచిస్తారు మంచి చేయడం మీకు చేతకాదు అని అంటుంది. రాహుల్ కోపంతో డబ్బు గురించి అడగబోతాడు రుద్రాణి ఆపుతుంది ఇక ఆ కోటి రూపాయలు ఇంకా దొరకలేదా ఏంటి అని అంటుంది. రాహుల్ దొరకలేదు గాడిదలు తీసుకొని వెళ్ళాయి అని అంటుంది ఆ గాడిద నువ్వు పట్టుకోలేవులేవు అంటుంది స్వప్న ఇక కోపంతో రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక స్వప్న అడ్డ గాడిదలు సినిమా టీవీలో వస్తుంది చూద్దాం రండి అని అంటుంది అదేదో నువ్వే చూడు అని అంటుంది రుద్రాణి. స్వప్న వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గాడిదవి కావేటైనా సరే అని అనుకుంటుంది రుద్రాణి మనసులో, ఆ డబ్బు గురించి కూడా ఆలోచిస్తుంది.

Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights
Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights

ఇక మరోవైపు సుభాష్ దగ్గరికి వెళ్లి కావ్య మీ అబ్బాయి మాత్రమే ఆఫీసుకు వెళ్లడంలో అర్హుడని మీకు తెలుసు కదా కానీ అత్తయ్య గారు ఆపేసారు ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళను అంటున్నాడు ఇక రాహుల్ ఆఫీస్ కి వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అని అంటుంది. ఇప్పుడు నాకు సలహా ఇవ్వడానికి వచ్చావా అని అంటాడు సుభాష్. మీ అబ్బాయి మాత్రమే ఆఫీస్ కి వెళ్లడానికి అర్హుడు అని చెప్పడానికి వచ్చాను అని అంటుంది. జరగాలంటే మీ అత్తయ్య గారికి నిజం తెలియాలి నేను నిజం చెప్తాను అంటే నువ్వేమో ఒప్పుకోవట్లేదు అని అంటాడు సుభాష్ నిజం చెప్పడం కరెక్టే అయితే ఎప్పుడు మీ అబ్బాయి మీరు నిజం చెప్పేవాళ్ళు కదా అలా చెప్పలేదు అంటే అత్తయ్య బాధపడుతుంది అనే కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక మనం అత్తయ్య దగ్గర నిజం చెప్తే ఆవిడ ఏమైపోతుందో మీరు ఒకసారి ఆలోచించండి అని అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటాడు సుభాష్ నాకు బిడ్డ గురించి, మన తల్లి గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అంటుంది ఏంటి అని అడుగుతాడు సుభాష్. కావ్య ఆ బిడ్డ తల్లి బిడ్డను వదిలేసి ఎన్ని రోజులు ఎలా ఉన్నది అని అంటుంది అసలు పసిపిల్లని వదిలేసి పాలు తాగే వాడిని కాదనుకొని ఎన్ని రోజులు ఆమె దూరంగా ఎలా ఉంటుంది ఆమె కూడా బయటికి రావాలి కదా, అలా రాకుండా ఎందుకు ఉన్నది అని అడుగుతుంది దానికి వెంటనే సుభాష్ డబ్బు కోసం అని అంటాడు ఏంటి అని అంటుంది

Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights
Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights

ఇక సుభాష్ మాయ గురించి చెప్పడం మొదలుపెడతాడు. ఆ మాయ నా సెక్రటరీగా ఊటీ బ్రాంచ్ లో పనిచేసింది ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాక నాతో లేకుండా వెళ్ళిపోయింది తర్వాత సంవత్సరం తర్వాత బిడ్డను తీసుకొని వచ్చి ఈ బిడ్డ నీ బిడ్డ అని నాకు షాక్ ఇచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో వాళ్లకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని కొంత డబ్బు ఇచ్చి ఆమెకి సైలెంట్ గా ఉండమని చెప్పాను ఆ తర్వాత ఆమె ఈ బిడ్డని నా బిడ్డగా ప్రపంచానికి పరిచయం చేయాలని డిమాండ్ చేసింది దాంతో ఇంట్లో నిజం తెలిసిపోతుందని సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను అప్పుడే రాజు వచ్చి ఆ బిడ్డ నా బిడ్డగా ప్రపంచానికి పరిచయం చేస్తానని నా భారాన్ని తను మోస్తున్నాడు అని అంటుంది ఇలాంటి బిడ్డకి నేనేం చేయలేకపోతున్నాను రాజులాంటి గొప్ప వ్యక్తిత్వం నా కొడుక్కి నేనేమీ ఇవ్వలేకపోతున్నానని సుభాష్ బాధపడతాడు. ఏదో ఒక రోజు తప్పకుండా మీకు అవకాశం వస్తుంది మావయ్య గారు కానీ నాకు ఇప్పుడు కావాల్సింది అమాయ గురించి డీటెయిల్స్ అడ్రస్ అని అడుగుతుంది అడ్రస్ నాకు తెలియదు అని అంటాడు మరి మీరు డబ్బులు ఇప్పటికే పంపిస్తున్నారా అంటే నేను రెండు రోజులు క్రితం పంపించాను అని అంటాడు. ఆ బ్యాంకు డీటెయిల్స్ అడ్రస్సు నాకు ఇవ్వండి అని అంటుంది అవన్నీ నీకు మెసేజ్ చేస్తాను అని అంటాడు. అడ్రస్ పట్టుకొని కావ్య నిజం తెలుసుకోవాలనుకుంటుంది ఇదంతా చూసి సుభాష్ నా భార్య నీ మీద వేసుకొని నువ్వేమైనా ప్రాబ్లం కొని తెచ్చుకోవద్దు అని అంటాడు. కావ్య నవ్వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights
Brahmamudi Today Episode May 15 2024 Episode 410 highlights

ఇక మరోవైపు కావ్య సుభాష్ ఇచ్చిన అడ్రస్ ని పట్టుకొని బయలుదేరి వెళ్లాలని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది అప్పుడు రాజ్ కూడా కావ్య మాయని వెతకడానికి కచ్చితంగా వెళుతుంది ముందే మనం మహి దగ్గరికి వెళ్లి ఆమె డబ్బులు ఇచ్చి ఇకమీదట మా ఇంటి చుట్టుపక్కల కనిపించదు అని చెప్పాలి అమ్మ అడిగితే మాయ చనిపోయిందని చెప్పాలి అని అనుకుంటాడు. ముందుకు అవి కన్నా నేనే మహి దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి కిందకు వచ్చేసరికి కావ్య బయటికి వెళ్లడం చూసి రాజ్ ఆపుతాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంది ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదంటాడు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది ఇంట్లో పనిలేని లేవు అందుకే బయటకు వెళ్తున్నాను అని అంటుంది ఇంట్లో పని లేకపోతే బయట ఊర్లో వెళ్తావా అని అంటాడు. అవును మీరు ఇచ్చిన ఊర్లని ఎలా ఉన్నాయో చూసేద్దామని అని అంటుంది కావ్య. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికెళ్తుందో చెప్పవన్నమాట అని అంటాడు. ఎక్కడికి వెళ్తుంది కూడా చెప్పారు కదా అని అంటుంది. ఇద్దరు కాసేపు గొడవపడి ఎవరి కారు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు. దూరం తర్వాత రాజ్ కావ్య నన్ను ఫాలో అవుతుంది నేను ఎలాగైనా ఆమెని నా వెనక రాకుండా చేయాలి అని అనుకుంటాడు. సైడ్ సిగ్నల్ వేసి కారు లెఫ్ట్ సైడ్ కి పోనిస్తాడు దాంతో డ్రైవర్ అమ్మ రాజు సార్, రాంగ్ గ్రూప్లో వెళ్తున్నారు అంటే ఆయన రూట్ ఎలా అయినా ఉండని మన రూట్ స్ట్రైట్ గా ఉండాలి పోనీ పోనీ అంటుంది. రాజ్ కాబినా ఎనకాల రావట్లేదు ఇప్పుడు నేను మాయ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాడు.

ఇక మరోవైపు డ్రైవర్ ఒక చోట కారు అపి ఇక్కడ లోపలికి కారు వెళ్ళదమ్మా అని అంటాడు. నడిచి వెళ్ళండి అని చెప్తాడు. కావ్య నడిచి ఆ గల్లీలోకి వెళుతుంది. రాజ్ కూడా కారు ఒక పక్కన ఆపి ఇటు నడిచి వెళ్లడం బెటర్ అనుకొని వెళ్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకే గల్లీలో ఒకరికి తెలియకుండా ఒకరు నడుస్తూ ఉంటారు. కావ్య ను రౌడీలు చూసి ఫోటో తీస్తారు. ఆ ఫోటోని ఒక రౌడీకి పంపిస్తారు. అప్పటికే ఆ రౌడీ గన్ పట్టుకొని ఒక అమ్మాయిని బెదిరిస్తూ ఉంటాడు. ఇక్కడికి రావడమే కానీ పోవడం ఉండదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోవాలంటే సగం అయిపోవాల్సిందే అని అంటాడు. అప్పుడే రౌడీ పంపించిన ఫోటో చూసి ఆ కనిపెట్టుకున్న రౌడీ ఈ అమ్మాయి చాలా బాగుంది. ఏమైంది గనక మనం అమ్మేస్తే బాగుంటుంది అని అనుకొని ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురండి అని అంటాడు. ఈ అమ్మాయి వెనకా ముందు ఎవరూ లేరు కదా ఒక్కతే ప్రయాణం చేస్తుంది కదా అని అంటే ఒకటే వచ్చి అడ్రస్ వెతుక్కుంటుంది ఎవరు రాలేదు అని అంటాడు రౌడీ. సరే అయితే మీరు జాగ్రత్తగా చూసి తీసుకొని రండి మనం ఎంత కాలం చాలా జాగ్రత్తగా వ్యాపారం చేస్తున్నామో ఇప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే చాలా డేంజర్ ఈ అమ్మాయి చూడడానికి పెద్ద అమ్మాయిలా ఉంది కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి అనిగన్ గన్ పట్టుకుని రెడీ చెప్తాడు. దాంతో కావ్యం చూసిన రౌడీ సరే అన్నా అని ఫోన్ పెట్టేస్తాడు ఇక వెళ్లి నువ్వు మంగమ్మ ని తీసుకురా అని ఇంకొక రౌడీ చెప్తాడు. మరోవైపు రాజ్ కూడా అదే దారిలో మాయ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, రాజ్ వాచ్మెన్ కి ఫోన్ చేసి, మాట్లాడుతూ ఉంటాడు వాచ్మెన్ కావ్య 19వ తారీకుఆఫీస్ కి ఒక బెస్ట్ వచ్చాడు కదా వాటి వివరాలు కావాలి అని అడిగిందని నేను హార్డ్ డిస్క్ గురించి చెప్పానని హార్డ్ డిస్క్ తీసుకొని వాళ్ళు వెళ్లిపోయారని జరిగింది మొత్తం వాచ్మెన్ రాజ్ కి చెప్తాడు ఏంటి హార్ట్ డిస్క్ తీసుకుని వెళ్లిపోయారా, అని రాజ్ షాక్ అవుతాడు. మరోవైపు కావ్యని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకు వెళ్తూ ఉంటారు అప్పు చూస్తుంది.మా అక్కని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అని పెద్దగా అరుచుకుంటూ వెనకాల పరిగెడుతుంది. కొంత దూరం పరిగెత్తాక అలసిపోయి ఒకచోట ఆగుతుంది.కార్ ముందుకు వెళుతుంది. కావ్యను అప్పు కాపాడుతుందా లేదంటే రాజ్ కాపాడతాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri