NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights

Brahmamudi:కావ్య తీసుకొచ్చిన మాయ, అసలైన మాయ కాదని రాజ్ సుభాష్ ఇద్దరూ కావ్య కి చెప్తారు. నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది. ఇప్పుడు ఈ మాయ అసలు మాయ కాదన్న విషయం బయటకు చెప్పడానికి లేకుండా పక్క ప్లాన్ తో దిగింది అని రాజ్ అంటాడు. మాయ నిజ స్వరూపం బయటపెట్టి ఇంట్లో నుంచి గెంటేస్తాను అని కావ్య అంటుంది దాంతో రాజ్ వెంటనే దండం పెట్టి అమ్మ తల్లి ఇప్పటిదాకా చేసింది చాలు ఇప్పుడు నన్ను ఇంకొక లోయలో పడియకు అని అంటాడు. అసలు నువ్వు ఎంత బిత్తర దానివో నీకైనా అర్థమవుతుందా సవతిని కారులో ఇంటికి తీసుకొని వచ్చావు ఇప్పుడు మా అత్త అప్పుడే అధికారాలు కోడలు స్థానాలు అని గెలవడం మొదలుపెట్టింది ముందు దాన్ని ఎలా తట్టుకుంటావో ఎలా వదిలించుకుంటావో నీ కర్మ అని, రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. సుభాష్ కూడా నువ్వు మంచే చేద్దామనుకున్నావు కానీ ఇలా జరిగింది చూద్దాం, ఆ మాయ ఏం చేస్తుందో ఏం జరుగుతుందో, చూద్దాం అని వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights
Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights

రుద్రాణి దగ్గరికి మాయ వస్తుంది నేను బాగా నటించాను కదా అని అంటుంది. బాగా జీవించావు అని అంటుంది రుద్ర అని ఇద్దరు సంతోషంతో నవ్వుకుంటారు జీవితాంతం సుఖంగా ఉండాలంటే మాయగానే జీవించాలి కదా అని అంటుంది బాగా నమ్మించావు అని అంటుంది రుద్ర అని నమ్మిన వాళ్లు ఎప్పటికీ నిజం చెప్పలేరు అని మాయ అంటుంది. కానీ నువ్వు రాజ్ కావ్య సుభాష్ గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదు వాళ్ళకి నీ గురించి నిజం తెలుసు వాళ్ళు ఎప్పటికైనా నిన్ను బెదిరిస్తారు అని అంటుంది. అన్నిటికి తెగించే ఇక్కడికి వచ్చాను అని రుద్రా నీతో ఉంటుంది మాయ. ఇంట్లో అడుగుపెట్టడానికి సిద్ధపడినప్పుడు అన్నింటికీ తెగించాను అని అంటుంది. మీ ధైర్యం గురించి నాకు తెలియదా చిత్రా అని అంటుంది. చిత్ర ఎవరు అని ఉంటుంది నీ పేరు చిత్రే కదా అని అంటుంది అది ఒకప్పుడు ఇప్పుడు నా పేరు మాయ ఇక నేను మాయగానే ఉంటాను అని అంటుంది. ఈ మాయని చిత్రగా చేసిన నాకు తెలియదా అని అంటుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి రాహుల్ వస్తాడు. అమ్మ బాబోయ్ ఇదంతా నీ ప్లాన్ మమ్మీ అని అంటాడు. మరి నాలాంటి ఆడపిల్ల ఇంత పెద్ద కుటుంబంలోకి అడుగు పెట్టిందంటే ఇలాంటి వాళ్ళు అండ లేకపోతే ఎలా జరుగుతుందనుకున్నావు రాహుల్ అని అంటుంది చిత్ర. నా పేరు కూడా నీకు తెలుసా అని అంటాడు ఇంట్లో అందరి పేర్లు తెలుసు ఎవరి ఎలా ఉంటారో కూడా తెలుసు అని అంటుంది చిత్ర వెంటనే రుద్రాణి ఒక ఆయుధాన్ని తయారు చేసేటప్పుడు సాన పెట్టాలి కదా మరి అలాంటప్పుడు ఇంట్లో వాళ్ల గురించి తనకి తెలియకుండా ఎలా ఉంటుందనుకున్నావు అని అంటుంది. నాకు కూడా తెలియకుండా ఎలా చేసావు మమ్మీ అని అంటాడు రాహుల్ కుటుంబం ముక్కలు అవ్వాలంటే విభజించి పాలించాలి కదా మీ మమ్మీ ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పాను కదా రాహుల్ అని అంటుంది రుద్రాణి. అవును తక్కువ అంచనా వేశాను అని కావ్య ఎంట్రీ ఇస్తుంది.

Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights
Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights

ఇక కావ్య వాళ్ళు మాట్లాడుకున్నంత వింటుంది వాళ్లు కూడా కావ్యని చూసి షాక్ అవుతారు. కావ్య వాళ్ళ దగ్గరికి వచ్చి అవును నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. నీ దగ్గర మోసపోయాను. ఇది అక్కడ అలా మాట్లాడి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతుంది అంటే, దీని వెనక మీ హస్తం ఉందని ఊహించలేకపోయాను నేను ఏదో సాధిద్దాం అనుకొని వెళ్ళాను కానీ మీరు నన్ను బాగా బోల్తా కొట్టించారు అని అంటుంది. నేనేదో సరదాగా మాట్లాడుతున్నావు అని చిత్ర అంటుంది ఒసేయ్ కత్తి, నేను అంతా విన్నాను ఇక ఆపు అని అంటుంది. ఇక వెంటనే రుద్రాణి అయితే ఏంటి అని అంటుంది. నీకు నిజం మొత్తం తెలిస్తే ఇప్పుడు ఏంటి ఇంట్లోకి వెళ్లి అందరికీ చెప్తావా అని అంటుంది. వెంటనే రాహుల్ మమ్మీ కావ్య గురించి తెలిసి,రెచ్చగొడుతున్నావా అని అంటాడు. నీకు అర్థం కావట్లేదు పుత్ర అది ఇప్పుడు మనం ఏమి చేయలేదు. కావాలంటే కావే మొహం చూడు అదే బిత్తరపై చూస్తుంది అని అంటుంది. వెళ్ళు నిజం చెప్పు ఈ చిత్రాని నేనే తీసుకొచ్చాను అని చెప్పు, అప్పుడు నేను చెప్తాను నిజం రాబట్టడానికి నేను ఇదంతా చేశానని ఇంట్లో వాళ్ళు నన్ను ఏమీ అనరు, మహా అయితే రెండు మాటలు అంటారు నిజం చెప్పడం కోసం ఇదంతా చేశాను అని చెప్తే వాళ్ళు నన్నేమీ అనరు కదా నిజం చెప్పే దమ్ము నీకుంటే వెళ్లి నిజం చెప్పు అసలు ఈ నిజం బయటపడితే మీ అత్త ఏమవుతుందో ఆలోచించావా మీ అత్త తట్టుకుంటుంది అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగితే ఏం చెప్తావు. అన్నయ్య బిడ్డకు తండ్రి అన్న విషయం నాకు తెలుసు మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను అని రుద్రాణి అంటుంది. ఆ మాటలకు కావ్య షాక్ అవుతుంది. అవును నువ్వు విన్నది నిజమే మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను ఆ తర్వాత నువ్వు అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్లాలనుకున్నావు ఈలోపే నేను అక్కడ ముసలావిన్యూ ఏర్పాటు చేసి అడ్రస్ ని మార్చి చిత్ర అడ్రస్ నీకు ఇచ్చేలా చేశాను ఈ చిత్ర నా ట్రైనింగ్ తో ఇక్కడికి వచ్చింది ఈ విషయం కావాలంటే నువ్వు చెప్పే దమ్ముంటే వెళ్లి చెప్పు అని అంటుంది. నా మాటలకి కావ్య చెప్పను నేను చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడైతే చెప్పను ఇప్పటివరకు నేను వేసే ప్రతి అడుగుకి ముందు మీరు ఉన్నారు అని అన్నారు కదా ఇకమీదట మీ ముందు నేను ఉంటాను. నేనేం చేసేది మీకు తెలియకుండా చేస్తాను. మీరు కథని ప్రారంభించారు కదా ముగింపు నేనిస్తాను ఈ మాయని చేదిస్తాను అప్పటి వరకు చిన్న విరామం తీసుకోండి అని కావ్య స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రాహుల్ ఏంటి మమ్మీ కావే చాలెంజ్ చేసి వెళ్తుంది అని అంటాడు. కావ్య సెంటిమెంటల్ ఫుల్ ఇంటికి నష్టం జరుగుతుందంటే ఏమి మాట్లాడదు అలాంటప్పుడు అది ఏమీ చేయలేదు అదే నా అస్త్రం, ఇంట్లో ఈ మాయని ఉపయోగించి భయంకరమైన ఉపద్రవం సృష్టించి ఈ ఇంట్లో సభ్యులందరినీ నా గుప్పెట్లో పెట్టుకుంటాను అదే నా ప్లాన్ అని అంటుంది.

Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights
Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights

ఇక మరోవైపు రాజ్ ఒక ఆడది, ఇంత ధైర్యం చేసి దుగ్గిరాల ఇంట్లో కోడలుగా వస్తే ఇంట్లో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది ఈ మోసాన్ని ఎలా బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చిత్ర వయ్యారంగా రాజ్ దగ్గర నిలబడుతుంది. నువ్వు వగలాడివి అని నాకు తెలుసు అది నువ్వు నీ ముఖంలో ప్రదర్శించాల్సిన అవసరం లేదు అని అంటాడు. నీకేం కావాలి అని అంటాడు రావచ్చు నువ్వే కావాలి అని అంటుంది ఎలా కావాలి భర్తగానా, ఈ బాబుకి తండ్రిగాన దుగ్గిరాల వారసుడిగానా ఎలా కావాలి నేను నీకు అని అడుగుతాడు. ఎలాగైనా కావాలి అని అంటుంది ఇప్పుడు నిజం చెప్పలేవు, కాబట్టి నన్ను నీ భార్య కభరించాక తప్పదు అని అంటుంది నాకు నిజం తెలుసు నువ్వు వెళ్లి నిజం చెప్తే నాకు తెలిసి నిజాన్ని నేను చెప్తాను అని చిత్ర బెదిరిస్తుంది. దాంతో రాజ్కోపంగా ఫ్లవర్ వాస్ తీసుకొని చిత్రాని కట్టబోతాడు. ఏంటి ఆగిపోయావు అని అంటుంది నాకు సంస్కారం అడ్డం వచ్చింది అని అంటాడు అదే సంస్కారంతో సంసారం చేద్దాం అని అంటుంది చిత్ర దాని సంసారమైన దానికి వేరే పేరు ఉంటుంది అని అంటాడు రాజ్. చిత్ర నవ్వుతుంది నేను ఇంత మాట అన్నా కూడా నువ్వు నవ్వుతున్నావ్ అంటే నువ్వు కచ్చితంగా క్యారెక్టర్ లేని ఆడదానివే అని అంటాడు. అసలు నీకేం కావాలి అని అడుగుతాడు రాజ్ నేను ఏదో టెంపరరీగా వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకోవట్లేదు మీ దగ్గర ఆస్తి ఉంది నా దగ్గర ఆశ ఉంది నేను నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి కోడలిగా మహారాణుల బతకాలనుకుంటున్నాను అని అంటే నీ ఆశకు భార్య అనే గొప్ప స్థానాన్ని ఇస్తానని ఎలా అనుకున్నావు అని అంటాడు రాజ్. నువ్వు ఏం చేయగలవు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఏమన్నా చేయగలిగావా లేదు కదా అని అంటుంది. అంటే అన్నిటికీ సిద్ధపడి ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు రాజ్ అవును అని అంటుంది చిత్ర.

Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights
Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights

ఇక రాజ్ కావాలని ఆ చిత్ర ని అన్నిటికీ సిద్ధపడి వచ్చాను అన్నావు కదా అయితే పదా కాపురం చేద్దాం అని బెడ్ మీద పడేస్తాడు. ఏంటి రాజ్ ఏం చేస్తున్నావు అని కంగారుపడుతుంది. ఏంటి కాపురం అనగానే కంగారు పడుతున్నావు బిడ్డకు జన్మనిచ్చావు కదా కాపురం అంటే ఏంటో తెలియదా ఇది మనకు ఫస్ట్ నైట్ కాదు ఫస్ట్ పగలు అనుకో, భర్త కావాలి కాపురం చేయొద్దు అంటే ఎలాగు అని అంటాడు రాజ్. వెంటనే చిత్ర అవునా అని చెయ్యి పట్టుకుని రాజ్ ని బెడ్ మీదకి లాగుతుంది. రాజ్ కంగారు పడతాడు. ఏంటి నేను కంగారు పడుతున్నానని అనుకున్నావు కదా నాకు అలాంటివి ఏమీ లేవు నువ్వు ఏం చేద్దాం అన్నా నేను రెడీ అని అంటుంది. రాజ్ పక్కకు వెళ్తాడు. రాజ్ పైకి లేచి ఇలాంటి ఆడదానివి నేను అనుకోలేదు అని అంటాడు. నేను ఆడదాన్ని కాబట్టే కదా బెడ్ మీద పడేసావు అని అంటుంది చిత్ర. అని అంటాడు రాజ్ మళ్లీ వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది రాజ్ వైపు కోపంగా చూస్తుంది ఏంటి అని అంటుంది. ఏంటి అని అంటాడు రాజ్ బెడ్ మొత్తం నలిగి ఉంది అని బెడ్ ని చూపించి అడుగుతుంది. దానికి ఏదో బెదిరిద్దామని అనుకున్నాను అని అంటాడు అవును నన్నేమో సైడ్ అవ్వమని చెప్పి మీరేమో రంగంలోకి దిగారా అని అంటుంది కావ్య. చి చి ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు. దానికి వారిని విడిచి పంపించాను అని అంటాడు అవును బెడ్ పై పక్కపక్కనే ఉండి వారిని ఇచ్చారా అని అంటుంది. మొత్తం చూసావా అని అంటాడు రాజ్. చూశాను మీరే కా చెయ్ పట్టుకొని మరీ లాగారు. అని అంటుంది కావ్య. అది కూడా చూసావా అని అంటాడు.అసలు అది ఆడదే కాదు బెదిరిస్తే బెదిరిపోతుంది అనుకున్నా కానీ నాకే చెమటలు పట్టించింది నాకు క్యారెక్టర్ ఉంది అది నేను ఎప్పుడు మర్చిపోలేదు అని అంటాడు.ఆ క్యారెక్టర్ ఏం చేయగలిగింది అని అంటుంది కావ్య. అసలు దానికి ఏం తెలుసు నా భర్త సంవత్సరం నుంచి నాతోనే ఉంటున్న ఏమీ చేయలేదు అనే విషయం దానికి తెలియదు కదా మీరేదో చేస్తారనుకొని వచ్చినట్టుంది అని అంటుంది ఎక్కడికి వచ్చిన తిరిగి అక్కడికి వస్తావు కదా నువ్వు అసలు ఇదంతా నీవల్ల జరిగింది కదా, దారిన పోయేదాన్ని కార్ ఎక్కించుకొని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు ఇప్పుడు అది ఏం చేస్తుందో అని నాకు భయంగా ఉంది నా ఫ్యామిలీని కాపాడుకోవాలో లేదంటే నా శీలాన్ని కాపాడుకోవాలి అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేసి దాన్ని ఇక్కడి నుంచి బయటికి పంపించు అని అంటాడు రాజ్. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights
Brahmamudi Today Episode May 23 2024 Episode 417 highlights

రేపటి ఎపిసోడ్లో అమ్మమ్మ గారు కాఫీ అని మాయ తీసుకొచ్చి ఇస్తుంది. నాకొద్దు అని అంటుంది ఏందిరా దేవి నేను కాఫీ బాగా కలుపుతాను అని అంటుంది మాయ అర్థమవుతుంది వరసలు బాగా కలుపుతున్నావు కదా అని అంటుంది ఇందిరా దేవి. వెంటనే స్వప్న అన్నీ కలుపుకొని కాక్టయిలా నువ్వే తాగు అని అంటుంది. మా కావ్య ఇస్తేనే నేను కాఫీ తాగుతాను అని అంటుంది అమ్మమ్మ గారు. ఇక మాయ అపర్ణ దగ్గరికి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది అప్పుడే కావి కూడా అపర్ణకు కాఫీ ఇస్తుంది ఇద్దరి వైపు చూస్తుంది అపర్ణ. ఇద్దరూ కాఫీ తీసుకొచ్చేసరికి అపర్ణ ఎవరి కాఫీ తీసుకుంటుందో అని ఇంట్లో అందరూ చూస్తారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella