NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

Brahmamudi May 27 Episode  420

Brahmamudi:రాజ్ కావ్యఅప్పు ని కలిసి ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని రాజ్ కావ్య అని అడుగుతాడు కావ్యా ఏమి సమాధానం చెప్పకుండా ఉంటుంది నీ అంతటికి నువ్వు వెళ్తావు ఎప్పుడో వస్తావు నా గురించి పట్టించుకునేది ఎవరు అని అంటాడు. అసలు ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్లి వచ్చావు అని అంటాడు.నా పరిస్థితి గురించి ఆలోచించకుండా నీపాటికి వెళ్లిపోతే ఎలాగూ అని అంటాడు వెంటనే కావ్య ఇప్పుడు మీ పరిస్థితికి ఏమైంది అని అడుగుతుంది.వెంటనే రాజ్కోపంగా నీకు తెలియదా టీ నుంచి టిఫిన్ వరకు కాఫీ నుంచి డిన్నర్ వరకు అన్ని మీద పడి తెగ చేసేస్తోంది కదా,అడవికి వెళ్లి పులిని తీసుకొచ్చి ఈ మేక మీదకు వదిలావు.ఈ మేక గురించి ఆలోచించవా అని అంటాడు.

Brahmamudi May 27 Episode  420
Brahmamudi May 27 Episode  420

ఇక కావ్య నేను అడవికి వెళ్లి మేకనే తీసుకొచ్చాను అని అనుకున్నాను. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత పులిలా తయారు అయింది తయారు చేశారు అని అంటుంది.అయినా దాని గురించి నేను చూసుకుంటాను అది మీ బెడ్ రూమ్ దాకా రాదు అని అంటుంది.ఓహో అలాంటివి కూడ ఉన్నాయా బుజ్జి అని అంటాడు రాజ్.అది దొంగ మాయ అని ఇంట్లో చెప్పలేము పోనీ ఈ బాబుకి తల్లి కాదు అన్న నిజాన్ని కూడా చెప్పలేము,అసలు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదన్న విషయాన్ని చెప్పలేము దాని ఓవరాక్షన్ భరించలేము.నిన్ను చూస్తేనే భయం వేస్తుంది అని అంటారు రాజ్. వెంటనే కావ్య కంగారు పడకండి అన్ని రోజులు ఒకలాగాఉండవు అది దొంగ మాయ అన్న విషయం ఇంట్లో ఏదో ఒక రోజు బయటపడుతుంది. నాకు కూడా అన్యాయమే జరిగింది. నేను ఏమన్నా అరుస్తున్నానా, సైలెంట్ గానే ఉన్నాను కదా, మీరు కూడా అలానే ఉండండి దాని గురించి నేను ఆలోచిస్తాను. ఆ మాయ మాయ కాదు అన్న విషయాన్ని నేను బయటపెడతాను అప్పటివరకు మీ జీవితాన్ని కాపాడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్యా.రాజ్ కూడా అవును ఇది చెప్పింది దాని గురించి ఆలోచించాలి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు.

Brahmamudi May 27 Episode  420
Brahmamudi May 27 Episode  420

ఇక మరోవైపు అపర్ణ లాయర్ కి ఫోన్ చేస్తుంది నేను చెప్పే విషయం గురించి మీరు మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తగా ఉంచాలి అనిఅని అంటుంది నేను మీ ఆఫీస్ కి సంబంధించిన లాయర్ ని ఇంతవరకు నా వల్ల ఎటువంటి ప్రాబ్లం రాలేదు మేడం అని అంటాడు లాయర్.ఇప్పుడు కూడా మీ మీద నమ్మకంతోనే మీకు ఫోన్ చేశాను అని అంటుంది ఎవరన్నా సరే విషయం ఏంటో చెప్పండి మేడం ఎవరికీ తెలీదు అని అంటాడు.ఇకపైన లాయర్ తో మాట్లాడుతుంది లాయర్ మొత్తం విన్న తర్వాత మీరు తీసుకుంటున్న నిర్ణయం చాలా పెద్దది మేడం ఒకసారి ఆలోచించండి అని అంటాడు. నేను అంతా ఆలోచించే యుండును నేను తీసుకున్నాను. మీరు చెప్పింది చేయండి అని అంటుంది. లాయర్ సరే మేడం అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు అనిఫోన్ పెట్టేస్తాడు.ఇక అందరినీ హాల్లోకి రమ్మనిఅపర్ణ అంటుంది ఇక అందరూ హాల్లో సమావేశం అవుతారు.ఏంటి వదిన అందరిని రమ్మని చెప్పి సైలెంట్ గా ఉన్నావు అని అంటుంది రుద్రాణి. టైం వచ్చినప్పుడు అన్ని మాట్లాడుతాను అని అంటుంది అపర్ణ అప్పుడే లాయర్ ఎంట్రీ ఇస్తాడు.లాయర్ ని చూసి సుభాష్ ఎందుకొచ్చారు అని అంటాడు.లాయర్ అపర్ణ చేతిలో కొన్ని పేపర్స్ పెడతాడు.ఇక మీరు వెళ్లొచ్చు మీ అవసరం ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను అని అంటుంది.ఇక లాయర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెంటనే సుభాష్ ఆ పేపర్ లేంటి అని అంటాడు.ప్రకాశం కూడా ఎందుకు లాయర్ వచ్చాడు వదిన అని అడుగుతాడు.

Brahmamudi May 27 Episode  420
Brahmamudi May 27 Episode  420

ఇక అపర్ణ నా తను మాట్లాడటం మొదలుపెడుతుంది.ఈ ఇంట్లో నెలకొల్పిన పరిస్థితులు గందరగోళాల నుంచి బయటపడడానికే ఈ పత్రాలని తెప్పించాను అని అంటుంది.అంటే ఆ పేపర్సు అని అంటాడు ప్రకాశం ఇవి విడాకుల పత్రాలు అని అంటుంది అపర్ణ.ఇక దాంతో అందరూ షాక్ అవుతారు ఇక వెంటనేఇందిరా దేవి మీ మావయ్య ఈ ఇంట్లో విడాకులు అన్నమాట వినిపించకూడదు అని చెప్పారు కదా అని అంటుంది.తప్పట్లేదు అత్తయ్య గారు ఈ ఇంట్లో తప్పక అడుగులు వేసిన వాళ్ల తప్పుల్ని మనం సరిదిద్దాలి కదా అని అంటుంది.వెంటనే రాజు ఎవరి గురించి మమ్మీ నువ్వు మాట్లాడేది అని అంటాడు.నీకు నేను చెప్పింది అర్థమైందా అని నాకు తెలుసు రాజ్ నీకు కావ్య కీ విడాకులు ఇప్పించాలి అని అనుకుంటున్నాను అని అంటుంది. దాంతో ఇందిరా దేవి షాక్ అవుతుంది.ఇక అక్కడే ఉన్న రుద్రాణి,మాయ ఇద్దరు సంతోషపడతారు. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందని మనసులో ఆనందిస్తారు.ఇక ఇందిరా దేవి ఈ నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది.అపర్ణ నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది కదా అత్తయ్య,వాడి బిడ్డఅలాంటప్పుడు నేను మాయకి రాజకీయ పెళ్లి చేస్తే వాడి బిడ్డ ఈ ఇంటికి శాశ్వతంగా వారసుడవుతాడు.ఇలా చేయాలి అంటే ముందు కావ్య కి విడాకులు ఇప్పించాలి కదా అని అంటుంది.వెంటనే సుభాష్ ఒకరికి న్యాయం చేయాలంటే ఇంకొకరికి అన్యాయం చేస్తావా అని అంటాడు ఇంతకన్నా న్యాయం మీరు చెప్తారా అని అంటుంది.అంటే కావ్యకి అన్యాయం చేస్తావా అని అంటాడు.వాడి బిడ్డకు న్యాయం చేయాలనుకుంటున్నాను అని అంటుంది అపర్ణ.ఇంతకన్నా ఈ సమస్యకి పరిష్కారం ఎవరికి చూపిస్తారు అని అంటుంది. మరి మా అక్కకి జరిగే అన్యాయం అని అంటుంది స్వప్న మీ అక్కకు అన్యాయం ఎప్పుడో జరిగింది సంవత్సరం నుంచి మీ అక్క ఇంట్లో ఉంటుందనే కానీ ఏ రోజు న్యాయం జరగలేదు. అయినా మీకు న్యాయం అన్యాయం గురించి మాట్లాడారాటలేదు ఏరోజైతే మీ అమ్మ కావ్యకి మూసుకువేసి పెళ్లి చేసిందో ఆ రోజే మీరు మాట్లాడారా అతని కోల్పోయారు. ఇంట్లో నా కొడుకు కి కావ్యతో ఇష్టం లేకుండా పెళ్లి చేశారు వాడు మాయని ప్రేమించాడు బిడ్డకు తల్లిని చేశాడు ఆ బిడ్డకు న్యాయం చేయాలని తర్వాత అనుకున్నాడు అందుకే ఆ బిడ్డను ఇక్కడికి తీసుకువచ్చాడు తర్వాత మాయ కూడా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మాయకి రాజ్ కి పెళ్లి చేసి న్యాయం చేస్తాను అని అంటుంది.

Brahmamudi May 27 Episode  420
Brahmamudi May 27 Episode  420

ఇక ఆపరిన మాట్లాడుతూ కావ్య రాజ్ ఇద్దరికీ ఇష్టం ఉన్నట్లయితే ఈపాటికి ఒక బిడ్డని అనే వాళ్ళు అలా కాదని ఎంత కాలం కుటుంబం కోసం కలిసి ఉన్నట్లు ఇద్దరు నటిస్తారు అని అంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా లేరు. అందుకే వాడు మాయని ఇష్టపడ్డాడుఅని అంటుంది. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనుకుంటున్నాను అని అంటుంది దానికి తగినట్టు సమయం కూడా కావాలి కదా అని సుభాష్ అంటాడు ఎంత కాలం ఎదురు చూస్తారుశ్రీరామ ఈరోజు బాబు గురించి మీడియా అడిగితే ఏం సమాధానం చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డాము గుర్తుంది కదా ఇప్పుడు ఈ మాయ గురించి బయటకు తెలిస్తే ఏంది సమాధానం చెప్తాము.అందుకే ఈ విషయాలన్నీ బయటికి వెళ్లే లోపే మాయకి రాజుకి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయాలి అని అంటుంది. ఎవరికీ తెలియకుండా కావ్య కి రాజ్ కి కూడ విడాకులు ఇప్పించాలి అని అంటుంది.వెంటనే సీతారామయ్య నువ్వు నా తర్వాత ఏంటి సమస్యలని సంభాలిస్తావని,నీమీద పూర్తి బాధ్యతను పెడితే, నువ్వు చేస్తుంది ఏమిటి? ఏ రోజైనా నీ మాటకి మేము ఎదురు చెప్పలేదు నీ నిర్ణయాన్ని మేము కాదని లేదు కానీ ఈరోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయానికి మాత్రం అడ్డుపడక తప్పట్లేదు అని అంటాడు.సీతారామయ్య అన్నమాట ఎక్కువ అపర్ణ షాక్ అవుతుంది. నీకసలు ఏం హక్కు ఉంది. ఏం అధికారం ఉందని నువ్వు వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పిచ్చాలి అనుకుంటున్నావు అని అంటాడు సీతారామయ్య మామగారు అనే మాటలకు అపర్ణ ఆశ్చర్యంతో చూస్తూ నిలబడుతుంది. వాడు గతిలేక బాసికం కట్టలేదు, కనకం ఏదో చేస్తేనో రుద్రాణి ఏదో పన్నాగం పండితేనో అమాయకురాలైన కావ్య బలైపోతుందని తెలుసుకొని, వాడి జాలిపడి తాళి కట్టాడు ఈ ఇంటి పరువు నిలబెట్టాడు. తెలిసి జరిగినా తెలియక జరిగిన ఆ పెళ్లి బంధాన్ని మూడుముళ్లని ఎవరు కాదనలేరు. ఇప్పుడు విడదీయడానికి నువ్వుఈరోజు విడిపోవాలి అంటే ఎలా విడిపోతారు అని అంటాడు సీతారామయ్య నేను మామగారులా నీతో మాట్లాడట్లేదు ఒక మనిషిగా మాట్లాడుతున్నారు కావ్య కి అన్యాయం జరుగుతుందంటే మాత్రం చూస్తూ ఊరుకోను అని సీతారామయ్య గట్టిగా మాట్లాడుతాడు.. వెంటనే ఇందిరా దేవి కూడా సీతారామయ్యకి సపోర్టుగా నువ్వు మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది బావ నువ్వు రాజ్, తాత గారిలా ఏంటి పెద్దల మాట్లాడే అధికారం నువ్వు నీ నిర్ణయాన్ని నీకు కచ్చితంగా చెప్పు బావ అని అంటుంది.ఎవరిని అడిగి ఇంత నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థం కావట్లేదు నా కొడుకులు సమర్ధులు అనుకుంటున్నాను చేతకాని వాళ్లు అని అనుకోవట్లేదు.అసలు కనీసం నీ భర్తని అడిగానా నువ్వు నిర్ణయం తీసుకున్నావో లేదో అని అంటాడు సీతారామయ్య అయినా వాడు మాత్రం మంత్రంలోని పరువు తీయకుండా సైలెంట్ గా ఉన్నాడు అని అంటాడు.కనీసం విడాకులు ఇప్పించాలనుకుంటున్నా రాజ్ కావ్యాల ను గురించైనా వాళ్ళిద్దరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నావా అని అంటారు.

Brahmamudi May 27 Episode  420
Brahmamudi May 27 Episode  420

ఇక ఇందిరా దేవి కావ్య వైపు చూస్తూ,మీ అత్తగారు ఏదో అంటుందనో ఈ మాయకి న్యాయం చేయాలని అన్యాయం జరుగుతుందని ఆలోచించకుండా నువ్వుఏమనుకుంటున్నావో ఈ విడాకుల గురించి నీ అభిప్రాయాన్ని చెప్పమని ఇందిరాదేవి కావ్య అని అడుగుతుంది. కావ్య మాట్లాడటం మొదలు పెడుతుంది.ఇప్పటివరకు ఈ ఇంట్లో నాకంటూ ఒక గౌరవం లేదు నా ఇంట్లోనే నా ఉనికికి ఒక అస్తిత్వం లేదు.నాకంటూ ఒక మనసు ఉంటుందని మా అత్తగారికి కనిపించలేదు అందుకే ఆమె ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం నన్ను అడగను కూడా అడగలేదు.ఆవిడ ఒక చారిత్రక నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను సంప్రదించలేదు,మూసి ఉన్న గది లోపల మేము ఎలా ఉంటున్నాం అన్నది ఆవిడ ఎలా తెలుస్తుంది.గదిలోపల జరిగే విషయాలను ఇలా నలుగురి మధ్య పెట్టింది.ఆవిడ ఏదో ఊహించుకొని మేమిద్దరం విడిపోవాలి, నాకేదో న్యాయం చేస్తున్నానని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఆవిడని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటుంది. వెంటనే ఇందిరా దేవి ఏమిటో అడుగు అని అంటుంది. అపర్ణ కూడ నీకేమి అడగాలనుకున్న అడగొచ్చు అని అంటుంది. ఇక కావ్య అపర్ణ వైపు చూస్తూ, నేను మా ఆయన కలిసి ఉండటం లేదని మీరు ఎలా అనుకున్నారు మామతో ఏమీ లేదని మీరు ఎలా చెప్తారు, అసలు మాకు పెళ్లయిసంవత్సరం అవుతుంది ఆ బిడ్డ పుట్టి 9 నెలలు అవుతుంది.అంటే మాకు పెళ్లికి ముందే మాయతో మా ఆయనకి పరిచయం ఉంది కదా మరి అలాంటప్పుడు నా మెడలో ఎందుకు తాళి కట్టాడు.ఆ బిడ్డ పుట్టినప్పుడైనా ఇంటికి తీసుకొని రావాలి కదా తొమ్మిది నెలల వరకు ఎందుకు ఎదురు చూశాడు అని అంటుంది.అయినా ఇదంతా పక్కన పెట్టండి.అసలు మాయని ప్రేమిస్తే మా అక్కని పెళ్లి చేసుకుంటాను అని ఆరోజు ఎందుకు అన్నాడు ఆ తర్వాత కొన్ని పరిస్థితులు వల్ల నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా మాయ గురించి నిజం చెప్పాలి కదా అయినా ఎందుకు చెప్పలేదు ఈ బిడ్డ పుట్టినప్పుడైనా చెప్పాలి కదా అప్పుడు కూడా ఎందుకు చెప్పకుండా అజ్ఞాతంలో ఎందుకుపెంచాడు. అయినా మీ కొడుకు తప్పు చేస్తే నేనెందుకు విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలి. ఆయన తప్పుల మీద తప్పులు చేసి దారిన పోయే వాళ్లతో పిల్లల్ని కానీ ఇంటికి తీసుకొస్తే మీరు నాకు విడాకులు ఇచ్చి వెళ్లిపోమండలం ఎంత వాడికి కరెక్ట్, మీ అబ్బాయికి ఒక న్యాయం నాకు ఒక న్యాయం చేయడం ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అపర్ణ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కావ్య.ఇక ఇక్కడ తో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో రాజ్ కావ్య కు థ్యాంక్స్ చెప్తాడు.ఎందుకు అని అంటుంది విడాకులు ఇష్టం లేదని చెప్పినందుకు అని అంటాడు.అంతేనా అని, ఇంకేమైనా ఉందా మనసులో అని అంటుంది. రాజ్ సైలెంట్ గా ఉంటాడు.నేను నిజంగా విడాకులు తీసుకొని వెళ్ళిపోతానని భయపడ్డారా అని అంటుంది.రాజ్ అవును అన్నట్లుగా నిలబడి ఉంటాడు.నా కూడా తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టే నిజాన్ని నిర్భయంగా చెప్పాను మరి మీరు ఎందుకు చెప్పలేదు అని అంటుంది.నా మనసులో ఉన్నది కూడా చెప్పాను కదా అని అంటాడు అంతేనా ఇంకేమైనా ఉందా అని అంటుంది.చూస్తుంటే రాజ్,కావ్య ల ప్రేమ కథ మొదలైనట్లుగా కనిపిస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella