NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 28 Episode 421:మాయ తన కోడలు అన్న అపర్ణ.. విడాకులు ఇవ్వను అన్న కావ్య.. ఇందిరా దేవి బెదిరింపు.. అపర్ణను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్వీస్ట్..?

Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights

Brahmamudi: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ కొనసాగుతూ ఉంటుంది. అపర్ణ రాజకీయ విడాకులు ఇప్పించి మాయతో పెళ్లి జరగాలని నిర్ణయిస్తుంది. అసలు ఆ నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఎవరు అని సీతారామయ్య అపర్ణ నిలదీస్తాడు. కనీసం విడాకులు ఇచ్చే ముందైనా వాళ్ళిద్దరిని ఒక మాట అడిగావా అని ఇందిరా దేవి అంటుంది. కావ్య తో అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, మీ అత్తగారు ఏదో చెప్తుందన్న మాటలు వినకుండా నీ మనసులో నువ్వేం అనుకుంటున్నావో చెప్పమని కావ్యకు విడాకుల మీద తన ఒపీనియన్ అడుగుతుంది ఇందిరా దేవి, ఆ మాటలకు కావ్య నన్ను ఇంట్లో గుర్తించినందుకు మీకు చాలా థాంక్స్ అమ్మమ్మ గారు నాకంటూ ఒక మనసు ఉంది ఆ మనసు ఏం కోరుకుంటుంది అన్నది అడక్కుండా మా అత్తగారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అని కావ్యబాధపడుతూ నేనిప్పుడు మా అత్త గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని నేను నా భర్త ఇద్దరం కలిసి ఉండటం లేదని ఆమె ఎలా చెప్తుంది మాకు పెళ్లయి సంవత్సరం అవుతుంది ఆ బాబుకి 9 నెలలు అంతకుముందే ఆవిడ 9 నెలల గర్భవతి అలాంటప్పుడు నాతో పెళ్లి జరిగేటప్పుడైనా నిజం చెప్పకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని అపర్ణను నిలదీస్తుంది. ఏ న్యాయస్థానం ఇవన్నీ తీర్పు మీరు ఎలా ఇస్తారు అని అపర్ణని ఎదిరిస్తుంది తప్పు చేసిన మీ అబ్బాయిని వదిలిపెట్టి నాకు అన్యాయం చేస్తానంటే ఎలాగో అని కడిగి పడేస్తుంది. బిడ్డల్ని కని ఇంటికి తీసుకొస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని కూడా ఎంత వాడికి కరెక్ట్ అని అపర్ణను అడుగుతుంది కావ్య.

Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights
Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights

నేను దుగ్గిరాల ఇంటి కోడలిగా నా బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తున్నానని నా భర్త ఒక బిడ్డను తీసుకొచ్చిన ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చిన నేను వీదికెక్కి గొడవ చేయకుండా రాజ్ భార్యగా ఆయన మంచి చెడు చూసుకుంటూ ఆయన సుఖం దుఃఖం అన్నీ కలిసే పంచుకోవాలని అనుకుంటున్నాను అందుకే నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అని కావ్య అందరి ముందు కుండ బద్దలు కొట్టి చెపుతుంది. కావ్య మాటలతో అపర్ణ షాక్ అవుతుంది ఇక రుద్రాణి కూడా కావ్య మాట్లాడుతుంటే అంతే అవాక్కై చూస్తూ ఉంటుంది. అసలు కావే ఇలా మాట్లాడుతుందని మాయ అనుకోని కూడా ఉండదు ఇక కావ్య తన నిర్ణయాన్ని చెప్పి నేను మాత్రం విడాకులు ఇవ్వను అని కరాకండిగా చెప్పేస్తుంది. వెంటనే ఇందిరా దేవి శభాష్ మనవరాలు అని అంటుంది ఆడతనవంటే అది పెళ్లికి ముందే తొందరపడి తన సర్వస్వాన్ని మనవడికి సమర్పించిన ఆడదానికి నా మనవరాలు ముందు నిలబడే అర్హత కూడా లేదని మాయకి చులకన చేసి మాట్లాడుతుంది ఇందిరాదేవి. ఇందిరా దేవి మాటలకు మాయ ముఖం మాడిపోతుంది ఇక విడాకులపై రాజు నిర్ణయం ఏంటి అని సీతారామయ్య అడుగుతాడు నేనేం మాట్లాడలేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మాట్లాడటం కరెక్ట్ కాదు నాకు అర్హత లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. ఇక ఆ ఇంటి పెద్దయిన సీతారామయ్య అందరికీ విడాకుల గురించి మాట్లాడే అర్హత లేదు అని ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు. చేసేదేం లేక అపర్ణ సైలెంట్ గా ఉంటుంది.

Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights
Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights

ఇక మరోవైపు అపర్ణ ఒంటరిగా నిలబడి ఉంటే ఇందిరా దేవి అక్కడికి వెళ్లి ఏంటి నీ పరివారం అంతా కనిపించట్లేదు అని సెటైర్ వేస్తుంది. నీ పరివారాన్ని పిలువు నువ్వు ఆజ్ఞలు వేస్తే పాటించడం తప్ప వాళ్లకి ఇంట్లో ఇంకేం మాట్లాడారో అతలేవు. నువ్వు ఈ కోటకి మహారాణి నువ్వు ఆజ్ఞ వేస్తే పాటించాలి కదా అని అంటుంది. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు అంటే అవును నిజమే కదా నువ్వు ఇంటి మహారాణి వే కదా నీకు ఎదురు నిలబడి మాట్లాడారు అర్హత ఎవరికి లేదు కదా అని నిష్టూరంగా మాట్లాడుతుంది. ఆ మాటలకు అపర్ణ నేనిప్పుడు ఏమన్నా తప్పు చేశానా అని అంటుంది. నువ్వు చేసింది తప్పని నీకు అనిపించట్లేదా అని అంటుంది ఇందిరా దేవి. కావ్య విడాకులు ఇప్పించి మాయకు పెళ్లి చేయాలి అని అనుకున్నాను అని అంటుంది. అలా అనుకోవడమే తప్పు కదా అని అంటుంది ఏందిరా దేవి నా కొడుకు సంతోషం గురించి నేను ఆలోచించకూడదా అని అంటుంది మరి కావ్యకు అన్యాయం జరిగితే ఏం చేస్తావు అని ప్రశ్నిస్తుంది విడాకులు ఇస్తే కావికి మంచే జరుగుతుంది అని అపర్ణ అంటుంది ఇష్టం లేని భర్తతో ఎన్ని రోజులు కాపురం చేస్తుంది అందుకే విడిపోయి తన జీవితం తాను చూసుకోమని సంతోషంగా బతకమని కదా నేను చెప్తుంది అని అంటుంది అపర్ణ వెంటనే కోడలు అన్న మాటలకు ఇందిరా దేవి కోపంతో రాజ్ అంటే ఇష్టం లేదని కాబోయే ఏ రోజైనా చెప్పిందా అని అంటుంది. కావ్యకు రాజు అంటే ఇష్టం ఉందో లేదో తెలియకుండా నువ్వు ఎలా విడాకులు ఇప్పించాలని అనుకున్నారని అపన్నని నిలదీస్తుంది కాబోయే ఇష్టంతో నాకు పని లేదు అని అపర్ణ బదిలిస్తుంది కానీ కోర్టుకు అవసరం అని ఇందిరాదేవి పాయింట్ని పైకి తీస్తుంది.నీకు అవసరం లేకపోవచ్చు కానీ రేపొద్దున కోర్టు భార్యాభర్తలు ఇద్దరు ఇష్టాన్ని అడుగుతుంది మొదటి భార్య ఇష్టంతోనే రెండో భార్య మెడలో తాళి కట్టాలి అలా కాదని తాళి కడితే నువ్వు కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది అలానే జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది నీతో పాటు నీ భర్త ఈ కుటుంబం మొత్తం జైలు పాలు అవ్వాల్సి ఉంటుంది అలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే నేను ఊహించే నీకు ఇప్పుడునాకు గురించి మాట్లాడొద్దని చెప్తున్నాను అని అంటుంది. అసలు కావ్యలో ఏదైనా లోపం ఉందని చూపిస్తేనే కోర్టు మొదటి భార్య కాకుండా రెండో భార్య మెడలో తాళికట్టొచ్చని అంటుంది. అలాంటిది కావ్యలో ఏ లోపం ఉందని చెప్తావు నీ ఇంటి పెద్దల్ని బాగా చూసుకుంటుంది అని చెప్తావా, తన భర్త అంటే తనకి ప్రాణం అని చెప్తావా ఏం చెప్పి కోర్టుని విడాకులు అడుగుతావు అని అంటుంది. నీకు ఏంటి అధికారాలు అప్పగించింది నువ్వు ఇంటి పెద్ద కోడలు విని కాదు అందరిని సమానంగా చూస్తావని నీకు ఈ పవర్ ఇచ్చాను కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు నీ కొడుకు మీద ప్రేమతో స్వార్థంతో నీ కొడుకు గురించి ఆలోచించి కావ్యకి అన్యాయం చేస్తున్నావు అని అపర్ణ మీద కోప్పడుతుంది ఇందిరా దేవి. కాఫీకి అన్యాయం చేస్తే మేము ఇక్కడే చూస్తూ ఊరుకోము నీకు ఇంకొకమాట చెప్పాలి కావ్యకి అన్యాయం చేయాలని నీ మనసులో ఆలోచన వస్తే నీకు అడ్డుగా నిలబడే మొదటి వ్యక్తి నేనేఅని అంటుంది ఇందిరా దేవి. కవి కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని అంటుంది వెంటనే ఆపరణ బెదిరిస్తున్నారా అని అంటుంది అర్థమవ్వట్లేదా అని అంటుంది ఇందిరాదేవి.కావ్యకి ఇష్టం లేకుండా రాజ్మాయిల పెళ్లి చేస్తే కావ్య కోర్టుకు వెళ్తే రాజు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి పరువు పోతుంది అలా పోకుండా ఉండాలి అంటే నువ్వు ఈ నిర్ణయాన్ని మానుకో అని అంటుంది. మరి మీరైతే ఏం చెప్తారు అని అంటుంది అపర్ణ నేనైతే కావేరి న్యాయం చేయమని చెప్తాను అని అంటుంది. అది మాత్రం ఎప్పటికీ జరగదు అని అంటుంది అపర్ణ అయితే రాజు మాయల పెళ్లి కూడా ఎప్పటికీ జరగనివ్వను అని ఇందిరాదేవి బదులు ఇచ్చి వెళ్లిపోతుంది.

Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights
Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights

ఇక మరోవైపు కావ్య విడాకులకు ఇస్తుందని అనుకున్నాను కానీ ఇవ్వనని చెప్పి, పెద్ద షాకే ఇచ్చింది అని మాయ, రుద్ర నీతో అంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రాజును పెళ్లి చేసుకోవచ్చని అనుకున్నాను పర్మినెంట్ గా ఇక్కడే ఉండిపోవచ్చు అనుకున్నాను. ఇదేంటి ఆంటీ ఇలా జరిగింది అని రుద్రా నీతో ఉంటుంది ఇక వెంటనే కావ్య నీకు పద్ధతిగా కనిపిస్తుంది కదా అని ఆమెను తక్కువ అంచనా వేయొద్దు ఆమె శివంగి లాంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పద్ధతిగా పెంచారు కాబట్టి అలా కనిపిస్తుంది తేడా వస్తే ఎవరిని వదిలిపెట్టదు ఈ ఇంటిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టే అంత కెపాసిటీ ఉన్నది అది అని అంటుంది అవునా ఆంటీ అని అంటుంది. నీకు దాని గురించి పూర్తిగా తెలియదు అంతే అని కావ్య గురించి మా యొక్క క్లారిటీగా చెప్తుంది రుద్రాణి. మరి ఎందుకు అపర్ణ ఆంటీ నాకు రాజకీయ పెళ్లి చేస్తానంటే సైలెంట్ గా ఉంటుంది అని అంటే చెప్పాను కదా, ఈ జనరేషన్ లో పుట్టిన ఆనాటి సావిత్రి అని అంటుంది. విలువల కోసం ఏంటి పరువు కోసం అది ఎంత కష్టమైనా భరిస్తుంది అని చెప్తుంది మరి ఎలాగా ఆంటీ అని అంటుంది మాయ, ఇలాంటి పరిస్థితి కోసమే నేను ఎదురు చూసింది ఇప్పుడు తను విడాకులు ఇవ్వను అని గట్టిగా మాట్లాడి వెళ్లిపోయింది ఇప్పుడు మనం వెళ్లి అపర్ణను రెచ్చగొడితే కావ్య ఎదిరించి మీ పెళ్లి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను అట్నుంచి ప్లాన్ ని అమలు చేస్తాను మీ పెళ్లిని కావ్య స్వయంగా నేనే జరిపిస్తాను అని చెప్పేలా చేస్తాను చూడు అని అంటుంది రుద్రణి. ఆ మాటలకు మాయా సంతోషిస్తుంది అప్పుడే అక్కడికి స్వప్న వస్తుంది. స్వప్న మన మాటలు విన్నదేమో అని ఇద్దరు కంగారు పడతారు కానీ స్వప్న వాళ్ళ మాటలు వినదు మాయా రుద్రాణి రహస్యంగా మాట్లాడుకోవడం చూసి అనుకున్నాను మీరిద్దరూ ఒక గుటి పక్షులే అనుకున్నాను అని అంటుంది స్వప్న. మీరిద్దరూ ఒకటే అన్నాను కదా అని ఏ గోరింకో చిలకు అని అనుకునేరు మీకు అలాంటివాటితో పోల్చడం తప్పు గడ్డ రాబందు అలాంటి జాతికి చెందిన వాళ్ళు మీరు అని అంటుంది వెంటనే మాయ మాటలు సరిగ్గా రానివ్వు ఆంటీ కోడలు అని ఆలోచిస్తున్నాను అని అంటే మీ ఆంటీని మూలను కూర్చోబెట్ట నేను నాకు నువ్వు ఎంత అని అంటుంది స్వప్న. చూడండిఈ కొత్తగా వచ్చిన అమ్మాయికి నా గురించి తెలియదట్టుంది కాస్త మీరైనా చెప్పండి అని రుద్రా నీతో అంటుంది స్వప్న. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు నాకు క్లాస్ పీకడానికా అని అంటుంది రుద్ర అని కాదు మంచినీళ్ల కోసం అని అంటుంది. తీసుకొని వెళ్ళిపోవా అని అంటుంది రుద్ర అని స్వప్న మంచినీళ్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటండీ నీ కోడలు అన్ని మాటలు అంటున్నా కానీ మీరు సైలెంట్ గా ఉంటారు అనిఅంటుంది మాయ వెంటనే స్వప్న మామూలుది కాదు అది ఒక బ్రహ్మ రాక్షసి దాంతో పెట్టుకోవద్దు నేను అనుభవంతో ఈ మాట చెప్తున్నాను అని అంటుంది రుద్రాణి.

Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights
Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights

ఇక మరోవైపు రాజ్ కావ్యకు థాంక్స్ చెప్తాడు తనకు విడాకులు వద్దని చెప్పినందుకు చాలా థాంక్స్ అని అంటాడు. మరి నువ్వు విడాకులు ఇస్తాను అంతే మాయతో నాకు పెళ్లి చేసి ఉండే వాళ్ళని అంటాడు. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట మాయతో ఎక్కడ పెళ్లి చేస్తారు అని భయపడుతున్నారు నేను ఆ మాయా కి మీకు పెళ్లి జరగకుండా అడ్డుగా ఉంటానని మీరు నన్ను ఇక్కడ ఉండమంటున్నారా అని అంటుంది కావ్య. నేను మా పుట్టింటికి వెళ్ళి పోతాను కిందకి వెళ్లి ఆంటీతో నాకు ఈ విడాకులు ఇష్టమే అని చెప్తాను అని అంటుంది ఒసేయ్ అందుకే నాతో ఆడుకుంటావు అని అంటాడు రాజ్. నేనంటే ఇష్టం ఉందో లేదో చెప్పండిఅని అంటుంది ఇందాకే చెప్పాను కదా అని అంటాడు రాజ్ అది మీ సమాధానం కాదు అది ఒక కారణం మాత్రమే మీ మనసులో నేనంటే ఇష్టం ఉంది కదా అని అంటుంది.ఇష్టం ఉంది అని చెప్తే జంకెక్కి కూర్చుంటావు ఇష్టం లేదని చెప్తే కిందకి వెళ్లి విడాకులు ఇస్తాను అంటావు నన్ను ఏం చేయమంటావుఅని అంటాడు వెంటనే మీ మనసులో ఏముందో చెప్పండి అని అంటుంది చెప్పాను కదా ఒక పెద్ద రాక్షసిని పెళ్లి చేసుకోవడం కన్నా చిన్న రాక్షసితో అడ్జస్ట్ అవ్వడం మంచిదని నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటాడు. అవునా అయితే మాయనిరాక్షసి కాకుండా మంచి అమ్మాయి వస్తే ఆ ప్లేస్లో ఈ కావ్యకి అన్యాయం చేసే వాళ్లే కదా అని అంటుంది కావ్య. నేనెందుకు అలా చేస్తాను అని అంటాడు మరి ఇప్పుడు మీరు మాట్లాడుతుంది అలానే ఉంది అని అంటుంది ఒసేయ్ నన్ను వదిలిపెట్టవే అని అంటాడు మీరు మాత్రం మనసులో ఉన్నది బయట పెట్టాలి అని అంటుంది.చెప్తున్నాను కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్.

Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights
Brahmamudi Today Episode May 28 2024 Episode  421 highlights

మరోవైపు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ నువ్వు రాజ్ కి మాయకి పెళ్లి చేయాలి అనుకుంటారు.దానివల్ల మనకేం మొరుగుతుంది అని అంటాడు నీకు అర్థం కావట్లేదు రాహుల్ ఇక్కడ కావ్య చాలా పెద్ద ప్రాబ్లమ్స్సృష్టిస్తుంది అసలు కావ్య ఇక నుంచి వెళ్ళిపోతే అప్పుడు మనం మన పనులు సక్రమంగా చేసుకోవచ్చు మనం ఏం చేసినా ఈ ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఉండరు అని అంటుంది రుద్ర అని మా ఆయన పెళ్లి చేసుకున్న రాజు తర్వాత హ్యాపీగా దానితో ఇంకొక బాబుని కంటాడు. ఆ తర్వాత ఆఫీసుకు వస్తాడు అప్పుడు ఏం చేయాలి అని అంటాడు రాహుల్ అలా జరగకుండా నేను చూసుకుంటాను కదాకావ్యతో విడాకులు ఇప్పించి మాయతో రాజ్ కి పెళ్లి చేసి రోజునరకం ఇక్కడే ఉంది అనిపించేలా చేస్తానుఅని అంటుంది రుద్రాణి.ఆఫీస్ కి ఎలా వస్తాడు ఆఫీసుకు కూడా దూరం చేస్తాను అని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఇద్దరి అడ్డు తొలగిపోతుంది అప్పుడుమనం అనుకున్నది అనుకున్నట్లు చేయొచ్చు అనితల్లి కొడుకుల ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు.ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, రుద్రాణిఅనుకున్నట్లుగానే అపర్ణ మరొక భయంకరమైన ప్లాన్ తో అందరినీ పిలుస్తుంది.నాకు నా భర్త కావాలి విడాకులు ఇవ్వను అని అంత ఖచ్చితంగా చెప్తున్నావు కదా ఇప్పటికే అదే మాట మీద ఉన్నావా అని అపర్ణ కావ్యని అడుగుతుంది. మాటమీద నిలబడతాను ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోటానికి ఇది వ్యాపారం కాదు సంసారం అని అంటుంది కావ్య. అయితే నా కొడుకు మా ఆయని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ నో అబ్జెక్షన్ పత్రాలు మీద సంతకం పెట్టు అని అంటుంది అపర్ణ.. ఆ మాటలకు కావ్య రాజ్ షాక్ అవుతారు ఇక రుద్రాణి, మాయా ఇద్దరు సంతోషిస్తారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella