NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

Brahmamudi May 3 2024 Episode 400

Brahmamudi:రాజ్,ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తి కి పదిలక్షలు డబ్బులు ఇచ్చి ఇంటికి వస్తాడు. కావ్య కూడ రాజ్ డబ్బులు ఇచ్చిన విషయాన్ని చూస్తుంది ఏమీ తెలియనట్టు ఇంటికి వస్తుంది రాజ్ కూడా ఏమీ తెలియనట్టు రూమ్ లోకి వస్తాడు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు అంటే బాబుకి డైపర్స్ తీసుకురావడానికి వెళ్ళాను అని అంటుంది. బాబుకి డైపర్ మారుస్తూ ఉంటుంది కావ్య డైపర్స్ కోసమే వెళ్లిందా లేక నన్ను ఫాలో అయిందా అని రాజ్ అనుకుంటూ ఉండగా అదే నిజం అని అంటుంది కావ్య. ఒకసారిగా రాజు ఉలిక్కిపడి ఏంటి ఏమన్నా అని అడిగితే అదే నిజం మీరు అనుకుంటున్నదే నిజం అని అంటుంది. ఏంటా నిజం అని అంటాడు అదే డైపర్స్ కోసం వెళ్లడమే నిజం అని అంటుంది కావ్య. కదా అదే నిజం కదా అని అంటాడు మరి తెలిసి ఎందుకు అడిగారు అంటే గడ్డి బుద్ధి తిన్నది అని అంటాడు అదేంటి రివర్స్లో చెప్తున్నారు అని అంటుంది. నా ఓపిక లేదే బాబు నువ్వే ఈ డైలాగ్ ని అటు ఆ డైలాగ్ వేసుకొని అని అంటాడు.

Brahmamudi May 3 2024 Episode 400
Brahmamudi May 3 2024 Episode 400

ఇక కావ్య రాజ్ నుండి నిజం రాబట్టాలి అని అనుకుంటుంది మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అని అంటుంది. నీ ఫోన్ ఉంది కదా అని అంటాడు దాంట్లో బ్యాలెన్స్ లేదు అని అంటుంది. బాలన్స్ నేను చేయిస్తాను అంటాడు దాంట్లో చార్జింగ్ లేదు అని అంటుంది దాంతో ఇప్పుడు నెట్వర్క్ కోసం కార్ ఏసుకొని బయటికి వెళ్లాలా ఏంటి మీ ఫోన్ ఇస్తే ఏమవుతుంది మీ బిడ్డ తల్లితో దిగిన ఫోటోలు ఏమన్నా ఉన్నాయా ఏంటి అందులో అని అనుమానంగా చూస్తుంది దాంతో అలాంటివేమీ లేవు కావాలంటే తీసుకో అని ఫోన్ ఇస్తాడు రాజ్, కాల్ చేసుకో అని రాజ్ అంటాడు దేనికి కాల్చేసుకోవాలి అని అంటుంది ఫోటో నా అని అంటే కావ్య ఫోన్ కాల్ చేసుకోమన్నాను కాల్చే సుకోమని చెప్పలేదు ఎదవ కుళ్ళు జోకులు నువ్వు తీసుకో అని అంటాడు. ఫోన్ తీసుకొని బయటికి వెళ్లి కావ్య ఫోన్ చేస్తుంది. దీంతో మాత్రం ప్రతిరోజు నాకు టార్చర్ అని బెడ్ మీద పడుకుంటాడు రాజ్. ఇక కావ్య బాల్కనీలోకి వెళ్లి రాజ్ ఫోన్లో నెంబర్స్ ని చూసి షాక్ అవుతుంది ఇందులో ల్యాండ్ లైన్ నెంబర్ తన ఫోన్లోకి ఎక్కించుకొని ఆ నెంబర్ ని అప్పుకి పంపిస్తుంది ఇక అప్పుకి ఫోన్ చేసి ఇప్పుడు నేను నీకు నెంబర్ పంపించాను కదా అది ఎవరిదో కనుక్కో అని ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు కూడా సరే అక్క కనుక్కుంటాను అని అంటుంది ఇక వెనక్కి తిరిగి చూసేసరికి రాజు ఉంటాడు దాంతో కావ్య అంతా చూసేసాడా ఏంటి అని భయపడుతుంది ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావ్ చార్జింగ్ బ్యాలెన్స్ నెట్వర్క్ అని ఏదో అంటాడు. దాంతో కావ్య ఒక్క పుల్లా సిగ్నల్ ఒక్క పుల్ల ఉందండి అని కావ్య అంటుంది మరి నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే ఈ ఒక్క పుల్ల పని చేయకపోతే మీది వాడుకుందాం అని అంటుంది కావ్య దాంతో ఏదో తేడా కొడుతుంది అని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎండ దెబ్బ కొట్టుంటుంది జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా ఫోన్ తీసుకొని మళ్ళీ తన మొబైల్లో నుంచి ఎందుకు ఫోన్ చేసింది నాకు ఏదో అనుమానంగా ఉంది దీని మీద అని అనుకుంటాడు రాజ్ మనసులో కావ్య గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Brahmamudi May 3 2024 Episode 400
Brahmamudi May 3 2024 Episode 400

ఇక మరోవైపు స్వప్న తన డాక్యుమెంట్స్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది తన రూమ్ లో ఉన్న బట్టలన్నీ కింద పడేసి మరీ వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ పేపర్స్ మాత్రం కనిపించవు అసలు ఒరిజినల్ పేపర్స్ వాడి దగ్గరికి ఎలా వెళ్లాలి దీంట్లో ఏదో వుంది ఎవరు వాడికి హెల్ప్ చేశారు. లేదంటే నా రాక్ లో ఉండాల్సిన పేపర్స్ వారి చేతిలోకి ఎలా వెళ్లాయి. కానీ సంతకం ఎలా చేశాను అసలు అది ఫోర్జరీ చేసినట్టుగా కూడా లేదు ఒరిజినల్ గా నేనే పెట్టినట్టుంది ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ నిజం బయట పెట్టాలి ఎలా బయట పెట్టాలి ఆ వడ్డీ వ్యాపారం నుంచి నిజం ఎలా రాబట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన తల్లి కనకానికి ఫోన్ చేస్తుంది. ఏంటే నాకు ఫోన్ చేశావు ఎవరో నెంబర్ అనుకోని రాంగ్ నెంబర్ కి కాల్ చేసినట్టున్నావంటే నేను కరెక్ట్ నెంబర్ కి చేశాను అని అంటుంది స్వప్న. నీ సోది ఆపవే అని అంటుంది.నీ సోది మొదలు పెడతావా అని అంటుంది కనకం. నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది అని అంటే ఏం ప్రాబ్లం అని అంటుంది అర్జెంటుగా నేనొక చోటికి రమ్మని చెప్తాను అక్కడికి రా అని అంటుంది అసలు ఏమైందో విషయం చెప్పు అంటుంది కనకం. స్వప్న జరిగిందంతా చెబుతుంది. ఏంటి నీ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారా నువ్వు ఫోన్ పెట్టేసే నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది.

Brahmamudi May 3 2024 Episode 400
Brahmamudi May 3 2024 Episode 400

ఇక స్వప్న వడ్డీ వ్యాపారి ఇంటికి వస్తుంది కుక్కలు లాంటివి ఏమీ లేవు ఇక్కడ ఇంతకీ మా అమ్మ ఎక్కడ ఉందో అని అనుకుంటుంది. కనకానికి ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నావ్ అని అంటుంది వడ్డీ వ్యాపారి ఇంట్లో అని అంటుంది నేను ఇక్కడే ఉన్నాను కదా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే, వెనక్కి తిరిగితే కనిపిస్తాను అని అంటుంది కనుక వెనక్కి తిరిగి ఎక్కడ అని చూసేసరికి కనకం అమ్మవారు వేషంలో కనిపిస్తుంది దాంతో ఒకసారిగా స్వప్న షాక్ అవుతుంది. పెద్దంగా అరుస్తుంది ఒసేయ్ అరవకే అని అంటుంది కనకం. అమ్మో అమ్మోరు అని అంటే అమ్మోరు గెటప్ లో వచ్చిన మీ అమ్మని చూడు ఇదిగో నా ఫోను అని అంటుంది. నువ్వే కదే అమ్మోరు గెటప్పు తీసుకొని రమ్మన్నావు అని అంటే తీసుకు రమ్మన్నాను కానీ వేసుకోమని లేదు కదా అని అంటే, టైం వేస్ట్ ఎందుకని వేసుకొని వచ్చాను అని అంటుంది కనకం. నువ్వే భయపడ్డావంటే ఆ వడ్డీ వ్యాపారి కూడా భయపడతాడు అని అంటే భయపడడం కాదు భయపెట్టాలి అని అంటుంది నీకు ఎందుకు అదంతా నేను చూసుకుంటాను కదా ఇంతకీ లోపలికి వెళ్ళమంటావా అని అంటుంది. వద్దే ఉదయాన్నే శుభ ముహూర్తం ఉందిట చూసుకొని వెళుదువు గానివి అని అంటుంది. అప్పటికి తెల్లవారింది కదా ఎండాకాలం కదా అని అంటుంది.స్వప్న సీరియస్గా చూస్తుంది. ఓకే నాకు అర్థమైంది ఇప్పుడే లోపలికి వెళ్ళమంటావా అంతే కదా వెళ్తున్నాను బాయ్ అని చెప్పి కనకం వడ్డీ వ్యాపారి గదిలోనికి వెళ్తుంది. వడ్డీ వ్యాపారి మెడమీద త్రిశూలం పెట్టి బెదిరిస్తుంది. సేటు నిజంగానే అమ్మోరు వచ్చిందని భయపడతాడు. నువ్వు ఇంతకాలం ఎన్ని తప్పులు చేసినా ఊరుకున్నాను ఇప్పుడు నా ఆప్త భక్తురాలు స్వప్న ఆస్తి పేపర్స్ నీ దగ్గర పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావా అని అంటుంది. దాంతో సేటు అవి నేను తీసుకోలేదమ్మా ఆ రాహులే వచ్చి ఇచ్చాడు అని అంటాడు. దాంతో వడ్డీ వ్యాపారిని అయితే ఆ పేపర్స్ వెంటనే స్వప్న కి ఇచ్చేసే నిన్ను క్షమించేస్తాను నేను క్షమించమని స్వప్న కూడా కలలో చెప్తాను అని అంటుంది. దాంతో వడ్డీ వ్యాపారి అలాగే అమ్మ అని కళ్ళు మూసుకుంటాడు ఇక వెంటనే కనకం అక్కడి నుంచి మాయమవుతుంది కళ్ళు తెచ్చిన సేటు అమ్మ మాత ఎక్కడున్నావ్ అని అనుకుంటాడు. ఇక స్వప్న దగ్గరికి వచ్చి కనకం వాడి నిజంగా నమ్మేసాడు నీ పేపర్స్ నీకు తెచ్చి ఇస్తాడు చూడు రేపు అని అంటుంది. దాంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళుతుంది.

Brahmamudi May 3 2024 Episode 400
Brahmamudi May 3 2024 Episode 400

ఇక కావ్య అప్పు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుకి ఫోన్ నెంబర్ ఇచ్చి చాలా సేపు అయింది కనుక్కుందో లేదో అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అప్పు కావ్య కి ఫోన్ చేస్తుంది. నీ ఫోన్ కోసం ఎంత ఎదురు చూస్తున్నాను తెలుసా అని అంటుంది. నువ్విచ్చిందేమన్నా ఆర్డర్ అనుకున్నావా డెలివరీ చేయడానికి ఫోన్ నెంబరు అడ్రస్ కనుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది అని అంటుంది అప్పు. ఇంతకీ అడ్రస్ దొరికిందా లేదా అని అడుగుతుంది కావ్య దొరికింది అని చెప్తుంది. అడ్రస్ ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది అని అంటే అన్ని వివరంగా చెప్తాను కానీ ముందు ఎందుకు అనుకోమన్నావో చెప్పు అని అంటుంది. నువ్వు విషయం ఏంటో చెప్తే కానీ నేను చెప్పను అని అంటుంది అప్పు. ముందు ఈ అడ్రస్ ఎందుకు అనుకోమన్నావో చెప్పు అని బలవంతం చేస్తుంది. మీ బావ గారు బాబుని తీసుకొచ్చాడు కదా ఆ బాబు తల్లి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఒకడు దొరికాడు. వాని పట్టుకుంటే ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోవచ్చని కనుక్కోమన్నాను అని అంటుంది. నువ్వు ఇప్పుడు అడ్రస్ తెలుసుకొని వాడి దగ్గరికి వెళ్లి ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా అని అంటుంది అప్పు. నీకేమన్నా అయితే ఏమవుతుంది అని అంటుంది అప్పు. వెళ్లాల్సిందే అని అంటుంది కావ్య. అలా అని నేను సైలెంట్ గా కూర్చుంటే మీ బావగారు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు అప్పు నాకు ఎక్కువ టైం లేదు అని అంటుంది కావ్య. అయితే నేను ఈ విషయంలో సహాయం చేస్తాను ఇద్దరం కలిసి నిజం ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రయత్నంలో నీకేమైనా అయితే నేను తట్టుకోలేని అని అంటుంది కావ్య. అయితే నేను అడ్రస్ చెప్పను అని అంటుంది అప్పు. అక్క అక్క నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అందరి కోసం నువ్వు ఎంత చేసావో మాకు తెలుసు ఇప్పుడు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోమంటావా ఏం జరిగినా సరే మనిద్దరం కలిసే పోరాడుదాం అని అంటుంది. ఒప్పుకుంటున్నావా లేదా అని అంటుంది అప్పుడు ఒప్పుకోకపోతే నువ్వు ఊరుకోవు కదా అంటుంది కావ్య అడ్రస్ నాకు మెసేజ్ చెయ్యి ఉదయానే వాడి దగ్గరికి వెళ్దాం అని అంటుంది. నువ్వు డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసేయ్ అక్క లొకేషన్ దగ్గరికి నేను మా వాళ్ళతో వస్తాను అని అంటుంది మీ వాళ్ళంటే ఎవరే అని అడుగుతుంది కావ్య రేపు నువ్వే డైరెక్ట్ గా చూస్తావు కదా అని అంటుంది. ఇకఅప్పు ఫోన్ పెట్టేస్తుంది.

Brahmamudi May 3 2024 Episode 400
Brahmamudi May 3 2024 Episode 400

ఇక మరోవైపు రాహుల్ రుద్రాణి ఇద్దరు మందు కొడుతూ ఉంటారు. రాహుల్ ఇంత సంతోషంగా ఎప్పుడూ లేదు మమ్మీ అని అనుకుంటాడు అప్పుడే స్వప్న గది దగ్గరికి వచ్చి వాళ్ళిద్దర్నీ చూసి, నా పేపర్స్ కాల్ చేసి నన్నే మోసం చేసి కోటి రూపాయలు తీసుకొని ఇప్పుడు నాకే హ్యాండ్ ఇద్దామని చూస్తున్నారా చెప్తా మీ సంగతి అని మనసులో అనుకుంటుంది. ఇకమీదట మనకు అన్ని హ్యాపీడేస్ ఏరా అని అంటుంది రుద్ర అని అప్పుడే లోపలికి స్వప్న వస్తుంది నేను ఇంత బాధలో ఉంటే మీరిద్దరూ మందు కొడుతున్నారా అని అంటుంది. దాంతో స్వప్న అది కాదమ్మా నువ్వు బాధలో ఉన్నావు మాకు నీవు బాధపడడం చూసి తట్టుకోలేక ఎలాగైనా మందు కొట్టి బాధని మర్చిపోదామని ఇలా చేస్తున్నాము అని అంటుంది. అవునవును తెలుస్తూనే ఉంది అని అంటుంది స్వప్న ఇక రాహుల్ అవును స్వప్న నేను కూడా అందుకే అని అంటాడు. నాక్కూడా బాధని మర్చిపోయి మందు తాగాలని ఉంది కానీ నా కడుపులో బిడ్డ ఉంది కాబట్టి మందు తాగలేకపోతున్నాను అని అంటుంది స్వప్న. మంచి పని చేశావు స్వప్న అని అంటాడు కాదు కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలి అని అంటుంది స్వప్న దాంతో రుద్రాణి నీ కోసం మీ మీదైనా చేస్తాము అడుగు అని అంటుంది. అయితే నన్ను కొంచెం ఎంటర్టైన్ చేయండి అని అంటుంది. సాంగ్స్ పెడితే నేను డాన్స్ చేస్తాను అని అంటుంది సరే అని సాంగ్స్ ప్లే చేస్తాడు రాహుల్ ఇప్పుడు నేను రుద్రాణి మీరు స్వప్న క్యారెక్టర్స్ మార్చుకుందాము నేను అత్తగారు మీరు కోడలు అని అంటుంది. దానికి రుద్రాణి సరే అలాగే అని అంటుంది. వాళ్ళిద్దరితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది స్వప్న ఇక స్వప్న వేసిన ప్లాన్ లో రుద్రాణి చిక్కుకున్నట్లే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 3 2024 Episode 400
Brahmamudi May 3 2024 Episode 400

రేపటి ఎపిసోడ్ లో అప్పుని తీసుకొని,కావ్య రాజ్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. నిజం చెప్పు నువ్వు రాజ్ సార్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా ఆ నిజం ఏంటో చెప్పు అని అంటుంది. దాంతో ఎవరు అని అడుగుతాడు నాకు అంతా తెలుసు. నువ్వు నేను డబ్బులు తీసుకోవడం నేను చూశాను. నువ్వు దాచి పెట్టాల్సిన విషయం ఏంటో నాకు చెప్పాల్సిందే అని అంటే రాజ్ సార్ ఆ నిజం చెప్తే నన్ను చంపేస్తారు అని అంటాడు. నిజం చెప్పకపోతే నేను ఊరుకోను నాకు నిజం చెప్పి నువ్వు ఇక నుంచి పారిపో అని అంటుంది ఈ ఐడియా ఏదో చాలా బాగుంది మేడం అని అంటాడు ఆ వ్యక్తి. అప్పు నీ పోలీసుల్ని చూస్తూ ఉంటాడు ఇక నిజం చెప్పక తప్పేటట్లు లేదనుకొని కావ్యతో నిజం మొత్తం చెప్తాడు. 18వ తారీకు రాజు సార్ ఇక్కడికి వచ్చాడు అని నిజాన్ని చెప్తాడు. ఆ నిజం విని కావ్య షాక్ అవుతుంది. ఇంతకీ రాజ్ బిడ్డకి తల్లి ఎవరన్నది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella