NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

Brahmamudi May 6 Episode 402

Brahmamudi:కావ్య,అప్పు ఇద్దరూ కలిసి రాజ్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే, నేను ఎన్కౌంటర్ చేయాల్సి ఉంటుంది అని అప్పు పోలీసులతో బెదిరిస్తుంది దాంతో ఆ వ్యక్తి ఆరోజు జరిగిన విషయాన్ని మీకు చెప్పేస్తాను అని అంటాడు. కావ్య నిజం చెప్పు, లేదంటే నేను ఊరుకోను అని అంటుంది లేదు మేడం నేను నిజం చెప్తాను అని అంటాడు రాజ్ సార్ మాయ మేడం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఆరోజు పని ముగించుకొని ఆలస్యంగా ఇక్కడికి వచ్చాను వచ్చేసరికి వాళ్ళు మాట్లాడుకోవడం చూశాను నాకు వాళ్ళు మాట్లాడుకోవడం చూసి ఏదో అనుమానం వచ్చింది. ఎప్పుడు బాబుని కేర్ సెంటర్ లో వదిలిపెట్టి వెళ్లే మాయ ఇప్పుడు ఇంత లేటుగా బాబుని తీసుకువచ్చింది అది కూడా లోపలికి వెళ్లకుండా బయట రాజ్ సార్ తో మాట్లాడుతుంది ఏంటి అని నాకు అనుమానం వచ్చింది. వాళ్ల అసలే మాట్లాడుకుంటున్నారో వినాలని వాళ్లకు తెలియకుండా వాళ్లు మాట్లాడుకునేదంతా విన్నాను అని చెప్తాడు.

Brahmamudi May 6 Episode 402
Brahmamudi May 6 Episode 402

ఇక కేర్ సెంటర్ అతను మాయ బాబుని ఇక్కడ వదిలిపెట్టకుండా ఏం చేస్తుంది ఈయనతో ఏం మాట్లాడుతుంది అని వింటూ ఉన్నాను. బెదిరించడానికి వచ్చావా అని రాజ్ అడుగుతాడు. నువ్వు బెదిరించడానికి నేను ఒప్పుకోను అని అంటాడు ఇలా ఆపితే నా బిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది అని మాయ అడుగుతుంది. జరిగిందంతా మర్చిపోతే జరగాల్సింది నేను చూసుకుంటాను అని రాజ్ అంటాడు ఎంత కాలం ఎవరో చెప్పకుండా నేను అందరి చేత నిందలు పడుతూ బతకాలి అని అడుగుతుంది ఇప్పుడు నువ్వు వచ్చి మాత్రం ఏం చేస్తావు అని అడుగుతాడు. నా బిడ్డకు న్యాయం చేస్తాను అని అంటుంది. నాకు ఇంకా ఏ దారి కనిపించలేదు ఈ బిడ్డతో పాటు, నేను మీ ఇంటికి రావడం తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేదు అని మాయ అంటుంది. ఇదంతా కావ్యతో చెబుతూ ఉంటాడు కేర్ సెంటర్ ఓనర్, నేను ఈ బిడ్డతో మీ ఇంటికి రాకుండా ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అని మాయ రాజ్తో అంటుంది తొందరపడొద్దు అని అంటాడు రాజ్ దయచేసి ఏ గొడవ చేయొద్దు అని బతిమిలాడుతూ ఉంటూ ఉంటాడు దీనికి తప్పకుండా ఏదో ఒక దారి నేను వెతుకుతాను కదా నా మాట మీద నమ్మకం ఉంచు అని అంటాడు మళ్ళీ మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు కదా మర్యాదగా నా బిడ్డని నన్ను మీ ఇంటికి తీసుకెళ్లండి ఈ బిడ్డని మీ వారసుడిగా పరిచయం చేయండి. లేదంటే నేనేం చేస్తాను నాకే తెలియదు అని అంటుంది అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది మీకు మాటిస్తున్నాను న్యూ కాస్త ఓపిక పట్టు ఒకేసారి నిన్ను విడని తీసుకెళ్తే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది ఇప్పుడు నువ్వు కోరుకున్నట్లుగా ఈ బిడ్డను తీసుకెళ్లి నా వారసుడిగా ప్రకటిస్తాను ఆ తర్వాత సమయం చూసి నిన్ను కూడా తీసుకువెళ్తాను. ప్రస్తుతం నేను చెప్పినట్లు చెయ్యి అని అంటాడు రాజ్ మీరు నన్ను మోసం చేయట్లేదు కదా అని అంటుంది ఇప్పుడు నువ్వు నన్ను నమ్మడం తప్ప వేరే దారి లేదు అని అంటాడు. మీరు మాట తప్పిన నా బిడ్డకు ఏదైనా హాని జరిగినా నేను మాత్రం సాక్షాదారాలతో సహా మీడియా ముందుకు వెళ్తాను అని మాయ రాజ్ ని బెదిరిస్తుంది. అలాంటి పరిస్థితి నీకు ఎప్పటికీ రానివ్వను నేను మాటిస్తున్నాను కదా అని రాజ్ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది ఆ బిడ్డ రాజ్ సార్ మాయా కి పుట్టిన ఇల్లీగల్ సంతానమని అర్థమైంది. దాంతో కావ్య అప్పు ఇద్దరు షాక్ అవుతారు. ఇక రాజధాని బెదిరిస్తే డబ్బులు వస్తాయి కదా అని నేనే ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాను కానీ రాజ్ సార్ చాలా మంచివారు నన్ను పోలీసులకి పట్టించకుండా నేను అడిగినంత డబ్బు ఇచ్చారు అని అంటాడు. వెంటనే కావ్య ఇప్పుడు ఆ మాయా ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఏమో మేడం నాకు తెలీదు అని అంటాడు వెంటనే అప్పు ఇట్లా ఎందుకు చెప్తాడు అక్క అని అంటుంది. లేదు మేడం నిజంగా నాకు తెలియదు ఆమె ఇచ్చిన అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్నీ తప్పే ఆవిడ ఎక్కడుందో కూడా మాకు తెలియదు అని అంటాడు దానితో అక్కడి నుంచి బయటికి వస్తారు.

Brahmamudi May 6 Episode 402
Brahmamudi May 6 Episode 402

ఇక కావ్య, చాలా బాధగా బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఏంటి అక్క ఆలోచిస్తున్నావు కదా ఇంటికి వెళ్లి అందరి ముందు బావ గారు చేసిన బండారం బయట పెడదాము నువ్వు ఇంకా బావ మీద నమ్మకం పెట్టుకుంటున్నావా ఏంటి అని అంటుంది. ఆరోజు ఆయన కళ్ళల్లోనే నిజం చూశాను ఈరోజు నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లారు. ఆరోజు నాకోసం ఒకే కూడా తీసుకున్నారు ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్లారు. ఆఫీస్ నుంచి కేర్ సెంటర్ కి వచ్చి ఆ బాబుని తీసుకొని ఫంక్షన్ దగ్గరికి వచ్చారు అంటే ఆఫీస్ లోనే ఏదో జరిగింది. ఆఫీస్ కి వెళ్లే వరకు కూడా ఆ బిడ్డ గురించి ఆయనకు తెలియదు. ఇంకా దాని గురించి అంత ఆలోచిస్తున్నావేంటి అక్క ఆయన నీకు బాబు గురించి చెప్పడానికే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నానని చెప్పి ఉంటాడు అని అంటుంది అప్పు. అలాంటప్పుడు మీ అందరికీ ఒక నిజం చెప్తాను అని అనాలి కాని ముఖ్యమైన నిర్ణయం అని ఎందుకు అంటాడు దీంట్లో ఏదో ఉంది అప్పు ఆఫీస్ లోనే ఏదో జరిగింది అదేదో తెలియాలంటే మనం ఆఫీస్ కి వెళ్ళాలి అని అంటుంది అవునా అనిపిస్తుంది. పద మనం ఆఫీస్ కి వెళ్దాం అని ఇద్దరు కలిసి ఆఫీసుకి బయలుదేరుతారు.

Brahmamudi May 6 Episode 402
Brahmamudi May 6 Episode 402

ఇక మరోవైపు సేట్ ఏంట్రా అలా మారిపోయాడు అని రుద్రాణి అంటుంది అసలు ఆ స్వప్న భక్తురాలని వాడు స్వప్నని చాలా పొగుడుతున్నాడు అని చెప్తాడు స్వప్న ఏదో చేసింది అని రుద్రాణి అంటుంది దాని బంధ దానికి అని తెలివితేటలు లేవు మమ్మీ అని అంటాడు కానీ సేటు మారడం వెనక కచ్చితంగా స్వప్నే ఉండి ఉంటుంది అని రుద్రాణి ఆలోచిస్తుంది ముందు దాని సంగతి పక్కన పెట్టు వాడి కోటి రూపాయలు ఇవ్వు రెండు రోజుల్లో ఇవ్వమన్నాడు నీ దగ్గర కోటి రూపాయలు సేఫ్ గానే ఉన్నాయి కదా అని అడుగుతాడు రాహుల్. నాలాకర్ లోనే దాచి పెట్టాను అని అంటుంది అయితే వెంటనే ఇచ్చేసే మమ్మీ పరుల సొమ్ము పాము లాంటిది కాటి వేయకముందే ఇచ్చేస్తే మనకి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. వాడి కనక మనం డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి నిజం చెప్తానని బెదిరిస్తున్నాడు అని చెప్తాడు దాంతో రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే స్వప్న కావాలని ఫోన్ మాట్లాడుతూ రుద్రాణి రూం దగ్గరికి వచ్చి నేను నా స్టేటస్ కి తగ్గ కార్ని కొనాలి అనుకుంటున్నాను నువ్వు చెప్పే చీప్ కారులో నేను ప్రయాణం చెయ్యను. నేను కారు కొనాలంటే మినిమం దాని విలువ కోటి రూపాయలు ఉండాలి అని అంటుంది ఆ మాట విని రాహుల్ రుద్రాణి ఇద్దరు షాపోతారు కోటి రూపాయలు అంట మమ్మీ అని అంటాడు.వినబడింది అని అంటుంది రుద్రాణి ఏదో ఒకటి చేసి మీరు నాకు ఆ లగ్జరీ కార్ ని తీసుకొని రండి అని అంటుంది అయితే నేను చీప్ గా ఈఎంఐ కట్టను కోటి రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చేస్తాను అని అంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అవుతారు రుద్రాణి రాహుల్. స్వప్న కావాలని వాళ్ళ ముందు ఫోన్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మమ్మీ నాకెందుకో డౌట్ గా ఉంది ఒకసారి నీ దగ్గర ఉన్న డబ్బులు చూపించు అని అంటాడు వెంటనే రుద్రాణి డబ్బులు కోసం లాకర్ని ఓపెన్ చేస్తుంది. అందులో బ్రీఫ్ కేసు ఉంటుంది అమ్మయ్య డబ్బులు ఉన్నాయి రా అని అంటుంది ముందు బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి అందులో డబ్బులు ఉన్నాయో లేదో చూడు అని అంటాడు వెంటనే బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉండవు గోవిందా గోవిందా అని మన డబ్బులు అన్నీ పోయాయి మమ్మీ అని రాహుల్ బాధపడతాడు. ఆ స్వప్న ఇదంతా కాల్ చేసి కోటి రూపాయలు పెట్టి కారు కొనబోతుంది అని ఇద్దరికీ అర్థమవుతుంది అయితే వెళ్లి దాని అంతు చూస్తాను నా డబ్బులు నాకు ఇవ్వమని అడుగుతాను అని అంటుంది రుద్రణి ఎలా అడుగుతావు మమ్మీ వెళ్లి అడిగితే అది డబ్బులు ఎలా ఇస్తుంది. అప్పుడు మనం సేటు దగ్గర తీసుకున్న అప్పు గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వకపోతే ఆ సేటు ఇంటికి వచ్చి మన గురించి నిజం చెప్పేస్తాడు ఇప్పుడు మన నెత్తిన కోటి రూపాయలు అప్పు పడింది ఏం చేయాలో ఆలోచించు మనం బయటికి వెళ్లి అడుక్కున్నా కూడా జీవితకాలంలో కోటి రూపాయలు సంపాదించలేము మమ్మీ అని అంటాడు. నువ్వు లాస్ట్ లో ఉన్నప్పుడు లాజిక్కులు మాట్లాడావంటే, అని రుద్రాణి కోప్పడుతుంది దాంతో నువ్వు బాగా ఆలోచించి నాకు ఫోన్ చెయ్ అప్పుడు నేను ఇంటికి వస్తాను అని రాహుల్ వెళ్ళిపోతాడు. కోటి రూపాయలు స్వప్న నుండే వసూలు చేస్తాను అని రుద్రాణి అనుకుంటుంది.

Brahmamudi May 6 Episode 402
Brahmamudi May 6 Episode 402

ఇక మరోవైపు ఆఫీస్ కి వెళ్లిన అప్పు, కావ్య ఇద్దరు అక్కడ శృతి నీ పెళ్లి రోజుమా వారు ఎవరితోనైనా ఆఫీసులో మాట్లాడారా అని అడుగుతారు శృతి అలాంటిదే లేదు మేడం అని చెప్తుంది దాంతో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతారు ఎవరూ మాకు తెలియదు అని చెప్తారు దాంతో అప్పు వాచ్మెన్ ని అడిగితే నిజం తెలుస్తుంది కదా అక్క అని అంటుంది. అప్పుడే వాచ్మెన్ ని పిలిచి నిజం అడుగుతారు మా పెళ్లి రోజు నీకు గుర్తుంది కదా అంటే గుర్తుంది మేడం రాశారు నాకు బట్టలు కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చారు అని అంటాడు అయితే ఆరోజు సాయంత్రం ఏం జరిగిందో నీకు గుర్తుందా అని అడుగుతుంది ఎవరైనా రాజు సార్ ని కలవడానికి వచ్చారా అని అడుగుతుంది. ఎవరు రాలేదు మేడం అని అంటాడు. నువ్వు నిజం చెప్తున్నావా లేదా అని అప్పు బెదిరిస్తుంది నిజం చెప్తున్నాను మేడం ఆరోజు నేను ఐదు నిమిషాలు టీ తాగడానికి వెళ్లాను కావాలంటే మీరు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు అని అంటాడు దాంతో వాచ్మెన్ కావ్య ఆపులని సిసిటీవీ ఫుటేసి దగ్గరికి తీసుకువెళ్తాడు వాళ్లు ఆరోజు సాయంత్రం రాజ్ ఆఫీసులో ఉన్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తారు కానీ మూడు గంటలు డిలీట్ చేసి ఉంటుంది ఈ మూడు గంటలు ఎవరి డిలీట్ చేశారు అని కావ్య అడుగుతుంది ఏమో మేడం నాకు తెలియదు అంటాడు. నిజం చెప్పకపోతే అని బెదిరిస్తుంది దాంతో ఆ గుర్తొచ్చింది మేడం రాజ్ సార్ డిలీట్ చేశారు అని చెప్తాడు అది విని ఇద్దరు షాక్ అవుతారు. ఆ రోజే సార్ హడావిడిగా వచ్చి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్తాడు దాంతో కావ్య చూసావా తను మనకి తెలియకుండా ఉండాలని ముందుగానే సాక్ష్యం మాయం చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేశారు కచ్చితంగా మూడు గంటల్లోనే ఏదో జరిగింది ఎవరో వచ్చారు మనం అది కనుక్కుంటే కానీ ఏ విషయం మనకి క్లారిటీ రాదు అప్పు అని అంటుంది కావ్య అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది అక్క ఆ హార్డ్ డిస్క్ గనక నాకు ఇస్తే నేను ఆ మూడు గంటల సీసీటీవీ ఫుటేజ్ ని రికవరీ చేయిస్తాను అని అంటుంది. వాచ్మెన్ ఆ హార్డ్ డిస్క్ ని వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు కచ్చితంగా రిచారి అవ్వాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది కావ్య నువ్వేం ఫిగర్ చేయకు అక్క ఖచ్చితంగా నీకు సాయంత్రం కల్లా రికవరీ చేసి నీకు పంపిస్తాను అని అంటుంది.

Brahmamudi May 6 Episode 402
Brahmamudi May 6 Episode 402

ఇక ఇంట్లో అందరూ డిన్నర్ కి రెడీగా ఉంటారు అప్పుడే కావ్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉంటారు. అప్పుడే రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే వెంటనే అపర్ణ లేస్తుంది. ఎందుకు లేచారు అని అడుగుతుంది నిజం నీకు తెలియదా అని అంటుంది. ఇప్పుడు ఆయనతో కలిసి భోజనం చేస్తే మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా లేప లేదంటే మీ వంశానికి ఏమన్నా అప్రతిష్ట వస్తుందా అని అంటుంది. నాకు ఇష్టం లేదు అని అంటుంది అపర్ణ మీరు వెళ్లిపోతే ఆయన తృప్తిగా భోజనం చేస్తారు అనుకుంటున్నారా అని అంటుంది. మీరు భోజనం చేయకపోతే అది మావయ్య గారు చూసుకుంటారు కానీ నా భర్త భోజనం గురించి నేనే ఆలోచించాలి కదా అని అంటుంది వెంటనే కళావతి అని అంటాడు రాజ్. నేనేమైనా తప్పు మాట్లాడానా అని అంటుంది కావ్య నిజం మాట్లాడావ్ అమ్మ అని అంటాడు సుభాష్ మాతృత్వం మంట కలిసి పోతుంటే నువ్వే ప్రశ్నించాలి అని అంటాడు నువ్వు తినకుండా వాడు తినకుండా ఇలా ఎన్నాళ్లు అని సుభాష్ అంటాడు. రెండు రోజులే అని అంటుంది. అవును రెండు రోజుల నుండి నేను వాడికి ఇచ్చిన టైం పూర్తవుతుంది వాడు నిజం చెప్పడానికి నాకు అర్థం అయిపోయింది ఇంట్లో నుంచి వెళ్లిపోవడం తప్ప వాడికి వేరే ఆప్షన్ లేదు వాడి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. అని అపర్ణ అంటుంది దాంతో కావ్య అంటే వెలివేస్తారా ఇంట్లో నుంచి పంపించేస్తారా మీ వారసత్వాన్ని మీరే దూరం చేసుకుంటారా అని అడుగుతుంది. ఇదంతా నువ్వే ఎందుకు అడుగుతున్నావ్ వాడు అడగొచ్చు కదా వాడు అడగట్లేదు అంటే అర్థం అయిపోయింది కదా వాడికి తల్లి కన్నా బిడ్డ ఎక్కువ అని, అంటుంది అపర్ణ.

Brahmamudi May 6 Episode 402
Brahmamudi May 6 Episode 402

ఇక మధ్యలో రుద్రాణి, నీకు అసలు విషయం అర్థం కావట్లేదు వదిన రాజు వెళ్లిపోతే తను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది అప్పుడు ఈ ఆస్తి వదులుకోవాల్సి వస్తుంది అని కావ్య బయపడుతుంది అని అంటుంది రుద్రాణి. పుట్టింటికి వచ్చి ఉంటున్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు బాగోలేదు రుద్రాణి గారు అని అంటుంది కావ్య ఇన్నాళ్లు నేను ఇక్కడ ఏ ఆస్తి అనుభవించానని మీరు ఆ మాట అంటున్నారు పట్టడం తప్ప నేనేమైనా ఆశించానా అని అంటుంది అయినా నేను ఆయన వెళ్ళిపోతే ఆయన వెనకాల నేను వెళ్తే నన్ను పోషించలేరు అనుకుంటున్నారా నా భర్త అని అంటుంది అసలు ఇప్పటివరకు నువ్వు ఇలా ఉండడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అని రుద్రాణి అంటుంది వెంటనే సుభాష్ మాట్లాడుతున్న కూడా ఆశ్చర్యంగానే ఉంది మొగుడితో తేగదింపులు చేసుకున్న నీలాంటి వాళ్లని చూసి కూడా కావ్య తెగదింపులు చేసుకోకుండా ఇంకా ఇక్కడే ఎందుకు ఉందా అని ఆశ్చర్యంగా ఉంది. భర్త తప్పు చేశాడని తెలిసి బిడ్డను తీసుకొచ్చి వారసుడిగా ప్రకటించిన కూడా, అందరూ తప్పు పడుతున్న తను మాత్రం నిర్భయంగా నిలబడింది అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. కావ్య ఆత్మస్థైర్యం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. తన సహనానికి లోకంలో నీలాంటి ఆడవాళ్లు తనలాంటి గుణవంతురాలని మాటలు అంటున్న పడుతూ ఇంకా ఇక్కడే నిలబడి ఉంది చూసావా అందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది అని సుభాష్ అంటాడు వెంటనే రుద్రాణి కోపంగా పెద్దన్నయ్య అని అరుస్తుంది చాలు ఆపు అభినందించడం ఆపేసి నిందిస్తావా ఆస్తి కోసం ఉంటుందని నా కోడల్ని నానా మాటలు అంటావా నా కోడలు అనే హక్కు నీకుందా? నోరు మూసుకొని అన్నం తిను అని అంటాడు సుభాష్. నా కోడల్ని అనే హక్కు నీకు ఎప్పటికీ రాదు, లేదు కూడా అని అంటాడు సుభాష్ దాంతో కావ్య మౌనంగా ఉంటుంది రాజ్ కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 6 Episode 402
Brahmamudi May 6 Episode 402

రేపటి ఎపిసోడ్ లో అప్పుకి కావ్య కాల్ చేస్తుంది.నేను చెప్పిన పని ఎంత వాడికి వచ్చింది అని అడుగుతుంది. ఆ కిట్టుగానే టార్చర్ పెట్టి రికవరీ చేయించాను అక్క అని అంటుంది అయితేనిజంగా రికవరీ అయ్యిందా అని అంటే నీ మెయిల్ కి ఆల్రెడీ డ్రైవ్ చేసి వీడియోలు సెండ్ చేశాను ఓపెన్ చేసి చూసుకో అక్క అని అంటుంది. వెంటనే కావ్యా లాప్టాప్ దగ్గరికి వెళ్లి సిసిటీవీ ఫుటేజీ, రికవరీ అయిన వీడియోలను చూసి ఆశ్చర్య పోతుంది ఒకసారిగా కావ్య కళ్ళు పెద్దవి చేసి, షాప్ లో ఉండిపోతుంది. అంటే ఈ బిడ్డ ఆయన బిడ్డ కాదన్నమాట అని కావ్య అనుకుంటుంది. అసలు సిసి టివి ఫుటేజ్ లో ఏముందో తెలియాలంటే, ఆ బిడ్డ రహస్యం తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella