Brahmamudi 189 ఎపిసోడ్:నిన్నటి ఎపిసోడ్ లో,కావ్య వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పంతులుగారు పూజ చేయించి భర్త ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్తారు. అప్పుడు కావే సరే అని రాజ్ దగ్గరకు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళుతుంది కానీ రాజు వరలక్ష్మి వ్రతం చేసుకున్న కావేని రాజు ఆశీర్వదించకుండా వెళ్ళిపోతాడు.అపర్ణ సంతోషపడుతుంది.

ఈరోజు 192 వ ఎపిసోడ్ లోరాజు ఆశీర్వదించకుండా ఎందుకు వెళ్లిపోయాడు కనుక్కోవడానికి కావ్య కూడా రాజ్ వెనకే వెళుతుంది. కావ్య రాజు నిలదీస్తుంది ఇదేమి తన ఇష్టంతో జరిగిన పెళ్లి కాదని తనని భార్యగా అంగీకరించడం లేదని చెప్తాడు రాజు మనిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టినట్టు కావ్యకి చెప్పేస్తాడు రాజు. నేను నిన్ను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు అట్లాగని నేను నిన్ను ప్రేమించట్లేదు అలాంటప్పుడు నేను నిన్ను భార్యగా ఎలా అంగీకరిస్తాను అందరి ముందు నీకు అక్షింతలు ఎలా వేస్తాను అని రాజు కావ్య మీద కోప్పడతాడు.
Krishna mukunda Murari: రేవతికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద..మురారి తోనే ముకుంద నిజం చెప్పించనుందా?

భార్యాభర్తల గొడవ..
రాజన్న మాటలకు కావ్య సంబంధం లేదని అంటున్నా సహనంతో సహజీవనం చేస్తున్న ఎందుకు అంటూ తాళిని చూపించి దీని కోసమే అని అంటుంది. మీరు నా మెడలో మూడు ముళ్ళు వేశారు కదా ఈ మూడు ముళ్ళు నన్ను కట్టిపడేస్తున్నాయి పెళ్లి పేరుతో నన్ను ఇక్కడ కట్టేశారు అని అంటుంది కావ్య. నేనేమీ నిన్ను కట్టి పడేయలేదు ఇష్టం కూడా చూపించట్లేదు కదా అంటుంది అది నా సమస్య కాదు నా జీవితానికి సంబంధించిన దాన్ని నువ్వు కోరుకుంటే నేను ఎలా ఇస్తాను. నేను ఏదీ కోరుకున్నది కాదు ఇష్టపడింది కాదు అలాంటప్పుడు నేను నిన్ను ఇష్టపడాలి అని నువ్వు అనుకోవడం కూడా ఎందుకు అని అంటాడు రాజ్. అయినా సరే మీరు ఇష్టపడకపోయినా నేను సర్దుకుపోవాలి. వివాహాన్ని గౌరవించాలి ప్రపంచంలో ఎన్నో పెళ్లిళ్లు ఇష్టం లేకుండా జరుగుతున్నాయి వాళ్ళు సర్దుకుపోయే కుటుంబాన్ని చూసుకోవడం లేదా నేను అలానే ఉంటాను మీరు అలానే ఉండాలి అని అంటుంది కావ్య. అందరూ వేరు నేను వేరు నావల్ల కాదు నేను అలా సర్దుకుపోయి ఉండలేను. కావ్య నా అభిప్రాయాలు కోరికలతో మీకు సంబంధం లేదా అని అంటుంది. నీకు ఇక్కడ ఏం తక్కువయింది అని అంటాడు రాజ్. ప్రేమ గౌరవం తక్కువయ్యాయి ఇది జీవితం కలిసి ఉండాలి కలిసే బతకాలి. రాజు నాకు ఈ ప్రయాణం వద్దు నా గమ్యం వేరే ఉంది నా గమ్యం ఇది కాదు అని అంటాడు.
Nuvvu Nenu prema: అను ని కాపాడిన ఆర్యా..మరోసారి ఫెయిల్ అయిన కృష్ణ ప్లాన్.

శాశ్వతంగా వెళ్లిపోవాలనుకున్న కావ్య..
రాజన్న మాటలకు కవి చాలా బాధపడుతుంది ప్రేమ గౌరవం తక్కువయ్యాయి మీరు నా జీవితంతో కలిసి ఉండాలి అనుకున్నాను. కానీ మీరు నా గమ్యం వేరే ఉంది అంటున్నారు అంటే ఇప్పుడు నేను మధ్యలోనే వెళ్లిపోవాలి. మీరు మారతారని అర్థం చేసుకుంటారు నీ భార్యగా అంగీకరిస్తారని ఇన్నాళ్లు ఎదురు చూశాను కానీ ఇవాల్టితో నా కళ్ళు కమ్మేసింది మాయపర తొలగిపోయింది ఇంక నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అని అంటుంది.మూడుముళ్లను కూడా కాదని కొనే సాహసం మీకు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది ఏం చేసినా మీ మనసు మారదని కూడా నాకు అర్థం అయింది మీతో కలిసి జీవితాంతం నేను ప్రయాణం చేయలేనప్పుడు మీ ప్రయాణం వేరే ఉందని మీరు అనుకుంటున్నాప్పుడు నా ప్రయాణాన్ని కూడా ఆపేయాలి అని నేను తెలుసుకున్నాను ఇక్కడతో మీకు నాకు ఉన్న సంబంధం తెంచేయాలని సాష్టాంగ మీ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను అని అంటుంది. అవన్నీ వింటూ రాజ్ చూస్తూ ఉంటాడు. వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ సీతారామయ్య కూడా వింటాడు.

ప్రాణాపాయంలో సీతారామయ్య..
సీతారామయ్య రాజు కావ్య మాటలను దూరం నుంచి వింటాడు అవి విని ఆలోచిస్తూ మెట్లు దిగుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అందరూ సీతారామయ్యకి ఏమైందో అని కంగారుపడతారు నీళ్లు తాగించి సీతారామయ్య ఏక్ మొహం మీద నీరు చల్లి లేపి నించో పెడతారు ఇప్పుడు మీకు బానే ఉంది కదా నాన్న అంటాడు సుభాష్ బానే ఉంది నా ఆరోగ్యానికి ఏం కాలేదు అంటాడు కానీ మనిషి ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం ఎందుకో మంచిదిగా అనిపించట్లేదు వెంటనే ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని కావ్య సుభాష్ తో అంటుంది. అందరూ కంగారు పడుతూ ఉంటారు. రాజ్,సుభాష్ పెద్దాయన హాస్పిటల్ తీసుకెళ్తారు.కావ్య నేను కూడా వస్తాను అంటుంది కాదని రాజు సుభాషు తీసుకుని వెళ్తారు హాస్పటల్ కి పెద్ద అయింది. హాస్పిటల్లో సుభాష్ కంగారు పడుతూ ఉంటాడు నాన్నకు ఏమవుతుందో అని ఆ రాజుతో అంటాడు రాజ్ నచ్చజెప్పి ఏమి కాదు తాతయ్యకు బానే ఉంటారు మీరు ధైర్యంగా ఉండండి నాన్న అని చెప్తాడు. డాక్టర్ గారు సీతారామయ్యకి బ్లడ్ క్లాన్సరు ఇప్పటివరకు మీకు ఈ విషయం తెలియకుండా ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు మీ తాతయ్యని కూడా ఎప్పుడైనా నీరసంగా ఉందని, అడిగాను కానీ తను నీరసంగా లేదని చెప్తున్నారు అని అంటాడు డాక్టర్. అయితే తగ్గిపోతుంది కదా డాక్టర్ అంటాడు రాజు ఆయనకి క్యాన్సర్ పైన స్టేజ్ లో ఉంది ట్రీట్మెంట్ ఉంది కానీ మేము ఇచ్చే ట్రీట్మెంట్ కి బాడీ ఎలా రెక్ట్ అవుతుందో చెప్పలేము అసలు మెడిసిన్ కి తగ్గుతుందో లేదో కూడా చెప్పలేను మీ తాతయ్య ఉన్న కండిషన్ కి మూడు నెలలు మాత్రమే బతుకుతారు మీరు దాన్ని చాలా సంతోషంగా చూసుకుంటే ఆయన ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది అని అంటాడు. మా తాతయ్యకి విషయం చెప్పద్దు ఆయన సంతోషంగా ఉండాలంటే ఏ విషయం ఇంట్లో కూడా ఎవరికి తెలియకూడదు ఇంట్లో తెలిస్తే అందరూ తన మీద జాలికం దయ చూపిస్తూ ఉంటారు ఆయన కావాల్సింది సంతోషం అందుకే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అని సుభాష్ దగ్గర మాట తీసుకుంటాడు రాజ్.
BrahmaMudi: అమ్మమ్మ గారి మాట నిలబెట్టిన కావ్య.. కావ్య మీద అపర్ణ గెలిచినట్టేనా?
ఇంట్లో వాళ్ళ కంగారు..
పెద్దాయన ఇంటికి తీసుకురాగానే డాక్టర్ గారు ఏమన్నారని ఇంట్లో అందరూ అడుగుతారు తాతయ్య ఆరోగ్యానికి ఏం కాలేదు బలానికి మందులు ఇచ్చారు అని రాజు అబద్ధం చెప్తాడు దీంట్లో అందరూ ఊపిరి పీల్చుకుంటారు కానీ సుభాష్ మాత్రం మోహన్ డల్లిగా పెట్టుకుంటాడు. కావ్య గదిలోకి రాగానే వెళ్ళిపోవాలి అని అనుకున్న ఇంకా ఉన్నావు అని అంటాడు రాజు ఈ సమయంలో వెళ్ళిపోయి పెద్దాయన మరింత టెన్షన్ పెట్టడం ఎందుకని ఆగిపోయాను అని చెప్తుంది కావ్య కానీ రాజు మాత్రం మాటలు మాట్లాడుతూనే ఉంటాడు నా నిజ స్వరూపం కనిపించిందని అన్నావు కదా, ఇంకా ఎందుకు ఉన్నావ్ ఇంట్లో అని అంటాడు. నీ పరిస్థితుల్లో ఇంటి కోడలు వెళ్ళిపోతే అందరూ ఏమనుకుంటారో అని ఆగిపోయాను కానీ ఇంకా వెళ్ళిపోలేదా అని మీరు అడిగిన తర్వాత ఇంకా ఉండి పోవాలని నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది నేను వెళ్ళిపోతాను మీరు సంతోషంగా ఉండండి అని అంటుంది కావ్య.
సీతారామయ్య కు మాట ఇచ్చిన రాజ్..
అప్పుడే రాజిని సీతారామయ్యగారి పిలుస్తారు. నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు రాజ్ డాక్టర్ నీతో మాట్లాడటం నేను విన్నాను అనగానే రాజ్ ఒకసారి గా షాక్ అవుతాడు. ఈ నిజాన్ని నువ్వు దాచి పెట్టాలనుకున్న నాకు తెలిసిపోయింది మీ నానమ్మకి నా పరిస్థితి తెలిస్తే ప్రాణాలతో ఉండదు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు కావ్య సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి నువ్వు కాపీ మెడలో తాళి కట్టావు తనని నువ్వు జీవితాంతం, సంతోషంగా చూసుకునే బాధ్యత నీ మీద ఉంది. నేను జీవితంలో ఎప్పుడూ భయపడలేదు కానీ మీ దాంపత్యాన్ని చూస్తుంటే మాత్రం భయమేస్తుంది. మీరు ఎప్పుడు విడిపోతారు అనిపిస్తుంది మీరు ఇద్దరు ఎప్పుడూ కలకల్లాడుతూ కాపురం చేసుకుంటూ ఉంటే సంతోషంగా నేను చూసి కన్నుమూయాలనుంది. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి రాజ్ కావేని ప్రేమగా చూసుకుంటానని మాట ఇవ్వు అని అంటాడు సీతారామయ్య. డాక్టర్ చెప్పిన మాటలు అన్నీ గుర్తుంచుకున్న రాజు తాతయ్య ఉన్నంతకాలం తృప్తిగా సంతోషంగా ఉండాలి. మీరు ఉన్నంతకాలం కావ్యతో సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను అని మనసులో అనుకొని మీరు చెప్పినట్లే చేస్తాను తాతయ్య అని మాట ఇస్తాడు.
రేపటి ఎపిసోడ్లో కాదు వెళ్లిపోవాలని నిర్ణయించుకునేసరికి రాజు వచ్చి ఇప్పటివరకు ఆగవు కదా మరో మూడు నెలలు ఓపిక పట్టు అని అడుగుతాడు. కృష్ణయ్య దగ్గరికి వెళ్లి తన భర్త మారడానికి మూడు నెలలు గడువు అడిగాడని మారితే తన జీవితం సంతోషంగా ఉంటుందని తాతయ్య ఉన్నంతవరకు నేను ఆయన మాట ప్రకారం కళావతిని ప్రేమగా చూసుకుంటాను నటిస్తాను అని ఇద్దరు దేవుని ముందు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు మాట్లాడతారు భర్త మనసులో స్థానం కావాలని కావ్య రాజు మాత్రం తన మనసులో ఎప్పటికీ కళావతికి స్థానం లేదు అని అనుకుంటూ ఉంటారు.