BrahmaMudi 193 ఎపిసోడ్ : నిన్నటి ఎపిసోడ్ లో సీతారామయ్య గారికి హాస్పిటల్లో డాక్టర్ చెప్పిందాని వల్ల మూడు నెలల్లో చనిపోతాడు అని అనుకొని, రాజ్ సుభాష్ దగ్గర ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పొద్దని మాట తీసుకుంటాడు. సీతారామయ్య గారు డాక్టర్ చెప్పింది అంతా నాకు తెలుసు నేను ఉన్నంతకాలం నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నువ్వు కావ్యని భార్యగా ఒప్పుకోవాలి అని మాట తీసుకుంటాడు రాజ్ దగ్గర. రాజు తాత గారికి ఇచ్చిన మాట కోసం కావ్యని భార్యగా ఒప్పుకుంటున్నట్టు నాటకం ఆడుతాడు.
ఈరోజు 193 ఎపిసోడ్ లోసీతారామయ్య రాజుతో హాల్లోకి తీసుకువెళ్ళు నన్ను అని అంటాడు. ఆ మాటకి సంతోషంతో తీసుకొస్తాడు రాజ్.వ్రతం ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు చేయండి అని అంటాడు సీతారామయ్య.

కావ్యకి ఫలితాన్ని దక్కేలా చేసిన తాతగారు.
ఉదయం నుండి వ్రతం వల్ల ఉపవాసం ఉంది పొద్దుటి నుంచి ఏమీ తినకుండా వ్రతం పనులన్నీ చేసి అలసిపోయింది కావ్య చివరిలోని అక్షింతలు వేయకుండా తనని బాధ పెట్టావు ఆ అమ్మాయి ఎంతో భక్తితో పూజ చేసింది నువ్వు ఆ ఫలితం దక్కకుండా చేశావు అది నాకు నచ్చలేదు నువ్వు అక్షింతలు వేసి కావ్య ని భోజనం చేయమని చెప్పు అని అంటాడు సీతారామయ్య. ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను తాతయ్య అని గదిలోనికి వస్తాడు.కావ్య తన బట్టలు మొత్తం సర్దుకుని ఉండడం చూస్తాడు రాజ్. రాజ్ ఎదురుపడి ఎక్కడికి అని అడుగుతాడు కావ్య ని నేను బయలుదేరాల్సిన చోటికి వెళ్తున్నాను అని అంటుంది. మీ ప్రయాణం కొనసాగించండి నా గమ్యము మీ గమ్యం వేరు వేరు అని నిన్ననే కదా చెప్పారు అలా చెప్పినప్పుడు నేను వెళ్ళిపోవాలి కదా ఇంకా వెళ్ళలేదు అని ఎందుకు ఉన్నానని అడుగుతారు అంతే కదా వీడ్కోలు చెప్పి వెళ్ళడం కరెక్ట్ కదా అందుకే చివరిసారిగా, మీకు ఒక మాట చెప్పే వెళ్దామని ఆగాను ఇప్పుడు మీరు వచ్చారు కదా ఇక సెలవు అని అంటుంది. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు రాజ్ నా అభిప్రాయం మార్చుకున్నాను నువ్వు ఉండొచ్చు అని అంటాడు రాజ్. ఎందుకు ఉండమంటున్నారు ఇంట్లో ఒక వస్తువుల ఉండమంటారా నన్ను అంటుంది కావ్య ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా ఇంకోది రోజులు ఎదురు చూడు అంటాడు రాజ్ మార్పు కోసమా ఓదార్పు కోసమా అంటుంది కావ్య నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టి చూడు అంటాడు రాజ్. మూడు నెలల్లో ఏం జరుగుతుంది? మూడు నెలల్లో మీరు మారిపోతారా నన్ను భార్యగా స్వీకరిస్తారా మీ అమ్మగారు నన్ను కోడలికి అంగీకరిస్తారా అని అంటుంది కావ్య. నువ్వు అడిగిన వాటికి మూడు నెలల్లో సమాధానాలు అన్నిటికి దొరుకుతాయి అంటాడు.ఈ అస్పష్టమైన కాపురం చేసేది నావల్ల కాదు అంటుంది కావ్య. నాలో ఎందుకు లేనిపోని ఆశలు కల్పిస్తారు నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా అంటుంది.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

కావ్య ఆనందం.
నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మట్లేదు కదా, ఇప్పుడు నీకు నమ్మకం కలగాలి అంతే కదా అని తన చెయ్యి పట్టుకుని కిందకి తీసుకొస్తాడు అది చూసి అపర్ణ షాక్ అవుతుంది. రాజ్ చేతికి ఇందిరా దేవి అక్షింతలు ఇచ్చి కావ్య ని ఆశీర్వదించమని చెప్తుంది.రుద్రాణి స్వప్న ఇద్దరు కుళ్ళుకుంటూ ఉంటారు.రాజు కావ్య తల మీద అక్షింతలు వేసి దీవిస్తాడు చాలా సంతోషపడుతుంది కావ్య వ్రతం అసంపూర్తిగా ముగిసింది అని అనుకున్నాను కానీ ఆశీర్వాదం దక్కిందని చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటుంది కావ్య. కావ్య రాజీ ఇద్దరు సీతారామయ్య గారి దంపతులకు ఆశీర్వాదం తీసుకుంటారు రాజ్ దంపతులను కలకాలం దీవించాలి అని పెద్ద వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు మిమ్మల్ని విడదీయాలని చూస్తున్న వారికి భంగపాటు ఎప్పుడు కలుగుతుంది అని అంటాడు సీతారామయ్య. అదంతా విని అపర్ణ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది.
Nuvvu nenu prema: అనుని అవమానించిన కుచల.. కృష్ణ తన పథకంతో వ్రతాన్ని ఆపగలిగాడా?

అపర్ణని రెచ్చగొట్టిన రుద్రాణి..
రాజు కావ్య చేతిని పట్టుకొని తీసుకురావడం గురించి అపర్ణ ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటే ఇదే కరెక్ట్ టైం అనుకోని రుద్రాణి అక్కడికి వచ్చి లేనిపోనివన్నీ కావ్య, రాజ్ మీద అపర్ణకు చెప్పడం మొదలుపెడుతుంది. అయినా భార్యని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఇక భార్యని తిని అక్షింతలు వేయమంటే వేయకుండా బెట్టు చేసిన రాజు తర్వాత తన చేతిని పట్టుకొని మరీ కిందకు తీసుకొచ్చి అందరి ముందు భార్యగా ఒప్పుకొని అక్షింతలు వేసి తనకు రావాల్సిన ఫలితాన్ని తనకు ఇచ్చేశాడు. నీ కోడలు ఏం సామాన్యురాలు కాదు అందరినీ ఒక ఆట ఆడిస్తుంది అట్లాంటిది రాజ్యం మాత్రం ఎందుకు ఊరుకుంటుంది రాజు తన భార్య చెప్పినట్లు వింటున్నాడు. ఏం మాయ చేసిందో ఏంటో అని అంటుంది రుద్రాణి. భార్య ఏడుస్తుందని అమ్మ తిట్టిందని రాజు మనసు మార్చుకుని రకం కాదు అని అంటుంది అపర్ణ. నా ముందు ఒప్పుకోకపోయినా తర్వాత నిదానంగా ఆలోచించు వదిన నీకే అర్థమవుతుంది నీ కొడుకు ఏం చేశాడో ఎలా ప్రవర్తిస్తున్నాడోఅని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి.

కృష్ణుడి దగ్గర తన బాధనిచెప్పుకున్న కావ్య..
కావ్య కృష్ణుడి దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకుంటుంది. నా భర్త మారడానికి సమయం అడిగాడు మారితే బతుకంతా మారుతుంది అనుకుంటున్నాను నా భవిష్యత్తు అంతా వెలిగిపోతుంది అనుకుంటున్నాను కానీ ఒకపక్క నాకు నమ్మకం లేదు నిజంగా మార్పు జరుగుతుందంటావా నాకు ఆపరా నిలబడుతుందంటావా కృష్ణయ్య అని దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. కాసేపటి వరకు వెళ్లిపోవాలి అని అనుకున్నాను ఇది నీ లీల అయ్యి ఉంటుంది నా భర్త మారడానికి సమయం అడుగుతున్నాడు అంటే నేను మార్పు కోసం సమయం ఇచ్చాను గెలిస్తే సంసారం ఓడితే ఒంటరితనం నాకు నా భర్తకి మధ్య జరిగే ఈ ఉద్దంలో నాకు నా భర్త మనసులో స్థానం కావాలి నాకు ఆపురం నా భర్త చేతిలో ఉంది నిన్నే నమ్ముకున్నాను కృష్ణ నువ్వే నాకు ఒక దారి చూపించాలి ఈ మూడు నెలల సమయాన్ని నాకు అనుకూలంగా ఉండేలాగా నువ్వే చూడాలి అని అనుకుంటుంది కావ్య.
Nuvvu nenu prema: అనుని అవమానించిన కుచల.. కృష్ణ తన పథకంతో వ్రతాన్ని ఆపగలిగాడా?

రాజ్ కృష్ణుడి దగ్గరతన మనసులో మాట చెప్పడం.
రాజు కూడా కృష్ణుడి విగ్రహం దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు. ఈ కళావతి నటన అంతా ప్రదర్శిస్తుంది నీ దగ్గర కృష్ణ అన్ని నువ్వు ఇవ్వకు ఆమె అడిగింది కదా అని నువ్వు అని ఇవ్వకు నేను ఇరకాటంలో పెడతాను ఇందులో నా తప్పేం లేదు తాతయ్య ప్రాణాల కోసం లౌక్యంగా ప్రవర్తిస్తున్నాను. నువ్వు నేర్పిన విద్య అని మార్పు కోసం మూడు నెలలు అడిగాను ఎందుకు అడిగాను నీకు తెలుసు కృష్ణ తాతయ్య ఉన్నంతవరకు నేను ఆయన్ని సంతోషంగా చూసుకోవాలి ఆయనకు ఒక మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం నేను కావ్యతో ప్రేమగా ఉంటున్నట్టు నటించాలి. ఈ కళావతి మనసులో ప్రేమఅసలు రెప మాకు ఆ తర్వాత నిజం తెలిస్తే చాలా కష్టమవుతుంది మాకు ఆ ప్రేమ ఒక కల అది ఎప్పటికీ నిజం కాదు కాకూడదు నా మనసులో ఈ కళావతికి ఎప్పటికి స్థానం సంపాదించుకోలేదు. నేనెప్పటికీ కళావతిని భారీగా అంగీకరించను. అన్ని నువ్వే చూసుకోవాలి కృష్ణ అని రాజ్ అంటాడు.
రేపటి ఎపిసోడ్లో రాజు ఆఫీస్ కి వెళ్తూ కావ్యని క్యరేజ్ రెడీ అయిందా అని అడుగుతాడు ఆఫీస్ కి వెళ్తూ వెళ్ళొస్తానని చెప్పి మరీ వెళ్తాడు కొడుకు ప్రవర్తన చూసి అపర్ణ షాక్ అవుతుంది రాజ్ ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది.