Brahmamudi అక్టోబర్ 6 ఎపిసోడ్ 220: నిన్నటి ఎపిసోడ్ లో, ప్రస్తుతం దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో అందరూ ఆటపాటలతో మునిగిపోతూ ఉంటారు. కళ్యాణం అనామిక మధ్య అప్పు వస్తుందని, అనామిక వాళ్ళ అమ్మకు అనుమానం వస్తుంది.
ఈరోజు 220 వ ఎపిసోడ్ లో కృష్ణమూర్తికి డాక్యుమెంట్స్ ఇవ్వమని కావ్య రాజ్ కు చెబుతుంది. కావ్య మాటలకు కృష్ణమూర్తి ఆనందంలో ఉంటాడు రాజ్ బలవంతంగా అందరి ముందు నటిస్తూ కావ్య ఇచ్చిన డాక్యుమెంట్స్ ని వాళ్ల నాన్నకు ఇస్తాడు. కనకం చాలా ఎమోషనల్ అవుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదేంటంటే మీరు ఎమోషనల్ ఏ సమయం కాదు ఇది రెండు ఎంజాయ్ చేద్దాం మీ ఇల్లు మీకు వచ్చేసింది ఇక అంతా హ్యాపీసే అంటాడు కళ్యాణ్.

యాంకర్ గా మారిన కళ్యాణ్..
ఇక కళ్యాణ్ స్టేజ్ మీద నించొని ఇప్పుడు నేను అందర్నీ పిలుస్తూ ఉంటాను ఒక్కొక్కళ్ళు వచ్చి ఇక్కడ డాన్స్ వేయండి అని కళ్యాణ్ చెబుతాడు. కళ్యాణి యాంకర్ గా మారి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడు అందరూ వచ్చి డాన్స్ వేస్తూ ఉంటారు. కృష్ణమూర్తి కనకం చేత కూడా కళ్యాణ్ డాన్స్ వేయిస్తాడు. ఆ తర్వాత బామ్మ గారు తాతగారు సీతారామమూర్తి గారి చేత కూడా డాన్స్ వేయిస్తాడు కళ్యాణ్. రుద్రాణి కూడా డాన్స్ వేసి అలరిస్తుంది. ఇక కళ్యాణ్ను డాన్స్ వేద్దామని అనుకునేసరికి అప్పుతో కలిసి చేయాలనుకుంటాడు అప్పుడే అనామిక వాళ్ళ అమ్మకు అనుమానం వస్తుంది ఏంటి ప్రతిసారి అల్లుడుగారు అప్పు అని పిలుస్తున్నాడు ఈ అప్పుగాలు ఏమిటి నువ్వు వెళ్ళు అని అంటుంది అనామిక వాళ్ళ అమ్మ. ఇక వెంటనే అనామిక కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నేను వేస్తాను మీతో పాటు డాన్స్ అని అప్పు వైపు చూసి బ్రో మా ఇద్దరికీ పెళ్లి జరగబోతుంది కదా మేమిద్దరం వేస్తాము అని అంటుంది అపు సరే అంటుంది అనామిక స్టేజ్ పైకి ఎక్కి కళ్యాణ్తో డాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుని కూడా పిలుస్తాడు కళ్యాణ్ రా ముగ్గురం వేద్దాము అని అంటాడు. అక్కర్లేదు మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది మీరు వేయండి అని అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి చేసేదేం లేక అనా మీతో డాన్స్ వేస్తాడు. ఇక కళ్యాణ్ రాజ్ కావ్యాలను కూడా డాన్స్ వేయమని చెప్తారు ఇద్దరు నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పాటకి డాన్స్ వేస్తూ ఉంటారు ఇదే క్రమంలో రాజ్ కావ్యతో క్లోజ్ గా మూవ్ అవ్వడం చూస్తూ కుళ్ళుకుంటుందిఅపర్ణాదేవి.ఇంకా అత్తగారి కడుపు మంట పెంచడానికి కావ్య అనుకోకుండా రాజ్ కిముద్దు పెట్టేస్తుంది అందరి ముందు,అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అపర్ణ మాత్రం చాలా కుళ్ళుకుంటుంది. ఇక కృష్ణమూర్తి కనకం అయితే ఆనందంలో మునిగిపోతారు తన కూతురు ఎంత సంతోషంగా అల్లుడితో ఉంటుంది అని, రాజ్ కావ్య కూడా ఇద్దరు షాక్ అవుతారు అనుకోకుండా అలా జరిగినందుకు.

కడుపు ప్యాడ్ బయటపడడం..
ఇక అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు సంతోషంగా, తర్వాత ముగ్గురు జంటలు, రాజ్ కావ్య రాహుల్ అలాగే కళ్యాణ్ అనామిక అందరూ కలిసి డాన్స్ వేస్తూ ఉంటారు స్వప్న కూడా తను కడుపుతో ఉన్న విషయం మర్చిపోయా అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే స్వప్న కడుపు కోసం పెట్టుకున్న ప్యాడ్ కాస్త కింద పడుతుంది అది గమనించుకోకుండా స్వప్న డాన్స్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న కావ్య స్వప్న పాడ్ కింద పడడం చూస్తుంది అది ఎవరు గమనించకుండా ఉండాలని కావ్య కంగారుపడుతూ ఉంటుంది వెంటనే ఆ పాడ్ ని తీసుకొని, స్వప్నని అక్కడ నుంచి తీసుకొని వెళుతుంది. ఎందుకు బలవంతంగా గదిలోకి తీసుకొచ్చావని స్వప్న కావ్య మీద అరుస్తుంది.

నాటకం ముగించాలనుకున్న స్వప్న..
వెంటనే కావ్య స్వప్నకు తన కడుపు ప్యాడ్ ని చూపిస్తుంది. ఇదేంటి అక్క అని అడుగుతుంది స్వప్న షాక్ అవుతుంది. ఇలా ఎంతకాలం మోసం చేద్దామనుకుంటున్నావు ఇది ఎవరికీ కనిపించకుండా ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు ఇవాళ కాతే రేపైనా ఈ నిజం బయటపడక తప్పదు కదా అని అంటుంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేనువేరేవాళ్లు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో లేను అని అంటుంది కావ్య తో స్వప్న, ఇలా ఎంత కాలం అక్క అని అంటుంది కావ్య, అదంతా తర్వాత నువ్వు ఇలా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చెయ్యి అని అంటుంది స్వప్న అంటే నీ మాసంలో నన్ను కూడా భాగం పంచుకోమంటావా అంటుంది కావ్య ఇప్పుడేంటి నా పెళ్ళెప్పుడే నిజం చెప్పకుండా నాకు హెల్ప్ లో భాగమయ్యావు కదా అని అంటుంది కావ్య తో, అవునా నువ్వు అలా ఆలోచిస్తున్నావా అయితే నీ మోసంలో భాగం నేను పంచుకొని ఇప్పుడే ఇంట్లో అందరికీ నిజం చెప్తాను అంటుంది కావ్య దీంతో కావ్య స్వప్న ఆపి నీ చెల్లి కాపురం ఏమైనా పర్వాలేదా నీకు బంధాలు బంధుత్వాలు ఏమీ అవసరం లేదా అని మాట్లాడుతుంది. ఇప్పటిదాకా బానే బెదిరించావు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావ్ అంటుంది కావ్య స్వప్నతో కానీ నాకు కాస్త టైం ఇవ్వు అని స్వప్న బతిమిలాడుకుంటుంది. అమ్మానాన్నల పరువు తీయొద్దు అని కావ్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళిపోయిన తర్వాత స్వప్న ఇది అమ్మా నాన్న కోసమైనా ఇంట్లో ఎవరికీ నిజం చెప్పదు కానీ ఇలా ఎంత కాలం నేను ఈ నాటకాన్ని కొనసాగించలేను ఏదో ఒకటి చేసి అబార్షన్ అయింది అన్నట్లుగా అందరినీ నమ్మించి ఈ కడుపు పోయేటట్టు చేస్తే రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటుంది.

అప్పు బాధ..
ఇక అందరూ భోజనాలు పెడుతూ ఉంటారు అందరూ వచ్చి కూర్చుంటారు. అపర్ణాదేవి ఇస్తర్లు వేసి అందరినీ కూర్చోమని చెప్తుంది. స్వప్న రూమ్ లోనే అంతా ఫిక్స్ చేసుకొని ఎలాగైనా అబార్షన్ నాటకం ఆడాలని డిసైడ్ అయ్యి ఏదో ప్లాన్ మీదే భోజనానికి కూర్చోవాలి అని వస్తుంది. నాక్కూడా విస్తరి ఇయ్యండి అత్తయ్య నేను కూర్చుంటాను అని అంటుంది అపర్ణాదేవితో అపర్ణాదేవి టేబుల్ మీద ఇస్తరి వేస్తుంది. అప్పు కోసం కనకంను కావ్య అడుగుతుంది అప్పు ఏంటమ్మా కనిపించట్లేదని అప్పటికే అప్పు అనామికతో కళ్యాణ్ క్లోజ్ గా ఉండడం చూసి భరించలేక ఏదో ఆలోచిస్తూ బయటికి వెళ్లిపోతుంది. ఇందాకట్నుంచి అప్పు కనిపించట్లేదని కనుక మంటుంది సరే నేను వెళ్లి చూసి వస్తాను అని కావ్య వెళ్తుంది.

రేపటి ఎపిసోడ్లో రాజ్ రాసిన చీటీని చూసి కావ్య తెగ ఏడుస్తుంది బయటికి వచ్చి ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అలా బాధలు కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోడ్డుమీద నడుచుకుంటూ ఒక్కతే వెళ్తూ ఉంటుంది. అంతా ఇంటికి వెళ్లి పోతారు. ఎవరిలకి వాళ్లు వెళ్లిన తర్వాత రాజ్ ఏంటి ఈ కళావతి ఎటు వెళ్లిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక హాల్లోకి వచ్చి రాజ్ ఇంట్లో అందరితో కావ్య కనిపించట్లేదు అని చెప్తాడు. తను ఎక్కడికో వెళ్లిపోయింది అని ఇంట్లో అందరూ కంగారుగావెతకడం మొదలు పెడతారు..