Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుంది. ప్రతీ ఎపిసోడ్ లో తర్వాత ఏమి జరగబోతుంది అనే ఆత్రుతని ఆడియన్స్ లో కలిపించడం లో సక్సెస్ అయ్యింది ఈ సీరియల్. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Brahmamudi may31st Episode: గర్భం దాల్చిన స్వప్న..రాహుల్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించిన కావ్య
రాహుల్ నిజస్వరూపం కళ్లారా చూసి బోరుమని ఏడ్చినా స్వప్న :
రాహుల్ నిశ్చితార్థం జరుగుతున్న సమయం లో స్వప్న ని తీసుకొని వస్తారు అప్పు మరియు కళ్యాణ్. చూసావా మీ రాహుల్ ఎంత మోసగాడో, కావ్య అక్క ఎంత చెప్పిన నువ్వు నమ్మలేదు అంటూ రాహుల్ నిజస్వరూపాన్ని చూపిస్తారు స్వప్నకు. అప్పుడు స్వప్న ఏడుస్తూ బయటకెళ్ళి కూర్చుంటుంది. రాహుల్ తనని మోసం చేసిన తీరుని తల్చుకుంటూ బాధపడుతుంది. అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది. నువ్వేం తప్పు చేసావ్ అక్కడ, వాడి నిజస్వరూపం చూసావ్ కదా , ఇక అమ్మ నాన్న చూపించిన సంబంధాన్ని చేసుకో అని చెప్తుంది. అప్పుడు అప్పు ఆ సంబంధం క్యాన్సిల్ అయ్యింది. ఇది ఇప్పుడు గర్భవతి అని చెప్తుంది . అప్పుడు కావ్య ఎందుకు తొందరపడ్డావ్, అమ్మానాన్నలను తల ఎత్తుకోనివ్వకుండా చేసావ్ కదా, ఇప్పుడు నిన్ను రాహుల్ కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు అని చెప్పి స్వప్న ని లోపలకు తీసుకెళ్తుంది కావ్య.

Nuvvu Nenu Prema: అను పెళ్లి ఆపడానికి కృష్ణ ప్లాన్ ఫలించనుందా… పద్మావతి మనసులో మాట చెప్పినట్టేనా…
రాహుల్ నిజస్వరూపం బయటపెట్టిన స్వప్న :
స్వప్న ని చూడగానే రాహుల్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, అప్పుడు కావ్య ముందుకు వచ్చి చేసేసుకో రాహుల్ , కానీ చేసుకునే ముందు మా అక్కకి తొడిగిన ఈ ఉంగరాన్ని తీసేసి చేసుకో అని అంటుంది. రాహుల్ తొడిగిన ఉంగరం మన ఇంటికి సంబంధించినదే అనే విషయాన్నీ గుర్తిస్తాడు రాజ్. ఆ ఉంగరం ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అవుతారు. అప్పుడు కావ్య నా తప్పు ఏమి లేదని చెప్తూనే ఉన్నాను కదా, ఆ రోజు ఏమి జరిగిందో చెప్పు అక్కా అనగా, స్వప్న రాజ్ కి క్షమాపణలు చెప్పి, నేను పెళ్లి మండపం నుండి పారిపోలేదు, ఈ రాహుల్ నన్ను లేవదీసుకొని వచ్చాడు. నీ నెంబర్ అడిగితె తన నెంబర్ ఇచ్చి , నీకంటే తను నాకు బెస్ట్ ఛాయస్ అని నమ్మించి, నన్ను ప్రేమలో దించాడు, ఆ తర్వాత నన్ను పెళ్లి రోజు లేపుకుని వెళ్లి, ఒక హోటల్ రూమ్ లో ఉంచాడు, ఇక ఆ తర్వాత నేను రెండు రోజుల పాటు గుడిలో ఉంది తర్వాత ఇంటికి వెళ్ళాను అని జరిగిన విషయాలన్నీ చెప్తుంది స్వప్న.

Krishna Mukunda Murari: కృష్ణ నుండి నిజం రాబట్టాలని చూసిన ముకుంద.. కృష్ణ ఒంటరిగా మిగిలిపొనుందా..
సాక్ష్యాలతో రాహుల్ ని అడ్డంగా బుక్ చేసిన కావ్య:
ఇదంతా విన్న తర్వాత అరుంధతి మరియు వెన్నెల రాహుల్ ని నిలదీస్తారు. వీళ్ళు కావాలని నన్ను ఇరికించడానికి మోసం చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తాడు. ఒక ఆడపిల్లకు ఇంత మంది మధ్య ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి అని వెన్నెల నిలదీస్తుంది. అప్పుడు బిక్క మొహం పెడుతాడు రాహుల్. ఆ తర్వాత వీళ్ళు అన్నీ ఆరోపణలే చేస్తున్నారు, దీనికి ఒక్క దానికి కూడా రుజువు అనేదే ఉండదు అని మళ్ళీ రెచ్చిపోతాడు రాహుల్. నువ్వు ఇలా అంటావు అని తెలిసే నేను రుజువు తో వచ్చాను అని చెప్పి సీసీటీవీ కెమెరా ఫుటేజీ ని చూపిస్తుంది కావ్య. రాహుల్ నిజస్వరూపం చూసి రాజ్ , అపర్ణ తో సహా అందరూ ఆశ్చర్యపోతారు. చివరకు రాహుల్ తల్లి రుద్రాణి కూడా ఆ నిజస్వరూపం చూసి కోపం తో కన్నీళ్లు పెడుతుంది. రాజ్ కూడా నమ్మి రాహుల్ ఇంకా తనని సమర్దిమ్చుకోవాలని చూడగా , రాహుల్ చెంప పగలగొడుతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది, రేపటి ఎపిసోడ్ లో రాహుల్ స్వప్న కి పెళ్లి చెయ్యడానికి చర్చ నడుస్తుంది. రుద్రాణి నేను ఒప్పుకోను అని చెప్పగా, ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్ వెళ్తాను అని బెదిరిస్తోంది కావ్య, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.