Brahmamudi: రాజ్ కావ్యని తీసుకొని తన పుట్టింటికి వెళ్తాడు. నేను పుట్టి పెరిగిన ఈ ఇంటికి ఏమైనా అంటే నేను ఈ ఇంట్లోకి రాను అని కావ్య అంటుంది అందులోకి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని రాజ్ పెద్దగా అరుస్తాడు. దాంతో కనకం ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అల్లుడుగారు లోపలికి రండి పిలుస్తుంది. ఇక వాళ్ల అత్తయ్య చుట్టుపక్కల వాళ్ళ అందరినీ పిలిచి మా అల్లుడు మా ఇంటికి వచ్చాడు అని ఘనంగా అందరికీ చెబుతుంది. ఇక వచ్చిన వాళ్ళందరూ కావ్య పెళ్లైన మూడు రోజుల్లోనే ఆరడుగుల భర్తని తన కొంగు తో ముడేసింది అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు.

రాజ్ కావ్యను తో కలిసి లోపలికి వస్తుండగా.. కనకం రాజ్ కి హారతి ఇస్తుంది. ఇప్పటికైనా ఇంట్లోకి రావచ్చా అని రాజ్ అనగానే.. లేదు లేదు అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తూ ఉండగా ముందు మీ అమ్మాయిని చెప్పండి అని రాజ్ అంటాడు.
అప్పటికే కోపం వచ్చినా రాజ్ ఇప్పటికైనా ఇంట్లోకి రమ్మంటారా అని కోపంగా కనకం వైపు చూసి అడుగుతాడు. ఇక వెంటనే కనకం రమ్మని అంటుంది. కావ్య వాళ్ళ నాన్నని చూడగానే ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంటుంది. ఆయన కూడా వెంటనే కావ్యను దగ్గర తీసుకొని హత్తుకుంటాడు. మళ్లీ నిన్ను ఎప్పుడు చూస్తానో ఏమో అనుకున్నాను నా బంగారు తల్లి నా దగ్గరికి వచ్చేసింది అంటూ కావ్య వాళ్ళ నాన్న కూడా ఎమోషనల్ అవుతాడు. ఇక అప్పు, కనకం కూడా ఎమోషనల్ అవుతారు దాంతో రాజ్ గొంతు సవరించుకోగానే అల్లుడు ఇంకా నిలబడే ఉన్నారు కూర్చోమని చెప్పండి అని కూర్చోబెడతారు. ఇక రాజ్ కూర్చున్న కూర్చి ఊగడంతో వెంటనే లేచి నిలబడతాడు.

ఈ కుర్చీ ఎప్పటిదో అల్లుడుగారు అని కనకం ఉంటుంది. మీ ఇల్లు చూపించరా అని రాజ్ అడుగుతాడు మాది చాలా చిన్న ఇల్లు. మీ ఇంట్లో స్టోర్ రూమ్ అంతా మా ఇల్లు ఉంటుంది అని కనుక ఉంటుంది అల్లుడు గారిని గదిలోకి తీసుకెళ్ళమని చెబుతారు. కావ్య గదిలోకి తీసుకు వెళ్తూ ఉండగా వాళ్ల పెద్దమ్మ కనిపించి రాజ్ కి నమస్తే చెబుతుంది. ఇక రాజ్ గదిలోకి వెళ్ళగానే ఆ రూమ్లో ఉన్న పరుపు చూసి ఆశ్చర్యపోతాడు అసలు ఏది పరుపు అని ఎవరైనా అంటారా అంటూ కావ్య పై విరుచుకుపడతాడు కనీసం ఫ్యాన్ అయినా వేయమని అడుగుతాడు ఆ ఫ్యాన్ గిరగిరమని తిరుగుతూ సౌండ్ రావడంతో నన్ను అండమాన్ నికోబార్ జైలు లోకి తీసుకువచ్చి పడేసినట్టు ఉంది అని మనసులో అనుకుంటాడు.
Brahmamudi: అత్తింటికి వెళ్ళిన రాజ్.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న అపర్ణ..

కావ్య బయటకు వెళ్ళగానే ఎలాగైనా ఇక్కడ స్వప్నకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని స్వప్న తన కోసం ఇంకా ఎదురు చూస్తుందని కావ్య అనవసరంగా తన జీవితంలోకి వచ్చిందని సాక్షాధారాలతో నిరూపించాలని వాటికోసం వెతుకుతూ ఉంటాడు. రాజ్ ఇక రేపటి ఎపిసోడ్లో మీరు అనుకున్నవే మీ జరగవు ఎందుకంటే మా అక్క స్వప్న ఎక్కడ లేదు అని కరాకండిగా చెబుతుంది కావ్య. నువ్వు ఎంత వెతికినా మా అక్క దొరకదని స్వరాజ్ కి వార్నింగ్ ఇస్తుంది. కావ్య ఇక రాజ్ ఇల్లంతా వెతుకుతూ ఉండగా స్వప్న ఆ వైపుగా రావడం చూస్తాడా చూడడా అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.