Brahmamudi Serial జూన్ 10th 119 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం ఉన్న టీవీ సీరియల్స్ అన్నిట్లో టాప్ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ఇప్పటి వరకు 118 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని నేటితో 119 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఒకసారి చూద్దాము.

పెళ్ళికి ముస్తాబైన స్వప్న :
కనకం తన కుటుంబం తో కలిసి స్వప్న ని తీసుకొని పెళ్ళికి బయలుదేరుతారు. స్వప్న కనకం అక్క నగలను ధరిస్తుంది. ఆ నగలు నువ్వు ఎందుకు వేసుకున్నావ్ అని అడగగా, పెళ్ళికి ఒక్క నగ కూడా లేదు , అందుకే వేసుకున్నాను అని అంటుంది స్వప్న. ఇక దుగ్గిరాల ఇంటి కి చేరగానే మీడియా స్వప్న ముందుకు వచ్చి ప్రశ్నలు అడగాలని చూస్తుంది. స్వప్న ఆత్రంగా మీడియా తో మాట్లాడబోతుండగా కావ్య వచ్చి తీసుకెళ్తుంది. ఎందుకు నీకు అంత కుళ్ళు,నాకు మంచి ఫేమ్ వస్తుంది అని భయమా అని అనగా,అప్పుడు కావ్య వాళ్ళు నిన్ను మాటల్లో పెట్టి నీ గర్భం గురించి అడుగుతారు. ఇంటి పరువు మొత్తం పోతుంది అని అంటుంది కావ్య.

Krishna Mukunda Murari : కృష్ణ పెళ్లి గురించిల నిలదీసిన రేవతి.. ముకుంద విషయంలో కృష్ణ అనుమానం…
స్వప్న కి దిష్టి తీసి లోపలకు ఆహ్వానించిన రుద్రాణి:
ఇక లోపలకు అడుగుపెట్టే ముందు అమ్మమ్మ స్వప్న కుటుంబాన్ని గుమ్మం దగ్గరే ఆపి, లాగండి దిష్టి తీస్తాము అని అంటుంది. అప్పుడు అపర్ణ రుద్రాణి ని వెళ్లి దిష్టి తీసి లోపలకు పిలువు అంటుంది. నువ్వే కదా అప్పట్లో కావ్య ని రాజ్ పెళ్లి చేసుకున్నప్పుడు నా చేత దిష్టి తీయించి లోపలకు పంపావు కదా, ఇప్పుడు నువ్వు కూడా వెళ్లి ఆ పని చెయ్ అంటుంది. అలా వాళ్లిద్దరూ వాదించుకుంటూ ఉండగా, అమ్మమ్మ వచ్చి ఏమిటి ఇంత సేపు?, మీకు వాళ్ళ కుటుంబాన్ని గుమ్మం వద్దే ఉంచడం బాగా అలవాటు అయిపోయింది అంటుంది. ఇక రుద్రాణి కి వేరే గత్యంతరం లేక స్వప్న కుటుంబానికి దిష్టి తీసి లోపలకు పిలుస్తుంది.మరో పక్క రాహుల్ ఏర్పాటు చేసిన కిడ్నాపర్ స్వప్న ని చూసి మురిసిపోతూ ఉంటాడు. రాహుల్ ఆ కిడ్నాపర్ ఉత్సాహం ని గమనించి, ఆమ్మో వీడి ఉత్సాహం చూస్తుంటే స్వప్న ని బ్రతకనిచ్చేలా లేదు , ఏదైతే మనకి ఎందుకులే స్వప్న దరిద్రం ఈరోజుతో పోతుంది అని మనసులో అనుకుంటాడు రాహుల్.

స్వప్న ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు :
ఇక కనకం స్వప్న తో కలిసి రూమ్ లోకి వచ్చిన తర్వాత కావ్య పెళ్లి చీరలు తెచ్చి ఉన్నాము, ఒకసారి చూద్దాం రా అమ్మా అని అంటుంది. సరే పదా అని వెళ్తుండగా, స్వప్న మాట్లాడుతూ ‘నేను అవసరం లేదా’ అని అంటుంది. నీ మొగుడిని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు కదా, కనీసం ఇదైనా పెద్దోళ్ళకు వదిలేయ్ అని అంటుంది కనకం. నేను పేరుకే పెళ్లి కూతురుని, పెత్తనం మొత్తం దీనిదే అని కావ్య ని అంటుంది స్వప్న. అప్పుడు కనకం నువ్వు పేరుకే మనిషివి, కానీ దృష్టిలో కాదు.

కావ్య సాక్ష్యాలను సంపాదించకపోయ్యుంటే గుడి మెట్ల మీద అడుక్కోవడానికి కూడా పనికి రావు నువ్వు , ఇంకోసారి కావ్యాన్ని పలెత్తి ఒక్క మాట అన్నావంటే నీ పళ్ళు రాల్లగొడుతాను జాగ్రత్త అని అంటుంది కనకం. ఆ తర్వాత స్వప్న ఛీ ఛీ ఈ మనుషులతో ఇక నాకేంటి సంబంధం, నేను ఈ ఇంటి కోడల్ని అయ్యాక డబ్బులు కోసం వస్తారు గా, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి అని మనసులో అనుకుంటుంది. ఇక స్వప్న ముస్తాబు అవుతున్న సమయం లో కిడ్నాపర్ లోపాలకి ప్రవేశిస్తాడు. స్వప్న కి ఇంజక్షన్ వేసి కిడ్నాప్ చెయ్యాలని చాటుగా వస్తుంటాడు.

అప్పుడు కనకం వాళ్ళ అక్క బాత్రూం నుండి బయటకి వచ్చి కిడ్నాపర్ ని చూస్తుంది. ఎవర్రా నువ్వు అని అడగగా, బేరర్ అని చెప్తాడు కిడ్నాపర్, అలా కాసేపు ఆడితో మాటల్లో పడుతుంది కనకం వాళ్ళ అక్క, ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమో లో కిడ్నాపర్ స్వప్న ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు, ఇక పెళ్లి మండపం వద్ద కావ్య మరియు కనకం స్వప్న కోసం వెతుకుతూ ఉంటారు, తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే.