Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రతి రోజు రాత్రి 7:30 నిమిషాలకు ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా నడుస్తుంది. కావ్య 16 రోజుల పండుగ ప్రారంభం అవుతుంది, ఆమె తల్లి తో పాటుగా బంధుమిత్రులు అందరూ కూడా ఈ పండుగకి హజారవుతారు, మరో పక్క స్వప్న రాహుల్ తో రొమాంటిక్ డేట్ చెయ్యడానికి అతనిని కలవడానికి ఇంటి నుండి బయటకి ఆటో లో బయలుదేరుతుంది. మరో పక్క రాహుల్ కూడా కార్ లో బయలుదేరుతాడు. వీళ్ళ సంభాషణ ని మొదటి నుండి వింటూ వచ్చిన అప్పు తన మిత్రుడు కళ్యాణ్ కి ఫోన్ చేసి ఇదంతా చెప్తుంది. వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ఆలోచనలో అప్పు స్వప్న ని ఫాలో అవుతుంది, కళ్యాణ్ రాహుల్ ని ఫాలో అవుతారు. మరోపక్క రాజ్ కావ్య కి 16 రోజుల పండుగ సందర్భంగా మేడలో వేసిన పసుపు తాడు తీసేసి, బంగారం చైన్ ని సాంప్రదాయ పద్దతిలో తొడుగుతాడు.

Brahmamudi: అప్పు ప్లాన్ వర్కౌట్ అయిందా.? స్వప్న, రాహుల్ అడ్డంగా దొరికిపోయారా.!?
ఇక ఇక్కడ మొత్తానికి రాహుల్ మరియు స్వప్న కలుసుకుంటారు, వీళ్ళు కలుసుకోవడం అప్పు మరియు కళ్యాణ్ చూస్తారు. స్వప్న రాహుల్ ని చూడగానే హాగ్ చేసుకోవడం చూసి అప్పు ఫైర్ అయిపోతుంది. వీళ్లిద్దరు పబ్లిక్ గా ఎలా బరితెగించారో చూడు, మీ అన్నయ్య కి వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అని కళ్యాణ్ కి చెప్తుంది అప్పు. అప్పుడు కళ్యాణ్ అక్కడ 16 రోజుల పండుగ జరుగుతుంటే అన్నయ్య ని రమ్మని ఎలా చెప్తాను అని అంటాడు. సమయానికి ఫోన్ కి చేసి చెపుదాం అంటే మా అక్కకి ఫోన్ లేదు.

Krishna Mukunda Murari: ముకుంద ఎత్తుగడకి చిత్తు కానున్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్
అడక్కతినేవాడికి కూడా ఫోన్లు ఉన్నాయి కానీ మా అక్కకి లేదు అని చిరాకు పడుతుంది అప్పు. ఇక ఎలా అయినా అక్కకి ఈ విషయం తెలియచెయ్యాలనే తపనతో వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి కావ్య కి ఫోన్ ఇవ్వమంటుంది అప్పు, స్వప్న మరియు రాహుల్ కలుసుకున్న విషయం మొత్తం కావ్యకి కి చెప్పి వెంటనే నీ మొగుడిని ఇక్కడకి తీసుకొని రా అని చెప్తుంది అప్పు. అప్పుడు కావ్య ఇదే సరైన సమయం, ఇప్పుడు కానీ ప్రూవ్ చెయ్యకపోతే ఇక నా జీవితం లో మళ్ళీ నిరూపించలేను, కానీ ఈ ఫంక్షన్ పెట్టుకొని ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంది కావ్య. అప్పుడు పూజారి ని ఇంకా ఎంత సమయం పడుతుంది..?, మేము కాసేపు లేవొచ్చా అని అడుగుతుంది, పూజారి ఒప్పుకోవడం తో రాజ్ ని ఒప్పించి అక్కడికి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది కావ్య.

ఇక ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అంటే కావ్య రాజ్ తో ‘మా అక్క తన ప్రియుడు రాహుల్ ని కలవడానికి వెళ్ళింది’ అని అంటుంది, అప్పుడు రాజ్ ఆశ్చర్యపోతూ ‘ఏమిటీ’ అని అడుగుతాడు. అప్పుడు కావ్య ‘ఫోన్ ద్వారా తెలిసింది, ఇప్పుడు వెళ్తే మన రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకోవచ్చు’ అని అంటుంది. మరో పక్క రాజ్ అక్కడ పూజకి అన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు అక్కడకి ఎలా వెళ్ళాలి అని తటపటాయిస్తుంటాడు. అప్పుడు కావ్య అది నిజమే కానీ, మీరు నిజం తెలుసుకోవాలంటే ఇదే సమయం, నా మీద పడిన నిండని చెరిపేసుకోవడానికి కూడా ఇదే సమయం, మీకు నిజం తెలుసుకోవాలని లేకపోతే వదిలేయండి, శాశ్వతంగా నేను మీతోనే ఉండిపోతాను అంటుంది. అప్పుడు రాజ్ నో, ఈరోజు ఈ విషయం తేలిపోవాల్సిందే అని కావ్య తో కలిసి బయలుదేరుతాడు. అక్క బావ వచ్చే ముందే ఇక్కడి నుండి మనం బయలుదేరాలి, మీ అన్న చూసాడంటే మళ్ళీ ఇదంతా మనమే ప్లాన్ చేసాము అని అనుకుంటాడు అంటూ అప్పు కళ్యాణ్ ని పక్కకి తీసుకెళ్తుంది. మరోపక్క కావ్య మరియు రాజ్ కార్ లో రాహుల్ మరియు స్వప్న ఉన్న చోటుకి వస్తూ ఉంటారు. ఇక పార్క్ లో స్వప్న రాహుల్ కి తన అందం చూపించి టెంప్ట్ చెయ్యటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అది గమనించి ట్రాప్ లో పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక గుడి లో కావ్య మరియు రాజ్ కనపడకపోవడం తో ఎక్కడికి వెళ్లారు అని ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతూ ఉంటారు.
Nuvvu nenu prema: అరవిందను చంపబోయిన కృష్ణ.. పద్మావతిని కాపాడిన విక్కీ..
మరోపక్క రాజ్ మరియు కావ్య రాహుల్ స్వప్న కలుసుకున్న పార్క్ కి చేరుకుంటారు, వీళ్లిద్దరు రావడాన్ని గమనించిన రాహుల్- స్వప్న, కానీ రాజ్ ఇంతలోపే వీళ్లిద్దరు కలిసుకున్నది చూసేస్తాడు, స్వప్న పరిగిస్తూ వెళ్ళిపోతుంది. రాజ్ ఇదంతా చూసి షాక్ కి గురి అవుతాడు, అప్పుడు కావ్య ఇదే నిజం, ఇన్ని రోజులు సాక్ష్యం కోసం ఆగాను, చిన్నప్పటి నుండి మీతో కలిసి పెరిగినవాళ్ళే మీకు నమ్మకద్రోహం చేస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడు రాహుల్ రాజ్ వద్దకి వచ్చి ‘మీరేంటి ఇక్కడ, పూజ మధ్యలో వదిలేసి వచ్చారేంటి పద పోదాం అని అంటాడు. ఏంటి రాజ్ ఏమైంది అని రాహుల్ అడగగా, రాజ్ రాహుల్ చెంప చెళ్లుమనిపిస్తాడు, ఇక రేపటి ఎపిసోడ్ లో కావ్య రాజ్ ముందు రాహుల్ బండారం మొత్తం బయటపెడుతోంది, అప్పుడు కోపం తో రాహుల్ నువ్వు నోరు ముయ్యి అని కావ్య మీద అరుస్తాడు, రాజ్ అది చూసి తనకి ఏమైనా అడిగే అధికారం ఉంది, ఇప్పుడు ఆమె నా భార్య అని అంటాడు.ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.