NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: రాజ్ ను అడ్డంగా ఇరికించిన కావ్య..మళ్ళీ రోడ్డున పడ్డ స్వప్న…

Brahmamudi Serial 12 April 2023 today 68 episode highlights
Share

Brahmamudi: స్టార్ మా లో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి.. గత ఎపిసోడ్ లో కావ్య ఇంట్లో రాజ్ ఎలాంటి పరిస్థితులను చూసారు.. కావ్య వాళ్ల ఇంట్లో కావ్య పెద్దమ్మ హడావిడి ఎక్కువ చేస్తుంది..ఇక రాజ్ ఇంట్లో నుంచి వెళ్లి వెళ్లిపోవాలని వెళ్తుంటే మీనాక్షి చేస్తున్నా ఓవర్ యాక్షన్ పై రాజ్ ఇబ్బంది పడతాడు..బుర్ర తింటుంది..అది తట్టుకోలేక తల బాదుకుంటాడు. ఇదేంటి ఈ బట్టలే ఉంచావ్ లుంగీ బనియన్ ఇవ్వలేదా అంటుంది. మీరు ఉండే మూడు రోజులు మిమ్మల్ని ప్రేమతో ముంచెత్తుతాము అనేసరికి రాజ్ బిత్తరపోయి కావ్య దగ్గరకి వెళ్ళి గుసగుసలాడతాడు.

Brahmamudi Serial 12 April 2023 today 68 episode highlights
Brahmamudi Serial 12 April 2023 today 68 episode highlights

Nuvvu Nenu Prema: విక్కీ – మాయల ఎంగేజ్మెంట్ ఆగిపోతుందా? మాయ విక్కీ ప్రేమ గురించి నిజం చెబుతుందా?

మూడు రోజులు కాదు నాలుగు రోజులు ఉందామని అంటున్నాడాని కావ్య రాజ్ ని ఇరికిస్తుంది. అప్పు రాజ్ ని చూడటం చూసి లోపలికి వస్తావా డార్లింగ్ అని పిలుస్తాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత కళ్లు తాగిన కోతిలాగా చిందులేస్తాడు. బంగాళాదుంపల పరుపు మీద కిర్రు కిర్రుమనే ఫ్యాన్ ఉక్కపోత కింద నేను ఉండలేను నేనే వెళ్ళి చెప్తాను అని వెళ్లబోతుంటే అమ్మ, పెద్దమ్మని దాటుకుని వెళ్తారా అని కావ్య బెదిరిస్తుంది. వీళ్ళ అతిని భరించడం కంటే ఎలాగోలా ఇక్కడే చావడం బెటర్ అని బెడ్ మీద కూర్చుంటాడు అది గుచ్చుకునేసరికి దెబ్బకి లేచి కూర్చుని తల పట్టుకుంటాడు..

Brahmamudi Serial 12 April 2023 today 68 episode highlights
Brahmamudi Serial 12 April 2023 today 68 episode highlights

Bramhamudi : అత్తింటిలో అవస్థలు పడుతున్న రాజ్.. తండ్రి మాటతో షాకైనా కావ్య..
ఇక రాజ్ ఇంట్లో అందరూ అందరూ అపర్ణ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుచూస్తారు. వడ్డించమంటారా అని అపర్ణ అంటే శుభాష్ తినడానికి పిలిచానని చెప్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. ఇంతమంది తింటుంటే నువ్వు ఖాళీ కడుపుతో ఉండటం బాగోలేదని సీతారామయ్య అంటాడు. అన్నం మీద అలగడం కరెక్ట్ కాదని ఇంద్రాదేవి నచ్చజెపుతుంది. దీంతో అపర్ణ అన్నానికి కూర్చుంటుంది కానీ కూర వేసుకోకుండా పచ్చడి వేసుకుని తినడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కన్నీళ్ళు పెట్టుకుంటూనే మొండిగా కారం తింటుంది. మొదటి సారి ఈ ఇంట్లో ఆత్మగౌరవం దెబ్బతింది మేము అర్థం చేసుకోగలము కానీ కొడుకుని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని సీతారామయ్య చెప్తాడు. ఇంట్లో డబ్బులు లేక అప్పు కోసం బయటకి వెళ్తుంటే కృష్ణమూర్తి పిలుస్తాడు. వాళ్ళ దగ్గరకి వచ్చి కావ్య ఏమైందని అడుగుతుంది. నీకు పెళ్లై వెళ్ళిపోయిన దగ్గర నుంచి రంగులు సరిగా వేయడం లేదని గిరాకీ తగ్గింది ఇంట్లో కష్టంగా ఉందని అప్పు కావ్యకి చెప్తుంది..

Brahmamudi Serial 12 April 2023 today 68 episode highlights
Brahmamudi Serial 12 April 2023 today 68 episode highlights

అత్తారింట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా అని కృష్ణమూర్తి కావ్యని అడుగుతాడు. చాలా సంతోషంగా ఉన్నాను, చాలా పెద్ద ఇల్లు కదా ఎవరి గదులు వాళ్ళవి. నాకు కూడా మన ఇల్లులాంటి రూమ్ ఇచ్చారని కావ్య చెప్తుంది. అదేంటి నువ్వు అల్లుడుగారు ఒకే గదిలో ఉండటం లేదా అని అడుగుతాడు. కానీ కావ్య అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది. కోపంగా ఉంటే నన్ను ఇక్కడకి ఎందుకు తీసుకొస్తారు, ఇక్కడ ఎందుకు ఉంటారని అంటుంది. స్వప్న తన స్నేహితురాలు సిరి ఇంట్లో భోజనం చేయబోతుంటే మోసపోయావా అని అడుగుతుంది. నువ్వు నమ్మి వెళ్ళిన వ్యక్తి నిన్ను మోసం చేశాడా అంటుంది.

Krishna Mukunda Murari: తప్పు చేశాడని మురారి కాలర్ పట్టుకున్న కృష్ణ.. అసలేం జరుగుతుందో చెప్పమని భవానిని ప్రశ్నించిన ముకుందా

స్వప్న కచ్చితంగా అన్నం తినబోతుంటే సిరి తల్లి వచ్చి తిడుతుంది. ఇన్ డైరెక్ట్ గా స్వప్నని తిడుతుంది. నీ ఫ్రెండ్ మీద నీకున్న ప్రేమ కాలనీ వాళ్ళకి మన మీద ఉండదు. లేచిపోయిన దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నానని అంటారు. ఇప్పుడు నేను నోరు మూసుకుంటే ఆ కనకానికి పట్టిన గతే నాకు పడుతుంది. కావ్య కుటుంబ పరువు కాపాడటం కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిందని సిరి తల్లి నోటికొచ్చినట్టు స్వప్నని తిడుతుంది..భోజనం చేసిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనేసరికి స్వప్న తినకుండా చేయి కడిగేసుకుని బాధగా వెళ్ళిపోతుంది. కనకం బట్టలు తీసుకొచ్చి రాజ్ కి ఇస్తుంటే వద్దని అంటాడు. కావ్య వచ్చి తన తండ్రి ఇచ్చిన బట్టలు వేసుకోమని బతిమలాడుతుంది. కానీ రాజ్ వాటిని విసిరి కొట్టడం అప్పు చూసి ఆ లుంగీ ఎలా కట్టుకోవో నేను చూస్తానని అనుకుంటుంది. స్వప్న మళ్ళీ రోడ్డున పడుతుంది. దీనంతటికీ కారణం రాహుల్ తను వదలకుండా ఉండి ఉంటే ఈ అవమానం జరిగేది కాదు.. రాహుల్ కు కాల్ చేస్తుంది లిఫ్ట్ చెయ్యడు..రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..


Share

Related posts

Ram Charan Tej: భర్త రామ్ చరణ్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..!!

sekhar

RC 15: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్… శంకర్ సినిమా కొత్త టైటిల్..?

sekhar

Intinti Gruhalakshmi: విక్రమ్ పై తన మనసులో ఉన్న మాటను తులసికి చెప్పేసిన దివ్య.. లాస్య కి చివాట్లు పెట్టిన నందు..

bharani jella