Brahmamudi 12 ఆగస్ట్ 173 ఎపిసోడ్: కనకం, మూర్తి ఇంటికి వచ్చి అపర్ణ కావ్య తమ ఇంటి పరువు తీస్తున్న విషయాన్నీ నిలదీసి కడిగిపారేస్తుంది. ఆ తర్వాత మూర్తి చేతిలో ఒక బ్లాంక్ చెక్ పెట్టి, మీ కూతురు మా ఇంట్లో కోడలిగా ఉండాలంటే మేము చెప్పినట్టుగా నడుచుకోవాలి, ఇలా దుగ్గిరాల కుటుంబ గౌరవం ని వీధుల్లోకి లాగితే శాశ్వతంగా ఇక మీ కూతురు మీ ఇంట్లోనే ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి బయలుదేరుతుంది.

మూర్తి కి బ్లాంక్ చెక్ రాసి ఇచ్చిన అపర్ణ :
అప్పుడు కనకం అపర్ణ ఇచ్చిన చెక్ తీసి మళ్ళీ ఆమెకే తిరిగి ఇస్తుంది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ మాకు డబ్బులు లేకపోవచ్చు, డబ్బుల కోసం ఇబ్బందులు పడొచ్చు కానీ, ఒకరి ముందు చెయ్యి చాపాల్సిన అవసరం మాకు రాలేదు. కావ్య ఇక నుండి మాకోసం పని చెయ్యదు. ఇంట్లో అందరికీ ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను అనే విషయం తెలుసు అనింది కాబట్టే మేము ఒప్పుకున్నాము, లెకపొయ్యుంటే అసలు ఒప్పుకునేవాళ్ళం కాదు అని చెప్పుకొచ్చింది.

కావ్య ని ఈ పనిని ఆపేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన మూర్తి – కనకం :
ఇక నుండి కావ్య మా ఇంటికి వస్తే చుట్టం చూపుకి మాత్రమే వస్తుంది కానీ, మరో ఉద్దేశ్యం తో వచ్చేందుకు మేము ఒప్పుకోము అంటూ అపర్ణతో చెప్పుకొచ్చింది కనకం. అది కూడా చూస్తా అంటూ అపర్ణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా అపర్ణ మాట్లాడిన మాటలకు ఇంట్లో ప్రతీ ఒక్కరు దిగులుగా కూర్చున్న సమయం లోనే కావ్య అక్కడికి వస్తుంది. ఏమిటి అందరూ సైలెంట్ గా కూర్చున్నారు, పని చేద్దాం పదండి. కలర్ బ్రష్షులు ఎక్కడ ఉన్నాయి నాన్న అని అడుగుతుంది కావ్య. అప్పుడు మూర్తి ఇక నుండి నువ్వు పని ఆపేసి ఇంటికి వెళ్ళు అమ్మా అని అంటాడు మూర్తి. ఎందుకు అని కావ్య అడగగా, కారణాలు అనవసరం అని అంటాడు మూర్తి . ఎందుకు నాన్న,నేను ఇక్కడ పని చెయ్యడం వల్ల మీకేమి నష్టం జరుగుతుంది అని కావ్య అడగగా, నష్టం మాకు కాదు, నీకు జరుగుతుంది, నీ కాపురమే కూలిపొయ్యే పరిస్థితికి వచ్చింది, మీ అత్తగారి కుటుంబ పరువు మొత్తం పోతుంది. అలా ఇష్టమొచ్చినట్టు కథనాలు ప్రచారం చెయ్యడం తో నేను ఆల్రెడీ మీడియా ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాను అని చెప్తుంది కావ్య. అప్పుడు కనకం నువ్వు మీడియా తో మాట్లాడిన తర్వాత మీ అత్తగారు మా ఇంటికి వచ్చి పెద్ద రచ్చ చేసింది అనే విషయాన్నీ చెప్తుంది.

పుట్టింటికి కావ్య దూరం కాబోతుందా ..?:
ఇంతలోపే వినాయకుడి విగ్రహాలను తయారు చెయ్యడానికి కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వస్తాడు. మీ కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్టుగా చెప్తాడు. ఎందుకు అని కావ్య అడగగా, సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు కాంట్రాక్టర్. ఇప్పుడు మీరు ఎందుకు రద్దు చేసారో చెప్పకపోతే, ఇక్కడి నుండి బయటకి కదలలేరు అని అంటుంది కావ్య. అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఇందులో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటాడు. ఎవరది అని కావ్య అడగగా, మీ భర్త రాజ్ అని సమాధానం ఇస్తాడు ఆ కాంట్రాక్టర్. ఇక ఆ తర్వాత కావ్య అత్తారింటికి వెళ్ళాక ప్రెస్ మీట్ పెట్టినందుకు అందరూ నిలదీస్తారు.

Nuvvu Nenu Prema : పుట్టింట్లో పద్మావతి హడావిడి.. భక్త ఆండాళ్ పద్మావతిని క్షమించనున్నారా?
ఒక కుటుంబం లో ఉన్నప్పుడు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మాకు చెప్పి చెయ్యాలి కదా అని అందరూ అడుగుతారు. అప్పుడు అపర్ణ అంత బాధ్యత తెలిసిన అమ్మాయే అయితే పుట్టింటికి వెళ్లి మన పరువు ఎందుకు తీస్తుంది అని అంటుంది, అప్పుడు కావ్య అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి మా పరువు తీశారు అని అనగా, నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్న దానికే నీకు అంత కోపం వస్తే, ప్రెస్ మీట్ పెట్టి అంతమంది ముందు మన కుటుంబం గురించి మాట్లాడావు, నాకు ఎంత కోపం రావాలి అని అంటుంది అపర్ణ.