Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు దూసుకెళ్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కావ్య రాహుల్ నిజస్వరూపాన్ని రాజ్ కి తెలిసేలా చేస్తుంది, రాజ్ ఎంతో తెలివిగా తన మాయ మాటలతో ఏమార్చి తప్పించుకోవాలని చూస్తాడు. ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో రాజ్ రాహుల్ మాట్లాడింది మొత్తం విన్న తర్వాత ‘రాహుల్ చెప్పినట్టుగా స్వప్న ఏ తప్పు చెయ్యకపోతే ఇక్కడ నుండి ఎందుకు పారిపోయినట్టు?, రాజ్ ఏ తప్పు చెయ్యలేదు కాబట్టే ఇక్కడే నిలబడి అన్నిటికీ సమాధానం చెప్తున్నాడు. నేను ఇప్పటి వరకు నీ మాట ఏమి నమ్మలేదు, కానీ అంత ముఖ్యమైన తంతు జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఆపి ఇక్కడి దాకా తీసుకొచ్చావు కాబట్టి నీకు మరొక్క చివరి అవకాశం ఇస్తున్నాను. నిజంగా రాహుల్ తప్పు చేసాడని స్వప్న తో నిరూపించు, అప్పుడు నువ్వు చెప్పింది నిజం అని నమ్ముతాను అని అంటాడు రాజ్. అప్పుడు రాజ్ ఆమెకి ఎందుకు ఇంకో అవకాశం ఇస్తున్నావ్, కావ్య మరియు స్వప్న కలిసి నిన్ను ఏమరుస్తున్నారు అని అంటాడు రాజ్ తో, అప్పుడు రాజ్ నన్ను ఎవ్వరు మోసం చెయ్యలేరు, నిజానిజాలు నాకు తెలుసు అంటాడు.

అయినా ఆమెకి ఇంకో అవకాశం వస్తే నువ్వు ఎందుకు బయపడుతున్నావు, తప్పు చేసింది నువ్వే అని రుజువు అయితే నాలో మరో రూపం చూస్తావు అని అంటాడు రాజ్. ఇక మరో పక్క గుడిలో అందరూ రాజ్ మరియు కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు,ఇక తిరిగి వెనక్కి వెళ్దాం అని అనుకుంటున్న సమయం లో రాజ్ మరియు కావ్య వస్తారు. ఇంత ముఖ్యమైన తంతు జరుగుతున్నా సమయం లో మీరు ఎక్కడికి వెళ్లారు, మీరేమైనా చిన్న పిల్లలు అనుకున్నారా మేము మీరు తప్పిపోయారు అని అనుకోవడానికి అని అందరూ రాజ్ మరియు స్వప్న ని నిలదీస్తారు. అప్పుడు కావ్య మీరు చెప్తారా?, నన్ను చెప్పమంటారా అని రాజ్ ని అడుగుతుంది,అప్పుడు రాజ్ నేనే కావ్య ని బయటకి తీసుకెళ్ళాను, ఇందులో కావ్య తప్పు ఏమి లేదు అని అంటాడు.ఇలా వీళ్ళు చర్చించుకుంటున్న సమయం లో పూజారి , ఇంకో 5 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది, వెంటనే తంతు పూర్తి చెయ్యాలి అంటాడు. అప్పుడు రాజ్ నల్లపూసలు గుచ్చినా తాళిని కావ్య మేడలో వేస్తాడు.

ఇక ఆ తర్వాత రాజ్ కావ్య వద్దకి వచ్చి ఈరోజు జరిగిందంతా మర్చిపో, ఈ విషయం ఇంట్లో తెలియడానికి వీలు లేదు అంటాడు. అప్పుడు కావ్య ఎందుకు మీరు రాహుల్ తప్పు చేసాడని నమ్ముతున్నారా అని అడుగుతుంది. అప్పుడు రాజ్ లేదు అంటాడు, అప్పుడు కావ్య మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడగగా, రాజ్ దానికి సమాధానం చెప్తూ నిజానిజాలు తెలియకుండా రాహుల్ తప్పు చేసాడని ఇంట్లో తెలియడం నాకు ఇష్టం లేదు, అతను తప్పు చేసాడని నువ్వు నిరూపించాలి, అప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తాను అని అంటాడు.

మరోపక్క రాహుల్ స్వప్న వద్దకి వచ్చి వార్నింగ్ ఇస్తూ ఇది నా దారి అడ్డు రావొద్దు, నేను ఎంత దూరం అయినా వెళ్తాను అంటాడు, ఇంత ప్రయత్నం చేసావు, ఏమి పీకగలిగావు అని అంటాడు రాహుల్, మా ఆయన మనసులో అనుమానం అనే భీజం నాటాను అంటుంది కావ్య, అప్పుడు రాహుల్ అది మొలకెట్టేలోపే అబద్దం అని నిరూపిస్తాను అంటాడు, దానికి కావ్య సమాధానం చెప్తూ ఈలోపు నీ నిజస్వరూపాన్ని బయటపెట్టి చూపిస్తాను అని సవాలు విసురుతుంది. చివరిగా ఒక్క మాట నీ మీదకు నీ అక్కని అస్త్రం గా వాడబోతున్నాను రెడీగా ఉండు అని అంటాడు రాహుల్, నేను రెడీ అని ప్రతిసవాల్ విసురుతుంది కావ్య. తర్వాత ఏమి జరగబోతుంది అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.