Brahmamudi 199 ఎపిసోడ్: తాము క్రికెట్ ఆడుకుంటున్న గ్రౌండ్ లోకి వేరే బ్యాచ్ ఎవరో వచ్చి కబ్జా చేసి ఆడడం తో, అప్పు తన బ్యాచ్ ని వేసుకొని వచ్చి గొడవలకు దిగుతుంది. ఆ సమయం లో ఎవరో వెనకాల నుండి వచ్చి అప్పు తల మీద కర్రతో కొట్టబోతుంతే కళ్యాణ్ అడ్డు వస్తాడు. అతని తలకి దెబ్బ తగులుతుంది. దీంతో కంగారు పడిన అప్పు, వెంటనే అతనిని తన ఇంటికి తీసుకెళ్లి కట్టు కడుతుంది. మా గొడవల్లోకి నువ్వెందుకు దూరావు, చూడు ఎలా దెబ్బ తగిలిందో అని అంటుంది.

అప్పుడు కళ్యాణ్ అదేంటి బ్రో అలా అంటావ్, నీకు హాని జరుగుతుంటే నేను ఎందుకు సైలెంట్ గా ఉంటాను. నేను అడ్డు రాకపొయ్యుంటే నీ తలకి చాలా గట్టి దెబ్బ తగిలేది అని అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత, దునియా ఎలా పోయినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండే నువ్వు, ఈ అబ్బాయి విషయం లో ఇలా మారిపోయావు ఏంటి , కచ్చితంగా ఎదో జరుగుతుంది అని అంటుంది అన్నపూర్ణ. అప్పుడు అవునా, ఏమో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటుంది.

సీతారామయ్య కి ట్రీట్మెంట్ కోసం అమెరికా కి తీసుకెళ్ళబోతున్నారా..?:
మరోపక్క రాజ్ మరియు సుభాష్ సీతారామయ్య వద్దకి వచ్చి మిమల్ని అమెరికా కి పంపి అక్కడ స్పెషలిస్ట్స్ చేత స్పెషల్ ట్రీట్మెంట్ చేయించాలని అనుకుంటున్నాము అని అంటాడు. అప్పుడు సీతారామయ్య తిడుతూ, మీకసలు బుద్ధి ఉందా, నా తుది శ్వాస పరాయి దేశం లో వదిలేలా చేస్తారా, అయినా ముదిరిపోయినా రోగాన్ని ఎవరు మాత్రం తగ్గించగలరు?, పుట్టుక ని యవ్వనం ని , సర్వ సుఖాలను జీవితం లో ఆహ్వానించిన మనం, కచ్చితంగా మృత్యువుని కూడా ఆహ్వానించాల్సిందే అని అంటుంది. అప్పుడే ఇందిరా దేవి అక్కడికి వస్తుంది, ఏమి మాట్లాడుకుంటున్నారు మీరు అని అనగా రాజ్ మరియు సుభాష్ ఒక్కసారిగా తడబడతారు. గట్టిగా అడుగుతూ బిజినెస్ గురించే మాట్లాడుకుంటున్నారా అని అడగగా, అవును నానమ్మ అని సమాధానం ఇస్తాడు రాజ్. అప్పుడు ఇందిరా దేవి మాట్లాడుతూ ఇది మా బావ విశ్రాంతి తీసుకునే సమయం, చూడండి ఎంత నీరసంగా ఉన్నాడో, రేపు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు వెళ్ళండి అని బయటకి పంపేస్తుంది.

కళ్యాణ్ కి దెబ్బ తగిలింది అని తెలుసుకొని ఇంటికి వచ్చేసిన అనామిక :
ఇక ఆ తర్వాత బయటకి వచ్చాక తాతయ్య అమెరికా కి రాను అని అంటున్నాడు కాబట్టి, మనమే ఆ స్పెషలిస్ట్స్ ని ఇక్కడికి రప్పిద్దాం అని అనుకుంటారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకో రాజ్, తాతయ్య ఫైల్ కి సంబంధించిన వివరాలు నీ ఫోన్ లో ఉన్నాయి కదా, ఎవరైనా చూస్తారేమో జాగ్రత్త అని అంటాడు సుభాష్. అప్పుడు రాజ్ నా ఫోన్ ని ముట్టుకునే ధైర్యం ఎవరికీ ఉంది నాన్న అని అంటాడు. కాసేపటి తర్వాత తలకి కట్టిన కట్టుతో ఇంట్లోకి అడుగుపెడతాడు కళ్యాణ్, అందరూ ఏమైంది రా కళ్యాణ్ అని అడుగుతూ ఉంటారు, సరిగ్గా అదే సమయానికి అనామిక కళ్యాణ్ కి దెబ్బ తగిలింది

అనే విషయం తెలుసుకొని, అతను ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యకపోవడం తో నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. అందరి ముందు కళ్యాణ్ వద్దకి వచ్చి ఏమైంది , ఎలా ఉంది అంటూ కంగారు పడుతూ అతని యోగక్షేమాలను అడుగుతుంది. ఇంట్లో అందరూ చూస్తున్నారు అనే విషయం కూడా ఆమె మర్చిపోతుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఇంట్లో అందరికీ అనామిక ని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత తన గదిలోకి కూడా తీసుకెళ్తాడు. అక్కడ అనామిక కళ్యాణ్ దాచుకున్న తన ఫోటోని చూస్తుంది. ఆమెకి కళ్యా ప్రేమ గురించి తెలిసిందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.