Brahma Mudi: స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది, ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ 93 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ 93 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.రాహుల్ నడుపుతున్న నాటకాలన్నిటిని రాజ్ కి తెలిసేలా చేస్తుంది కావ్య. రాజ్ ఆవేశం తో రాహుల్ చెంప పగలగొడుతాడు. చిన్నప్పటి నుండి నాతో కలిసి పెరిగి నాకే ఇంత పెద్ద నమ్మకద్రోహం చేస్తావా అంటూ రెచ్చిపోతాడు. అప్పుడు రాహుల్ భయపడుతూ , రాజ్ కాస్త ఉండు వివరిస్తాను అని చెప్పగా, కళ్ళతో నీ బండారం మొత్తం చూసిన తర్వాత కూడా ఇంకేమి వివరిస్తావు రా అని అంటాడు. అప్పుడు కావ్య ఇకనైనా నీ నాటకాలు ఆపు, నీ బండారం ఎక్కడ బయటపడుద్దో అని నన్ను బెదిరించి నా నోరు మూయించావు, ఇకనైనా నీ నాటకాలకు అడ్డుకట్ట వెయ్యి అని అంటుంది.

Brahmamudi: రాహుల్ – స్వప్న కుట్రలను కళ్లారా చూసిన రాజ్..తర్వాత ఏమైందంటే!
ఇంత మోసం చేసింది కాక నా భార్యే స్వప్న ని తప్పించి నన్ను పెళ్లి చేసుకుంది అన్నట్టుగా నేరం ఆమె మీదకి నెట్టావు. నేను నా భార్య మాట నమ్మకుండా నిన్ను నమ్మి ఎంత ఫూల్ గా ప్రవర్తించానో ఇప్పుడు అర్థం అయ్యింది , ఎందుకు రా ఇదంతా చేసావు అని చొక్కా పట్టుకొని నిలదీస్తాడు రాజ్. నేను కానీ నా కుటుంబం కానీ నీకు ఏ అన్యాయం చేసాము రా, ఎందుకు మా కుటుంబాన్ని అల్లరి పాలు చేసావ్ అని నిలదీస్తాడు. అప్పుడు కావ్య నువ్వు ఇంకా తప్పించుకోవాలి అని చూడకు, నిజం ఏమిటో నువ్వు ఈరోజు కచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని అంటుంది. మరోపక్క గుడిలో రాజ్ మరియు కావ్య కనిపించకుండా పొయ్యారు అని అందరూ కంగారు పడుతూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చిక్కింది ఛాన్స్ అనుకోని అపర్ణ కనకం ని అవమానించడం మొదలు పెడుతుంది.

ఇది ఈమె తన కూతుర్లకు నేర్పించిన సంస్కారం,ఇది ఈమె పెంపకం, ఇక్కడకి వచ్చిన వాళ్లంతా ఏ పనిపాట లేకుండా ఖాళీ గా కూర్చొని, గుడికి కాలక్షేపం చెయ్యడానికి వచ్చారు , ఈమె కూతురు మాత్రం రాచకార్యం చెయ్యడానికి బయలుదేరింది. అసలు మీ కుటుంబం లో ఒక్కరైనా పద్దతిగా, లక్షణంగా ఉన్నారా..?, తల్లే ఇలా ఉంటె పిల్లలు ఇంకెలా తయారు అవుతారు అని నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తుంది. అలా గుడిలో గొడవలు జరుగుతూ ఉంటుంది.మరో పక్క రాహుల్ ఇది నాకు రాజ్ కి మధ్య జరుగుతున్న సమస్య నువ్వు కలిపించుకోకు కావ్య అని అంటాడు, అప్పుడు కావ్య ఇది నాకు నా భర్త కి మధ్య గొడవలు పెట్టిన సమస్య, కచ్చితంగా కల్పించుకొని తీరుతాను అని అంటుంది కావ్య, ఇక ఇతనిని అడగాల్సింది ఏమి లేదు, ఒక్కసారి మీరే జరిగింది గుర్తు తెచ్చుకోండి, మన పెళ్లి జరుగుతున్న సమయం లో ఈ రాహుల్ ఎందుకు లేదు అని రాజ్ కి గుర్తు చేస్తుంది కావ్య, ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అన్నాడు..జరిగిందా?, లేదు పోనీ లేదు అని తెలిసిన తర్వాత అయినా పెళ్ళికి తిరిగి వచ్చాడా అంటే అదీ లేదు, మా అక్కని తీసుకెళ్లి హోటల్ లో ఉంచి, ఆమెకి మాయమాటలు చెప్పి నీతో కంటే తనతోనే జీవితం బాగుటుందని మాయమాటలు చెప్పి నమ్మించాడు అని అంటుంది కావ్య. ఇదంతా విన్న రాజ్ ఇంత దుర్మార్గుడివా నువ్వు, ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా అని, ఇంకా ఎంత మందిని మోసం చేస్తావు ర అని నిలదీస్తాడు రాహుల్ ని, కనీసం స్వప్న ని తీసుకెళ్లక ఆమెని పెళ్లి కూడా చేసుకోలేదు, ఆమెని వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా అని అంటాడు రాజ్.

మరోపక్క రాహుల్ ఇదంతా విని తనకి అనుకూలంగా మార్చుకునేలా రాజ్ తో మాయమాటలు చెప్పి తన వలలోకి లాగాలని చూస్తాడు, కావ్య మళ్ళీ నిలదీస్తే నువ్వు నోరు మూసుకుంటావా అని అంటాడు రాహుల్, అప్పుడు రాజ్ కోపం తో తాను నా భార్య, తనకి ఏదైనా అడిగే హక్కు ఉంది అంటాడు, తన మీద మొట్టమొదటిసారి అంత ప్రేమ చూపించినందుకు మురిసిపోతుంది కావ్య. చివరికి రాహుల్ తన నక్క తెలివితేటలూ ఉపయోగించి, నేను స్వప్న ని ఇక్కడికి రమ్మనలేదు, ఆమె నాకు ఎన్ని సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పిందో చూడు అని తన ఫోన్ చూపిస్తాడు రాహుల్, అలా మొత్తం స్వప్న మీదకి నెట్టేస్తాడు. స్వప్న ఎందుకు అంత అర్జెంటు గా నన్ను రమ్మనిందో తెలుసుకోవడానికే ఇక్కడకి నేను వచ్చాను అని చెప్తాడు, అప్పుడు కావ్య వీళ్లిద్దరు మాట్లాడుకొనే ఇక్కడికి వచ్చారు అని చెప్తుంది కావ్య, అదే నిజమైతే స్వప్న ఇక్కడ ఎందుకు లేదు, మిల్మాల్ని చూడగానే ఎందుకు పారిపోయింది అని అంటాడు, అలా పరిస్థితి మొత్తం తనకి అనుకూలంగా మార్చేసుకుంటాడు రాహుల్.రాజ్ కూడా ఇదంతా నమ్మినాడా, లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.