Brahmamudi: బుల్లితెర పై ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు దూసుకెళ్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో రాహుల్ కావ్య ఇద్దరు డి అంటే డి అని సవాళ్లు విసురుకుంటారు. రాజు కావ్యకు మరో అవకాశం ఇస్తాడు, దీంతో ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో రాజ్ గురించి వాళ్ళ అమ్మ ఆలోచిస్తూ రాజ్ కావ్యను బయటకునేనే తీసుకెళ్లాను అని చెప్పడం, తో రాజు మారిపోయాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.

episode highlights
అదే టైం కి అక్కడికి రుద్రాణి వచ్చి రాజు మారిపోయాడని మన ముందు నటిస్తున్నాడని కావ్య మీద తన అభిప్రాయం మార్చుకున్నాడు ఏమో అని ఇంకొంచెం అనుమానం పెరిగేలా చేస్తుంది. రాజ్ తన రూమ్ చూసి చాలా బాగా సర్దారుఅని కాంతమ్మ కు థాంక్స్ చెప్పబోతూ ఉంటాడు. అక్కడే ఉన్న కావ్య ను చూసి, నువ్వు చేసావాఅని అడుగుతాడు, కావ్య మీ రూమ్ అంతా స్టోర్ రూమ్ లా ఉంటే నేనే మార్చాను అని చెప్తుంది. ఇద్దరి మధ్యకాసేపు గిల్లికజ్జాలు జరుగుతాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నావ్ మరో మూడు రోజుల్లో వెళ్ళే దానివి ఇంత చేయాలా అని అంటాడు. నేను తప్పు చేశానని నిరూపిస్తే కదా బయటికి వెళ్ళేది అది జరిగినప్పుడు చూద్దాం లేండి అంటుంది కావ్య.

episode highlights
Nuvvu Nenu Prema: కృష్ణ కుట్రకు అను ఆర్యాలు బలికానున్నారా..
రాహుల్ గురించి స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. రాహుల్ ని నమ్మి నేను తప్పు చేశాను అని, రాహుల్ ఎందుకు నన్ను రాజ్ ముందు రాకుండా చేస్తున్నాడు. నేను వచ్చాక అసలు అక్కడ ఏం జరిగింది అని ఫోన్ చేసి అడుగుతుంది. రాహుల్ తెలివిగా నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను స్వప్న నువ్వేం భయపడకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళందరికీ మంచి టైం చూసి మన గురించి చెప్తాను, రేపు మనం కలవాలి అని స్వప్న అడగడంతోసరే కలుస్తాను అని చెప్పి నమ్మించి ఫోన్ పెట్టేస్తాడు. మనసులో స్వప్నని అందరి ముందు దోషిగా చేసి, కావ్యని ఇరికించి రాజ్ మనసులో కావ్య మీద కోపం పెరిగేటట్లు చేస్తాను అనుకుంటాడు.

episode highlights
ఇక రాజ్ గురక పెడతాడు అని కావ్య నిరూపించాలని రికార్డ్ చేస్తూ ఉంటుంది. స్వప్న, రాహుల్ ని కలవడానికి రెడీ అవుతూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి, నీకు పెళ్లి చీర ఇచ్చి, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఎక్కడికి పారిపోకు అని చెప్తుంది స్వప్న అమ్మ. అందరూ నన్ను పరాయి వాళ్ళలా చూస్తున్నారు, నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసేదానివి. ఇప్పుడు నువ్వు కుడా నన్ను పరాయి దానిలా చూస్తున్నవ్ అంటుంది. నువ్వు చేసింది ఇదంతా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న వాళ్ళ అమ్మ. కళ్యాణ్,రాజ్ కి వదిన చాలా మంచిది. అన్నయ్య ను నువ్వు తన మీద ఆలోచన మార్చుకో అని చెప్పి వెళ్తాడు.
రేపటి ఎపిసోడ్లో రాజు వాళ్ళ పిన్ని ధాన్యలక్ష్మి రాజు కావ్య ఇద్దరు మాట్లాడుకోవడం పైనుంచి వింటుంది. రాజ్ ఒంటరిగా వున్నప్పుడు ధాన్యలక్ష్మి వచ్చి, నువ్వే కావ్య నీ బయటికి వెళ్ళమన్నావా అని అడుగుతుంది. ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తాను అని వెళుతుంది. చూడాలి రేపటి ఎపిసోడ్ లో కావ్య బయటికి ఎందుకు వెళ్లిందో అందరికీ తెలిసిపోనుందా.