Brahmamudi Serial జూన్ 14th 122 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు 121 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని, 122 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ప్రతీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ముందుకెళ్తున్న ఈ సీరియల్ లో నేటి ఎపిసోడ్ లో ఏమి జరిగిందో చూద్దాం.

కిడ్నాపర్ ని గుర్తించిన రాజ్ :
కిడ్నాప్ కి గురైన స్వప్న ని వెతకడానికి కావ్య బయలుదేరుతుంది. కావ్య తో పాటు రాజ్ కూడా వస్తాడు. ఎవరో కిడ్నాప్ చేసారు అనే విషయం ని గ్రహించిన రాజ్, అక్కడ ఉన్న కెమెరా మ్యాన్ ని పిలిచి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఫోటోలను వెతుకుతాడు. అలా ఫొటోస్ చూస్తున్న సమయం లో స్వప్న ఉన్న ప్రతీ చోట కిడ్నాపర్ కామరాజు స్వప్న ని కామంగా చూస్తుండడం గమనించి కచ్చితంగా వీడే కిడ్నాప్ చేసి ఉంటాడు అని గ్రహిస్తాడు, ఆ తర్వాత అక్కడ ఉన్న వైటర్స్ ని పిలిచి వీడు మీతో పాటు వచ్చాడా? అని అడుగుతాడు. లేదు సార్ వాళ్ళు నలుగురు వచ్చారు, మీ ఇంట్లో వాళ్ళు పిలిపించారేమో అనుకున్నాం, ఇప్పుడు వాళ్ళు కనిపించడం లేదు అంటారు. వంద శాతం కామరాజు కిడ్నాప్ చేసి ఉంటాడు అని ఖరారు చేసుకొని వాడి కోసం వెతకడానికి బయలుదేరుతారు రాజ్ మరియు కావ్య.

స్వప్న ఫ్యామిలీ ని దారుణంగా అవమానించిన రుద్రాణి :
కార్ లో వెళ్తున్న సమయం లో రాజ్ తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ కి కామరాజు ఫోటో పంపి, ఇతను ఎక్కడ ఉన్నాడో అడ్రస్ కావాలి అని అడుగుతాడు. ఇక మరోపక్క రుద్రాణి తన నట విశ్వరూపం చూపిస్తూ స్వప్న కుటుంబం పై నోటికి వచ్చినట్టు నిందలు వేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. సూటిపోటి మాటలతో ఒక ఆడపిల్లని ఎలాంటి మాటలు అనకూడదో అలాంటి మాటలు అంటుంది. అసలు అమ్మాయి నిజంగా తనకి తాను వెళ్లిపోయిందో,

లేదా ఎవరైనా కిడ్నాప్ చేసారో, అసలు ఉందో లేదో తెలియకుండా ఇన్ని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని కుటుంబ సభ్యులందరూ అంటున్నా కూడా లెక్క చెయ్యకుండా రుద్రాణి రెచ్చిపోతుంది. నా రాహుల్ కి మాయమాటలు చెప్పి ఇష్టమొచ్చినట్టు తిరిగి కడుపు చేయించుకుంది, అప్పట్లో రాజ్ కంటే బెటర్ గా రాహుల్ అనిపించాడు కాబట్టి రాహుల్ తో లేచిపోయింది. ఇప్పుడు రాహుల్ కంటే బెటర్ గా ఎవరు అనిపించారో, వాడితో లేచిపోయింది అంటూ చాలా నీచమైన మాటలు మాట్లాడుతుంది.

స్వప్న గర్భవతి కాదు అని నిజం తెలుసుకున్న కావ్య:
స్వప్న ఇప్పుడు లేదు కాబట్టి, నా బిడ్డ తప్పు ఏమి లేదు కాబట్టి, ఈ పెళ్లి ఆపించేసి వెన్నెల తో పెళ్లి చెయ్యండి అని అంటుంది రుద్రాణి. అప్పుడు అపర్ణ పిచ్చి పట్టిందా నీకు, ఒక అమ్మాయిని మోసం చేసి కడుపు చేసినోడితో తన కూతురుని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి అరుంధతి ఎలా ఒప్పుకుంటుంది అని అపర్ణ అంటుంది. అవన్నీ నాకు అనవసరం, మీరే ఆ పెళ్లి చెడిపేసారు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఆ పెళ్లి చెయ్యడం మీ బాధ్యత అని అంటుంది.

మరోపక్క స్వప్న కోసం రాజ్ మరియు కావ్య తీవ్రంగా గాలిస్తూ ఉంటారు. మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో స్వప్న ని కిడ్నాపర్ల నుండి రక్షించి రాహుల్ వద్దకి తీసుకొచ్చి పెళ్లి చేస్తుండడాన్ని చూపిస్తారు. స్వప్న బ్యాగ్ ని కావ్య సర్దుతున్న టైం లో అరుణ్ అనే వ్యక్తి ఫోన్ చేస్తాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి, నీకు రాహుల్ అంటే ఇష్టం అని తెలిసి, అతనితో నీ పెళ్లి జరగడం కోసం నువ్వు గర్భవతి అయ్యావు అని అబద్దం చెప్పని అని అంటాడు అరుణ్. అది విని కావ్య షాక్ లో గురి అవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది?, రాహుల్ లాంటి నీచుడితో పెళ్లి జరగనిస్తుందా, లేదా ఆపేస్తుందా అనేది చూడాలి.