Brahmamudi అక్టోబర్ 14 ఎపిసోడ్ 227: నిన్నటి ఎపిసోడ్ లో రాజ్ కావ్య తో అసలు నిజంగానే నువ్వు మొక్కు కోసం గుడికి వెళ్ళావా అని అడగడం, దానికి కావ్య కోపంగాసమాధానం చెప్పడం,ఆ తరువాతకావ్య కావాలనే రాజ్ ని ఇబ్బంది పెట్టడంజరుగుతుంది.ఇక స్వప్నకు శ్రీమంతం చేయాలని ఇంట్లో వాళ్ళు అనుకోవడం. దానికి స్వప్న కడుపు నాటకం ఎప్పటికైనా తెలుస్తుందని కడుపు పోగొట్టుకోవడానికి ప్లాన్ వేయడం జరుగుతుంది.

ఈరోజు 227 వ ఎపిసోడ్ లో,స్వప్న మెట్ల పైనుండి కిందకి కావాలని పడినట్టుగా నటించబోతుంది,కానీ కావ్య వచ్చి స్వప్నని పట్టుకుంటుంది. వెంటనే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి, జాగ్రత్తగా ఉండాలి కదా అని క్లాస్ పీకుతారు స్వప్నకి, కావ్య పట్టుకుంది కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత అనర్ధం జరిగి ఉండేది, నీకైతే పైపై గాయాలే కనపడతాయి కానీ లోపల ఉన్న బేబీకి ఏమన్నా అయితే ఎలాగు అని అపర్ణాదేవి ఫైర్ అవుతుంది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా జరగరానిది ఏమైనా జరిగితే అందరూ మమ్మల్ని అంటారు అని అపర్ణాదేవి కోప్పడుతుంది

స్వప్నకు కాపలాగా నర్స్..
ఇక స్వప్నని అందరూ తలా ఒక మాట చెబుతూ ఉంటారు జాగ్రత్తలు. స్వప్న మాత్రం మనసులో ఈ కావ్య అనవసరంగా వచ్చి కాపాడింది అని అనుకుంటుంది. రుద్రాణి కూడా అనవసరంగా స్వప్నని కాపాడింది కావ్యా లేదంటే పీడ విరగడ అయిపోయేది అని అనుకుంటుంది. నేనేమీ కావాలని పడలేదు కదా అని అంటుంది స్వప్న అపర్ణాదేవితో, వెంటనే ఇందిరా దేవి ఎంతోమందికి ఎన్నో పూజలు చేస్తే గాని ఇలా తల్లి అయ్యే అదృష్టం ఉండదు అమ్మ ఇంకా చాలామంది తల్లి అయ్యే భాగ్యం లేక గుడిలో గోపురాలు తిరుగుతున్నారు కానీ ఆ దేవుడు నీకు ఇంత చక్కటి వరాన్ని ఇచ్చాడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అపర్ణ మాటల్లో తప్పేముంది. తను నీ మంచి కోసమే చెప్తుంది. అనిస్ ఇందిరా దేవి స్వప్నకు చెప్తుంది. కావ్య అసలు కడిపే కాని దానికి వీళ్లంతా జాగ్రత్తలు చెప్తున్నందుకు కంగారుగా ఉంటూ ఉంటుంది. రుద్రాణి స్వప్నకు అసలు తల్లి అయ్యాను అన్న సంతోషమే నాకు కనిపించట్లేదు మన బొప్పాయి తిన్నది, కళ్ళు తిరిగి పడిపోయింది ఈ రోజు ఇలా తను మారేటట్టు నాకైతే కనిపించట్లేదు అంటుంది రుద్రాణి. తను మారకపోతే నువ్వే మార్చాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. అంటే తనని మారమని ప్రతిక్షణం నేను వెనకాల ఉండి చూసుకోమంటావా అని అంటుంది రుద్రాణి. నేనేం స్వప్నకి వెనకాలే ఉండి సపర్యాలు చేయడానికి నాకు అంత టైం లేదు అని అంటుంది రుద్రాణి. రుద్రాణి అన్నది కూడా కరెక్టే కదా స్వప్న ని దగ్గరుండి చూసుకోవడానికి ఒక మంచి నర్సుని పెడదాం అని అంటుంది అపర్ణాదేవి. వెంటనే స్వప్నకి మైండ్ బ్లాక్ అవుతుంది. వామ్మో వీల్ ఏంటి నర్సు అంటున్నారు అసలు అలాంటి జరిగితే నా నాటకం అంతా బయట పడిపోతుంది అని భయపడుతుంది. బయట వాళ్ళు ఎందుకులే అత్తయ్య కావ్య ఉందిగా చూసుకోవడానికి అని అంటుంది స్వప్న. కావ్య ఒక్కతే పనిమనిషి లేకపోయేసరికి అన్ని పనులు చేస్తుంది ఇప్పుడు నీ పనులు కూడా చేయాలంటే తనకు ఎలా కుదురుతుంది అని అంటుంది ధన్యలక్ష్మి. కావ్య వేరే వాళ్ళు వస్తే స్వప్న నాటకం బయటపడుతుందని వెంటనే నేనే చూసుకుంటానులే అని అంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు దానికి ఒప్పుకోరు నువ్వు అలా పని చేయడం మేము చూడలేం అమ్మ అని, ఒక నర్సుని మాట్లాడదాం అని అంటుంది ఇందిరాదేవి, వెంటనే సుభాష్ కి చెప్తుంది ఒక నర్సుని మంచిగా ఉన్న వాళ్ళని చూసి ఏర్పాటు చేయని సరే అమ్మ అంటాడు సుభాష్.

కళ్యాణ్ అప్పుకి బహుమతి..
కళ్యాణ్ అప్పుకి కాల్ చేసి రమ్మనమని చెప్పి, తను చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేస్తాడు ఇక చేసేదేం లేక ఇంట్లో వాళ్ళు కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమన్నారని, అప్పు కళ్యాణ వెతుక్కుంటూ వస్తుంది కళ్యాణ్ ఒక షాపింగ్ మాల్ దగ్గర ఉంటాడు అప్పు అక్కడికి వెళుతుంది. వెంటనే పక్కనే ఉన్న అనామిక సప్రైజ్ అంటూ షాక్ ఇస్తుంది. ఇవాళ ఏమన్నా నా పుట్టినరోజు సప్రైజ్ ఇవ్వడానికి అని అనామికను చూసి అప్పు అంటుంది. షాపింగ్ మాల్ లో అనామిక కళ్యాణి చూసి అప్పుకి చాలా కోపం వస్తుంది. కానీ పైకి మాత్రం ఏం కోపం లేనట్టు ఎందుకు పిలిచారో చెప్పండి అని అంటుంది. ఏం లేదు నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము అని అనామిక చెప్తుంది. ఈ గిఫ్ట్ లు నాకేం అవసరం లేదు అని అంటుంది అయినా ఇప్పుడు ఎందుకు అని అంటే నువ్వే కదా నన్ను కళ్యాణి కలిపింది అందుకే అని చెప్తుంది అనామిక. ఇద్దరూ కలిసి అప్పు కోసం ఒక చీరను సెలెక్ట్ చేసి గిఫ్ట్ గా ఇస్తారు. గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి నేను చీరను కట్టను అని నీకు తెలుసు కదా అని అంటుంది అప్పు. వెంటనే కళ్యాణ్ చెప్పాను కదా తనకి ఇట్లాంటివన్నీ సెట్ అవ్వవు అని అంటాడు.కానీ అనామిక అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళ ఫీలింగ్స్ లోపల ఒకలా బయట ఒకలా ఉంటాయి అని వివరంగా చెప్తుంది అనామిక. అదంతా విని ఇవన్నీ అందరి అమ్మాయిలకి కానీ మా అప్పుకి సెట్ అవ్వవు అని అంటాడు. ఏం బ్రో నేను చెప్పింది నిజమే కదా అని అంటాడు కళ్యాణ్ అప్పు వైపు చూసి, అప్పు అప్పటికే చాలా బాధగా ఉంటుంది. తన సులు సున్నితంగానే ఉండదు ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి అంటే ముందుంటుంది ఏ కోణంలోనూ అమ్మాయిలా కనిపించదు. తనకు బండరాయికి పెద్దగా తేడా లేదు ప్రేమా ఫీలింగ్స్ అట్లాంటివన్నీ మా అప్పుకి చిరాకు అని అంటాడు కళ్యాణ్, అసలు నీలా ఇలా సున్నితంగా మాట్లాడే వాళ్ళని మా బ్రోకి నచ్చదు అని అంటాడు. ఎప్పుడు సోల్జర్ లాగా రెడీగా ఉంటుంది గొడవలు పడడానికి అని అంటాడు కళ్యాణ్ అప్పుకి అవన్నీ విని అక్కడ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. వెంటనే ఫోన్ వచ్చినట్టుగా నాటకం ఆడి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనుకొని నేను వెళ్తున్నాను ఫోన్ వచ్చింది అని చెప్తుంది. చీర తీసుకొని వెళ్ళు అని కళ్యాణం చీర ప్యాక్ చేసి ఇస్తాడు. చీర తీసుకొని బయటికి వస్తూ కళ్యాణి అన్నమాటలు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అప్పు.
Krishna Mukunda Murari: ముకుంద ప్లాను అట్టర్ ఫ్లాప్.. కోడల్నిచూసి మురిసిపోయిన రేవతి..

కావ్యకు సేవ చేసిన రాజ్..
ఇక కావ్య కాలికి దెబ్బ తగలడంతో నడుస్తూ కింద పడబోతుంది అప్పుడే రాజ్ పట్టుకుంటాడు. ఏమైంది అని అడుగుతాడు నా కాలు బెణికింది అని చెప్తుంది కావ్య చూసుకోవాలి కదా అని అంటాడు రాజ్. జాగ్రత్తగా కావ్యాన్ని తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెడతాడు. వెంటనే ఆయింట్మెంట్ కోసం ఇల్లంతా వెతుకుతాడు. దేనికోసం వెతుకుతున్నారు అంటుంది కావ్య, ఆయింట్మెంట్ కోసం అని అంటాడు ఆయింట్మెంట్ దేనికండి అని అంటుంది నోట్లో వేసుకొని చప్పరించడానికి అని అంటాడు రాజ్. ఎక్కడుందో మీకు తెలుసా అని అంటుంది ఇది నా ఇల్లు నాకెందుకు తెలియదు అని అంటాడు. సరే అని కావ్య సైలెంట్ గా ఉంటుంది రాజులంతా వెతుకుతాడు కానీ అక్కడ ఆయింట్మెంట్ కనిపించదు. ఏంటి మీరు పుట్టి పెరిగిన ఇంట్లో మీకు ఆయింట్మెంట్ కనిపించట్లేదా అంటుంది కావ్య ఎక్కడ పెట్టావో చెప్పు నువ్వు రాకముందు ఇల్లంతా ఒకలా ఉండేది నువ్వు వచ్చాక అన్ని మార్చావు కదా అని అంటాడు. మా ఇంటి మీద తీసుకొని వచ్చి ఏది కాలు అని అంటాడు. దేనికి అని అంటుంది కావ్య ఏం లేదు ఇరగ కొట్టి చంకలో పెట్టుకొని వెళ్ళిపోదామని అంటాడు. మరి లేకపోతే ఏంటి ఆయింట్మెంట్ రాయడానికి అని అంటాడు మీరు రాస్తారా అని అంటుంది ఎవరికి వాళ్లు రాసుకుంటే బలంగా రాసుకోలేరు కదా అందుకని నేనే రాస్తాను అని అంటాడు.ప్రేమగా కాలికి ఆయింట్మెంట్ రాస్తుంటే కావి మెరిసిపోతుంది కానీ పక్కనే ఉన్న అమ్మమ్మ తాతయ్య గారి కోసం ఇదంతా చేస్తున్నాడు. అని మనసులో బాధపడుతుంది వాళ్ళు గుమ్మం దగ్గర నుంచొని రాజ్ కావ్యాలను చూసి సంతోషిస్తూ ఉంటారు. ఇదంతా తాతయ్య గారి కోసం చేస్తున్నారు ఇది నిజమైతే ఎంత బాగుందో అని అంటుంది కావ్య. ఏంటి అంటున్నావ్ అంటాడు రాజ్ ఏం లేదు అని అంటుంది కావ్య ఇక లేపి తనని జాగ్రత్తగా నడిపించి నొప్పి తగ్గిందా అని అంటాడు తగ్గింది అంటుంది కావ్య అదంతా చూసి సీతారామయ్య మురిసిపోతాడు. కావ్య మాత్రం మనసులోరాజ్ ప్రేమ నిజమైతే ఎంత బాగుందో అని అనుకుంటుంది.
Krishna Mukunda Murari: ముకుంద ప్లాను అట్టర్ ఫ్లాప్.. కోడల్నిచూసి మురిసిపోయిన రేవతి..

కావ్య బాధ..
ఇక కావ్య జరిగిందంతా తలుచుకొని కృష్ణుడి విగ్రహం దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నా కాలికి దెబ్బ తగిలితే,తనే దగ్గరుండి ఆయింట్మెంట్ రాసిన నొప్పిని తగ్గించాడు ఇంత ప్రేమ చూపించింది నిజంగా నా మీదే అయితే నేను ఎంతో సంతోషపడేదాన్ని, కానీ తను నాటకం ఆడుతున్నాడు తన విషయంలో ఎంత ఆలోచించినా చివరికి నాకు బాధే మిగులుతుంది. భర్త ప్రేమని చూసి సంబరపడాలా అది నీటి బుడగలాగా వెంటనే మాయమైపోతుందని బాధపడాలా అని కృష్ణుడి ఎదురుగా కూర్చుని దేవుడికి దండం పెడుతూ మొరపెట్టుకుంటుంది కావ్య. ఇవన్నీ ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్దాం అనుకుంటే, నాకసలు కారణమే లేకుండా చేశావు అన్ని బంధాలు తెలిసిన వాడివి నా బాధ నీకు అర్థం కావట్లేదా, ఆయన నటిస్తేనే నాకు చాలా సంతోషంగా ఉంది అలాంటిది ఆయన నిజంగా ప్రేమిస్తే నేను ఇంకా ఎంత సంతోషపడతానో, ఆయన ఇదంతా నిజంగా చేసి నా మీద ప్రేమ నిజంగా తనకు కలిగేలా చెయ్యి కృష్ణయ్య అని దండం పెట్టుకుంటుంది ఇక నిన్ను జీవితంలో నేను ఏ కోరిక కోరను, మాయని నా మీద ప్రేమ కలగడానికి ఒకే ఒక్క ఛాన్స్ తన మనసులో నేను స్నానం సంపాదించుకోవడానికి, తన మనసులో నా మీద ప్రేమ కలగడానికి ఒక అవకాశాన్ని ఇవ్వు అని కృష్ణుడి దగ్గర కావ్య మొక్కుకుంటుంది. ఇకమీదట నిన్ను ఏ కోరిక కోరను అని అనుకుంటుంది.

రేపటి ఎపిసోడ్ లో,దుగ్గిరాల ఇంటికి కనకం కృష్ణమూర్తి వచ్చి, స్వప్నను ఇంటికి తీసుకు వెళ్లడానికి అనుమతి అడుగుతారు. మీరు అడిగి మంచి పని చేశారు మీ అమ్మాయికి మేము కాపలా ఉండలేకపోతున్నాం తీసుకెళ్లండి అని అంటుంది రుద్రాణి. కానీ స్వప్న మాత్రం షాక్ అవుతుంది. ఇంటికి వెళ్తే తన నాటకం బయటపడుతుందని, ఇంతలో ఇందిరా దేవి స్వప్నని తీసుకెళ్ళు కానీ ఈ లోపు స్వప్నకి శ్రీమంతం చేయాలనుకుంటున్న అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండి స్వప్న జాగ్రత్తగా చూసుకో వచ్చు కదా కనకం అని కనకాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇందిరాదేవి. స్వప్న కావ్య ఇద్దరు షాక్ అవుతారు. వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటే నాటకం బయటపడుతుందని, ఇక కావ్య ఎలాగైనా అమ్మకి స్వప్నది కడుపు కాదు అని చెప్పాలి అని డిసైడ్ అవుతుంది.