Brahmamudi: రాహుల్ తో పనికాదని స్వప్న తన ఇంటికి అర్ధరాత్రి వెళ్తుంది..అయితే కళ్యాణ్ ఫోన్ చేస్తే ఎదో చెప్పి రాజ్ కింద పడిన విషయాన్ని చెబుతారు.. ఇక కావ్య రాజ్ బాధను చూడలేక హాట్ బ్యాగ్ అంటూ వేడి నీళ్ల చెంబును తీసుకొని వస్తుంది..దాన్ని చూసి షాక్ అవుతాడు రాజ్.. మీ ఇంట్లో ఇలాంటివి కూడా ఉంటాయా అని ఓ లుక్ వేసుకుంటాడు.. ఇంట్లో ఇదే హాట్ బ్యాగ్ అని కాపడం పెడుతుంది. అప్పు వచ్చి రాజ్ మీద సెటైర్లు వేసి కావాలని వేడి వేడి నీళ్ళ చెంబు నడుము మీద పెట్టేస్తుంది. మీనాక్షి, కనకం వచ్చి మళ్ళీ వచ్చి కాసేపు తిక్క తిక్కగా మాట్లాడతారు. కషాయం తీసుకొచ్చాను ఇది తాగితే నొప్పి దెబ్బకి తగ్గుతుందని బలవంతంగా అందరూ కలిసి రాజ్ గొంతులో కషాయం పోస్తారు. రాజ్ కి తెలియకుండా రాజ్ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాలని అనుకుంటుంది. ఇంట్లో అపర్ణ రాజ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. తనని వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంటుంది.

Brahmamudi: కాలు జారిపడ్డ రాజ్.. కామెడితో కడుపుబ్బా నవ్వించిన మీనాక్షి- కనకం.. అపర్ణ ఎంట్రీతో..
కావ్య రాజ్ ఫోన్ నుంచి అపర్ణకి ఫోన్ చేస్తుంది. వాడి ఫోన్ నువ్వు ఎందుకు ముట్టుకున్నావ్ అని అరుస్తుంది. మీ అబ్బాయికి ఇక్కడ దెబ్బ తగిలింది. కింద పడ్డారు నడుము పట్టేసిందని చెప్తుంది. మీ ఇంటి దరిద్రం వాడికి పట్టించారా అని అపర్ణ అరుస్తుంది. మీరందరూ ఆలోచించి నరక కూపంలోకి పంపించారు కదా మీరే వెళ్ళి నా కొడుకుని తీసుకుని రండి అని అపర్ణ గొడవ చేస్తుంది. ఏం చేయాలని అంటుంటే రుద్రాణి రెచ్చగొట్టేలా మాట్లాడి వియ్యాల వారింటికి వెళ్ళమని చెప్పేసరికి అపర్ణ వెంటనే కనకం ఇంటికి బయల్దేరుతుంది. స్వప్న కూడా తల్లి దగ్గరకి బయల్దేరుతుంది. రాజ్ నిద్రపోతుంటే దోమలు కుట్టేసి ఇబ్బంది పెడతాయి..ఈ బంగాళ దుంప పరుపు ఒకటి అంటూ రాజ్ అంటాడు..అప్పు వచ్చి దోమతెర కడుతుంది. అది చూసి ఏం చేస్తున్నావ్ ఏంటి ఇదంతా నన్ను బంధిస్తున్నావ్ అని గొడవ చేస్తాడు. ఈ బోన్ తీసుకెళ్ళి మీ అక్కకి ఇవ్వు నాకు వద్దని చెప్పి తీసుకెళ్లమని అంటాడు..

దోమల్లారా మా బావ మస్త్ ఇష్టపడుతున్నాడు గ్యాప్ లేకుండా కుట్టమని కోరుకుంటుంది. దోమతెర తీసుకురావడం చూసిన కనకం జెట్ కాయిల్స్ వెలిగించి గదిలో రాజ్ పడుకున్న బెడ్ మీద పెడుతుంది. ఆ వాసనకి మళ్ళీ నిద్రలేచిన రాజ్ కి తుమ్ములు వస్తాయి. ఈ పొగకి ప్రశాంతంగా ఎక్కడ పడుకోవాలని కసురుతాడు. కావ్య గదిలోకి వచ్చి ఈ పొగ ఏంటి అని కంగారుపడుతుంది. పొమ్మనలేక పొగ పెడుతున్నారా అని బిక్కమొహం వేస్తాడు. రోడ్డు మీద స్వప్న నడుస్తూ వెళ్తుంటే అపర్ణ కారు ఆపి కృష్ణమూర్తి ఇల్లు ఎక్కడ అని అడుగుతుంది. ఈ కావ్య మామూలుది కాదు అప్పుడే మా ఇంటికి రాకపోకలు పెట్టించేసిందని స్వప్న తిట్టుకుంటుంది..స్వప్న ఇంటికి రావడం రాజ్ చూస్తాడు.. అసలేం జరుగుతుందో నెక్స్ట్ సోమవారం ఎపిసోడ్ చూడాల్సిందే..
Nuvvu nenu prema: పద్మావతి విక్కీ పై ప్రేమను బయటపెడుతుందా?..కృష్ణ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?