Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు దూసుకెళ్తుంది.ఈరోజు ఎపిసోడ్ కావ్య గార్డెనింగ్ చేస్తూ ఉంటుంది, రాజ్ వచ్చి నీ తప్ప ఏమీ లేదనిరూపించుకోవడానికి నీకు ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ఆ లోపు నిరూపించుకోకపోతే, అని అనే లోపు కావ్య నిరూపించుకో లేకపోతే నేనే వెళ్ళిపోతాను, నిరూపించుకో లేకపోతే నన్ను మీరు నిర్ధాక్షణంగా పంపిస్తారని నాకు తెలుసు అంటుంది. ఇదంతా పైన బాల్కనీ నుండి ధాన్యలక్ష్మి చూస్తోంది.

Brahmamudi: రాజ్ ఆలోచనలో మార్పు వచ్చిందా.. స్వప్నని రాహుల్ శాశ్వతంగా వదిలించుకుంటాడా..
రాజ్ అమ్మ అపర్ణకు జ్వరం రావడంతో రెస్ట్ తీసుకో డాక్టర్ని పంపిస్తాను అని సుభాష్ చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. కళ్యాణ్ కవితలు చదువుతూ ఉండగా కావ్య వచ్చి నీ ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. ప్రతిసారి మీరు నన్ను ఫోన్ అడగడానికి ఇబ్బంది పడుతున్నారు కదా వదినా నేనే మీకు కొత్త ఫోన్ తీసుకువచ్చాను. అది తీసుకోని వస్తాను అని అంటాడు. కావ్య నాకా ఫోన్ వద్దు కళ్యాణ్ అత్తయ్య మనసు మారి నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చినప్పుడే తీసుకుంటాను, అని చెప్పి,కళ్యాణ్ ఫోన్ తీసుకొని స్వప్న కి కాల్ చేస్తుంది.

Nuvvu Nenu Prema: పద్మావతి ముందు అడ్డంగా దొరికిపోయిన కృష్ణ, పద్మావతి ఏం చేయనుంది…
స్వప్న, కావ్య ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయదు. కావ్య అప్పు కి కాల్ చేస్తుంది. స్వప్న కి ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. దీంతో చేసేది లేక స్వప్న కావ్య తో ఫోన్ మాట్లాడుతుంది. కావ్య, స్వప్నతో నిన్న నువ్వు రాజు ముందుకు రాకుండా, ఎందుకు వెళ్ళిపోయా, వచ్చినట్టయితేఈ సమస్యకు ఒక పరిష్కారం ఉండేది కద అని అంటుంది. దీంతో స్వప్న, నన్ను రాహుల్ ని శాశ్వతంగా విడగొట్టాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా, నీ మాటలు నేను నేను వినను, రాహుల్ ని దోషిగా చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నవ్, ఇంకెప్పుడూ నాకు కాల్ చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కావ్య మనసులో అక్క రాహుల్ ని పూర్తిగా నమ్ముతుంది అని అనుకుంటుంది.

రాజ్ దగ్గరకు ధాన్యలక్ష్మి వచ్చి, కావ్యను కావాలనినువ్వు వదిలించుకోవాలని,అను కొంటున్నావు కదా, మీరు మాట్లాడుకోవడం నేను చూశాను, నువ్వు కండిషన్ పెట్టటం, కూడా నేను చూశాను అని, నిజం చెప్పమని అడుగుతుంది. కావ్య ఏం తప్పు చేసింది, నువ్వు ఏమన్నా మీ అమ్మ ఎంత బాధ పెట్టిన భరిస్తుంది కదా, ఆస్తి లేదన్నమాట తప్ప కావ్య కు దుగ్గిరాల ఫ్యామిలీ కోడలు అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయని, చెప్తుంది. నువ్వు నిజం చెప్పకపోతే ఇంట్లో వాళ్లందరికీ చెప్పేస్తాను అని వెళ్లబోతుండగా, రాజ్ఇది నా పర్సనల్ విషయం అని, మీరెవరు నా విషయంలో కల్పించుకోవడానికి అని అంటాడు. దీంతో ధాన్యలక్ష్మి చాలా బాధగా రాజ్ తో, నేను నిన్ను నా సొంత కొడుకులా చూశాను కదా రాజ్, నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేను ఎవరు అని అంటున్నావు, సారీ రాజ్ఇంకెప్పుడూ నీ విషయంలో జోక్యం చేసుకోను అని, చెప్పి బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

రాజ్ అమ్మమ్మ గారు కావ్య ఆమె కి బాలేదని ఈరోజు పని అంతా నువ్వే చేయమని చెప్తుంది, పూజని ధాన్యలక్ష్మి చేస్తుందని చెప్తుంది. ధాన్యలక్ష్మి నా మనసేం బాలేదు అత్తయ్య నేను చేయను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ గారు కావ్య ని పూజ చేయమని చెప్తుంది. కావ్య,అపర్ణ గారికి నేను పూజ చేస్తే కోపం వస్తుంది అని నేను చేయను అని చెప్తుంది. అపర్ణకు నేను చెప్తాను నువ్వు చెయ్యి అని కావున ఒప్పిస్తుంది. కావ్య సరే అంటుంది. ఇక రుద్రాణి,అత్తా కోడల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక అవకాశం దొరికిందని భావిస్తుంది.
కావ్య పాలు తీసుకొని అపర్ణకి ఇవ్వడానికి తన రూమ్ కి వెళుతుంది. అపర్ణ కావ్య ని, అరిచి పంపిస్తుంది. కావ్య అపర్ణతోనా మీద కోపంతో, అన్నం మానేయడం ఎందుకని, నేను వెళ్ళిన తర్వాత పాలు పండ్లు తీసుకోండి అని చెప్పి రూమ్ లో పెట్టి వెళ్ళిపోతుంది.
ధాన్యలక్ష్మి రాజన్న మాటలకు బాధపడుతూ ఉంటుంది. కావ్య ధాన్యలక్ష్మి చూసి ఏమైందో అత్తయ్య అని అడుగుతుంది. నిజం చెప్పండి ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది. దాని లక్ష్మి నేను నిజాన్ని మాత్రమే దాస్తున్నాను కావ్య నువ్వు బాధని కోపాన్ని అన్నింటినీ దాస్తున్నావు ఎందుకు అని అడుగుతుంది. మీరిద్దరూ మాట్లాడుకోవడం కండిషన్ పెట్టుకోవడం నేను చూశాను అని చెప్తుంది. దీంతో కావ్య షాక్ అవుతుంది.
రేపటి ఎపిసోడ్లో రాజ్ ఆఫీస్ కి కావ్య రావడం, వాచ్మెన్ కావ్యను ఇన్సల్ట్ గా మాట్లాడడం,ఇవన్నీ రూమ్ లో నుంచి రాజ్ చూస్తాడు. కావ్య ని ఆఫీస్ లోనికి రానిస్తాడో లేదో, చూడాలంటే రేపటి దాకా ఆగాల్సిందే…