Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకి ఎంతో ఆసక్తికరంగా ముందుగు సాగుతుంది.ఈరోజు జరగబోయే 97 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూస్తే రాజ్ పిన్ని ధన్య లక్ష్మి కావ్య మరియు రాజ్ మాట్లాడుకున్న మాటలను విని రాజ్ తో ఎందుకు రా కావ్య పట్ల ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు రాజ్ మా భార్య భర్త విషయం లో కలిపించుకోవద్దు అని చెప్పేస్తాడు. ఇది ధన్య లక్ష్మీ మనసుని ఎంతో గాయపరుస్తుంది, ఆమె ఏడుస్తూ ఉండడం గమనించిన కావ్య , ఏమి జరిగింది అత్తయ్య అని అడగగా అప్పుడు ఆమె ఇదంతా చెప్పుకొని బాధపడుతుంది.చిన్నప్పుడు వాడు వాళ్ళ అమ్మ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ పెరిగాడు, నా కొడుకు కంటే కూడా నేను ఎక్కువగా రాజ్ ని ప్రేమించేదానిని, కానీ ఇప్పుడు వాడు ఎలా మాట్లాడాడో చూడు, ఎంతైనా నేను కన్న తల్లిని కాదు కదా అని చెప్పుకుంటూ బాధ పడుతుంది.

Brahmamudi: రాజ్ ని కావ్య విషయంలో నిలదీసిన ధాన్యలక్ష్మి..
అప్పుడు కావ్య ధన్య లక్ష్మి ని ఓదారుస్తూ రాజ్ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అత్తయ్య, అతనిది చిన్న పిల్లల మనస్తత్వం, కోపం లో ఒక మాట అనేస్తాడు తర్వాత బాధ పడుతాడు, అయినా అది మీ మీద ఉన్న కోపం కాదు, నా మీద ఉన్న కోపం.రాజ్ కి చిన్న పిల్లల మనస్తత్వం ఉండొచ్చు, కానీ వాడు చిన్నపిల్లోడు కాదు కదా, అనాల్సిన మాటలు అన్నీ అనేశాడు కదా అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క స్వప్న టిప్ టాప్ గా రెడీ అయ్యి రాహుల్ ని కలవడానికి వెళ్తుండగా,ఆమె అమ్మ కనకం గుమ్మం బయట కూర్చొని బొమ్మల్ని తుడుస్తూ కనిపిస్తుంది. ఆమెని చూసిన వెంటనే వామ్మో ఈమె ఉందేంటి, ఏమని చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఆమె వద్ద కి వెళ్లి అమ్మా నీకు ఎందుకు ఇలాంటి పనులు, ఈ బొమ్మ కి ఉన్న దుమ్ము ని తుడుస్తూ ఉంటె మీకు డస్ట్ ఎలర్జీ వస్తుంది, లోపలకు వెళ్లి వంటపండి చూడు అంటుంది. ఎన్నడూ లేని విధంగా కొత్తగా నా పనులు చేస్తా అంటున్నావ్ ఏంటి అని అడగగా, దానికి స్వప్న సమాధానం చెప్తూ కావ్య ఇంట్లో లేదు కదా అమ్మా ఉంటే ఆ పనులన్నీ తానే చేసేది అని అంటుంది.

Krishna Mukunda Murari: దాచాలనుకున్న నిజాన్ని తనే బయటపెట్టిన మురారి.! రేపటికి సూపర్ ట్విస్ట్
స్వప్న విచిత్రమైన ప్రవర్తన చూసి ఇది నిజంగానే మారిపోయిందా, లేదా ఏమైనా స్కెచ్ వేస్తుందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నాలుగది సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పేలోపు నిజంగానే మారిపోయి ఉంటుందేమో, చేసిన తప్పులన్నీ అర్థం అయ్యింది అనుకుంట అనుకోని లోపలకి వెళ్తుంది. ఆమె లోపలకి వెళ్లిపోయిన తర్వాత స్వప్న ఇంటి నుండి బయటకి వెళ్తుంది. మరోపక్క కావ్య ఇంట్లో తెల్లవారుజామున నిద్ర లేచి గణపతి కి పూజలు చెయ్యడం చూసి ఇంట్లో ఉన్నవాళ్ళంతా నిద్ర లేచి అక్కడికి వస్తారు. అందరూ భక్తి తో హారతి తీసుకుంటే, అపర్ణ మాత్రం కావ్య ని కోపం గా చూస్తూ హారతి తీసుకోవడానికి నిరాకరించి, ఇది చూసిన తర్వాత అపర్ణ తన అత్తయ్య ని ప్రశ్నిస్తూ ఇంకెందుకు ఆలస్యం ఇంటి తాళాలు కూడా కావ్య చేతికే ఇచ్చేయండి, పూజ గదిలోకి మీ తర్వాత నేను తప్ప ఎవ్వరూ అడుగుపెట్టలేదు, ఆస్తిని నీ వాటికి రాయించుకున్నట్టు, పూజ గది కూడా నీ వాటికి రాయించుకున్నావా అని రుద్రాణి అపర్ణ ని ప్రశ్నిస్తుంది. అప్పుడు అపర్ణ కోపం తో నువ్వు పాత పగని మనసులో పెట్టుకొని,ప్రతి విషయం లో జోక్యం చేసుకుంటున్నావ్, అందరి నిజస్వరూపాలు బయటపెట్టి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను అంటుంది.

Nuvvu Nenu Prema: పద్మావతి ముందు అడ్డంగా దొరికిపోయిన కృష్ణ, పద్మావతి ఏం చేయనుంది…
అపర్ణ మాట్లాడుతూ పూజ గదిలోకి ఈ కావ్య అడుగుపెట్టడానికి ఎంత ధైర్యం, ఈమెకి ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అని అడగగా అపర్ణ అత్తయ్య నీకు వీలు పడలేదని నేనే పూజ చెయ్యమని చెప్పాను అని అంటుంది. అప్పుడు అపర్ణ కోడలుగా నేను మీ మాటని ఎప్పుడు జవదాటలేదు,అలాంటప్పుడు మీరు కూడా నా మాట గౌరవించాలి గా, మీరు నన్ను గౌరవించకపోతే కొత్తగా వచ్చిన ఇలాంటోళ్ళు నన్ను ఎలా గౌరవిస్తారు అని అంటుంది.

ఇలా పూజ గదిలోకి అడుగుపెట్టినందుకు గొడవ చేస్తూ ఉన్న అపర్ణ ని నిలదీస్తూ కావ్యకి మద్దతుగా ధన్య లక్ష్మి మాట్లాడుతుంది. ఒక్కసారి కోడలు చేసుకున్నాక ఏంటి ఈ షరతులు ఇల్లు అన్న తర్వాత అది వంట గది అయినా, పూజ గది అయినా ఒక్కటే అని అంటుంది. కొద్దిగా మానవత్వం చూపించండి నీకు మీ అబ్బాయికి దండం పెడతాను అంటుంది. అప్పుడు అపర్ణ చూసారా ప్రతీ ఒక్కరికి అవకాశం ఇస్తే ధాన్య లక్ష్మి దగ్గర కూడా నేను అలుసు అయిపోయాను, ఇక ఎప్పుడూ ఆమెని పూజ గదిలోకి పంపకండి అత్తయ్య అని అంటుంది అపర్ణ. మరోపక్క అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ వద్దకి వస్తారు, టిఫిన్ నోట్లో పెట్టుకోగానే రాజ్ ఏంటిది ఇలా చేసావ్, మొత్తం ఉప్పగా ఉంది అని కావ్య ని తిడుతాడు. అందరూ టిఫిన్ బాగా చేయనందుకు కావ్య ని తిడుతారు, కానీ అలా టిఫిన్ ని పాడు చేసింది రుద్రాణి అనే విషయం ఎవరికీ తెలియదు. రాజ్ ఆకలితో వెళ్లిపోవడాన్ని చూసి అపర్ణ బాగా బాధపడుతుంది. మరోపక్క స్వప్న ఇంట్లో లేని విషయాన్నీ అప్పు పసిగడుతుంది, దీనికి మోసం చెయ్యడం అలవాటు అయిపోయింది ఇంటికి రానివ్వు దీని సంగతి తేలుద్దాం అని అప్పు మరియు కనకం అనుకుంటూ ఉంటారు, అక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.