Brahmamudi Serial మే 17th ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ విజయవంతంగా 97 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని 98 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ 98 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. తన కారణం గా రాజ్ ఆకలి తో ఏమి తినకుండా ఆఫీస్ కి వెళ్లిపోయాడని, అతని కోసం వేడి వేడిగా టిఫిన్ తయారు చేసి ఆఫీస్ కి వెళ్లి ఇవ్వడానికి బయలుదేరుతుంది. అక్కడ రాజ్ తన క్లైంట్స్ తో డిజైన్ గురించి ఫోన్ మాట్లాడుతూ టెన్షన్ టెన్షన్ గా ఉంటాడు. మరో పక్క ఆకలి గా కూడా ఉంటూ, బయట ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏమి ఆయిల్ వాడుతారో అని భయపడి ఆర్డర్ చెయ్యాలా వద్ద అనే సందిగ్ధం లో ఉంటాడు. ఈలోపు కావ్య క్యారేజీ బాక్స్ తో ఆఫీస్ వద్దకు రావడం గమనిస్తాడు రాజ్.

Brahmamudi: పూజ గదిలోకి కావ్య ని పంపినందుకు అత్తయ్య కి చివాట్లు పెట్టిన అపర్ణ
అక్కడ సెక్యూరిటీ కావ్య ని ఆపుతారు, లోపలకి వెళ్ళడానికి ఐడెంటిటీ చూపించమంటారు, కావ్య నేను మీ సార్ భార్య ని అని చెప్తే నవ్వుతారు. మా సార్ భార్య వి అయితే కార్ లో కాకుండా ఆటో లో ఎందుకు వచ్చావు, మా సార్ భార్య నీ నాలాంటి చీరలు కట్టడు.మా సార్ భార్యవి అంటున్నావ్ కదా , ఆయనతో ఫోన్ చేసి మాట్లాడు ఒకసారి అంటారు, అప్పుడు కావ్య నా దగ్గర ఫోన్ లేదు అంటుంది.కనీసం ఫోన్ కూడా లేదంట అంటూ వెక్కిలి నవ్వులు నవ్వుతూ మీరు మా సార్ భార్య అంటే మేము నమ్మము అంటూ కావ్య ని అవమానిస్తారు. ఇదంతా గమనించిన రాజ్ కావ్యాన్ని అవమానించినందుకు మందలించి వాళ్ళని ఎండలో నిలబడి డ్యూటీ చెయ్యమని ఆదేశిస్తాడు.అప్పుడు రాజ్ వెంటనే కావ్యా ని తన కార్ లో ఎక్కించుకొని షాపింగ్ కి తీసుకెళ్లి మంచి చీర కొనివ్వాలని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema: మరో సారి తన అక్క మీద అమితమైన ప్రేమను చూపిన విక్కీ…
కార్ లో ఆకలి తో ఉన్న రాజ్ కావ్య చేసుకొచ్చిన పెసరట్టు ఉప్మా గుమగుమల వాసన చూసి టెంప్ట్ అవుతూ ఉంటాడు . అప్పుడు కావ్య దానిని వర్ణిస్తూ చెప్పడం తో ఆకలి రెప్పింపు అవుతుందే అని మనసులో అనుకుంటూ , పైకి మాత్రం ఇక ఆపవా నీ సోది అంటాడు.అలా కాసేపు కావ్యతో గిల్లికజ్జాలు ఆడుతుండగా షాపింగ్ మాల్ వచ్చేస్తుంది. దిగగానే బయట దేనికోసం వచ్చాము మనం అని అడుగుతుంది కావ్య, దానికి సమాధానం చెప్పాడు రాజ్, నువ్వు చెప్పకపోతే నేను రాను అని మారం చేస్తుంది కావ్య, అప్పుడు రాజ్ రోడ్డు మీద ఏమిటి ఈ రచ్చ అంటూ కావ్య ని చేతులు పట్టుకొని లోపలకు తీసుకెళ్తాడు.తనకి చీరలు కొనివ్వడానికి ఇక్కడకి రాజ్ తీసుకొచ్చాడు అనే విషయం తెలిసి ఆశ్చర్యపోతుంది కావ్య.

ఇది కలా నిజామా ఒకసారి గిల్లండి అని రాజ్ ని అంటుంది కావ్య, రాజ్ గట్టిగా గిల్లడం తో నొప్పితో అరుస్తుంది కావ్య, ఇంత కసితో గిల్లారంటే ఇది కల కాదు నిజమే అని అంటుంది కావ్య. నచ్చిన చీరని కట్టుకొని బయటకి వచ్చిన కావ్య ని చూసి మైమర్చిపోతాడు రాజ్. మరోపక్క మొదటిసారి తన మీద ఇంత ప్రేమ చూపించినందుకు మురిసిపోతుంది. ఇంకా నువ్వు ఎప్పుడు బయటకి వెళ్లినా, ఆఫీస్ వచ్చినా ఇలాంటి ఖరీదైన చీరలు కట్టుకొనే బయటకి రావాలి అంటాడు రాజ్. మరో పక్క స్వప్న రాహుల్ కోసం ఎదురు చూస్తూ రాజ్ మరియు కావ్య ఉన్న షాపింగ్ మాల్ కి వస్తుంది, రాహుల్ కూడా అప్పుడే స్వప్న ని కలవడానికి వస్తాడు. రాజ్ రావడాన్ని గమనించిన రాహుల్ స్వప్న ని తీసుకొని వెళ్ళడానికి చూస్తాడు. ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో స్వప్న కి మనం పెళ్లి చేసుకోవడం కుదరదు, మీ అక్క రాజ్ కి లేని పోనివి కల్పించి చెప్పింది అని స్వప్న ని రెచ్చగొడుతాడు, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే.