Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రస్తుతం ఉన్న అన్నీ అన్నీ సీరియల్స్ కంటే రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకి దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఈ సీరియల్ విజయవంతంగా 99 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది, ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.అనుకోకుండా స్వప్న మరియు రాహుల్ , కావ్య – రాజ్ ఉన్న షాపింగ్ మాల్ కి వస్తారు. అక్కడ రాహుల్ రాజ్ ని చూసిన వెంటనే స్వప్న ని లాకొచ్చి కార్ లో కూర్చోపెట్టుకుంటాడు. అప్పుడు స్వప్న రాజ్ ని చూసి మన విషయం మొత్తం చెప్పేద్దాం , ఇంకా ఎన్ని రోజులు ఇలా దొంగలుగా బ్రతకాలి అని అంటుంది.మీ అక్క నీ జీవితాన్ని నాశనం చెయ్యడానికే చూస్తుంది, రాజ్ ని మనల్ని ఇరికించడానికి ఇక్కడికి తీసుకొచ్చింది అని అంటాడు.

మరోపక్క రుద్రాణి మన పరువు పోయి పేపర్స్ లోకి ఎక్కబోతుంది,కొత్త కోడలు ఇంట్లో లేదు అని అపర్ణ తో అంటుంది. అప్పుడు వెంటనే ధాన్య లక్ష్మి అపర్ణ ని నిలదీస్తూ నీ వల్లే వెళ్ళిపోయింది, ఈరోజు పూజ గదిలోకి అడుగుపెట్టినందుకే రాద్ధాంతం చేసావు, చివరికి తన భర్త బెడ్ రూమ్ కి వెళ్ళడానికి కూడా నీ అనుమతి కావాలి,ఇలాంటివి భరించలేకనే వెళ్ళిపోయింది, మేము అలవాటు పడినట్టు నీ అధికారానికి ఆ అమ్మాయి ఇంకా అలవాటు పడలేదు అక్కా అంటుంది. అప్పుడు అపర్ణ కోపం తో పైకి లేచి అపర్ణ అని అరుస్తుంది. అప్పుడు అత్తయ్య మధ్యలో కల్పించుకొని ‘ధాన్య లక్ష్మి ని నిలదీస్తూ ఏ రోజు నీ పై అపర్ణ అధికారం చూపించింది, ఇప్పటికి వదిలేస్తున్నాను, ఇంకోసారి అపర్ణ గురించి అలా మాట్లాడకు’ అని అంటుంది. ఇంతకీ కావ్య ఎక్కడికి వెళ్లినట్టు,ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్లిందా అని రుద్రాణి ఇంట్లో అందరినీ టెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తుంది.

మరోపక్క రాజ్ తన కంపెనీ లో ఉద్యోగి సరైన డిజైన్స్ తయారు చెయ్యలేదని మండిపడుతుంటాడు, అప్పుడు కావ్య కల్పించుకొని ఏది ఒక్కసారి నాకు ఇలా ఇవ్వు అని అంటుంది. రాజ్ నీకు ఎందుకు అదేమన్నా మీ ఇంటి ముందు వేసే ముగ్గులు అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు కావ్య అవునా నాకు తెలీదులే అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఇక టిఫిన్ వడ్డించేదా అని అంటుంది.సరే వడ్డించు అంటాడు రాజ్, అలా సరదాగా సాగిపోతుంది.ఇక మరో వైపు రాహుల్ స్వప్న కి కావ్య పై ఇష్టమొచ్చినట్టు చెప్పేస్తాడు, నా ప్లాన్ మొత్తం నాశనం చేసావు మన పెళ్లి పెటాకులు చేసావు అంటూ రాహుల్ స్వప్న పై విరుచుకుపడుతాడు. అప్పుడు స్వప్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ రాహుల్ అనగా నిజమే చెప్తున్నాను, మన పెళ్లి ఇక ఎప్పటికీ జరగదు అంటాడు.తొందరపడి నువ్వు చేసిన పని వల్ల మా ఇంట్లో ఉన్న వాళ్లందరికీ మన విషయం తెలిసిపోయింది.ఎప్పటికైనా తెలియాల్సిందే కదా రాహుల్, తెలియని అంటుంది స్వప్న.నేను చెప్పడం వేరు, మనం రహస్యం గా కలుసుకొని దొరికిపోవడం వేరు అని అంటాడు రాహుల్.నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ మరు క్షణమే ఆ ఇంటికి నాకు సంబంధం తెగిపోయినట్టే అని తెగేసి చెప్పారు, రాజ్ నన్ను ఒక మోసగాడిలా చూస్తున్నాడు, ఎవరు నన్ను నమ్మడం లేదు అని స్వప్న కి లేని పోనివి చెప్పేసి భయపెడుతాడు రాహుల్.దీనికి మొత్తం కారణం కావ్య, నీతో ప్రేమగా ఉంటూనే నీ వెనుక గోతులు తవ్వింది, నీ గురించి రాజ్ కి ఉన్నవి లేనివి చెప్పింది అని అంటాడు.

మన పెళ్లికి అందరూ ఒప్పుకున్నా నీ చెల్లెలు అడ్డుపడుతుంది, మా ఇంట్లో నీకు అందరికంటే పెద్ద శత్రువు మీ చెల్లెలు కావ్యనే అని స్వప్న ని బాగా రెచ్చగొడుతాడు.ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమో లో స్వప్న కావ్య ని పిలిపించి ‘రాహుల్ కి నాకు పెళ్లి జరగకుండా ఉండేందుకు నువ్వు ఎత్తులు వేసిన నేను పైఎత్తులు వేస్తాను’ అని అంటుంది. అప్పుడు కావ్య నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అక్కా అంటుంది, నేను ఆ ఇంటికి వస్తే నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు అందుకే ఇలా చేస్తున్నావు అని నిలదీస్తుంది స్వప్న , తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.