Brahmamudi Serial మే 19th 100 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రతి రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ సీరియల్ ఇప్పుడు వందవ ఎపిసోడ్ కి చేరుకుంది. ఈ 100 వ ఎపిసోడ్ లో రాహుల్ స్వప్న తో మన పెళ్లి జరగదు, మా దుగ్గిరాల కుటుంబం చిన్న పొరపాటు జరిగిన ఒప్పుకోరు అని అంటాడు. అప్పుడు స్వప్న ప్రతీ ప్రేమ జంటకి ఎదో ఒక సమస్య ఉంటుంది, వాటిని పరిష్కరించుకొని ముందుకి సాగాలి కానీ, విడిపోవడం పరిష్కారం కాదు అని అంటుంది.నిజమే ప్రతీ ప్రేమ జంటలో విలన్స్ ఉంటారు, కానీ మన ప్రేమ జంటలో మీ చెల్లి విలన్, ఆమె ఉన్నంత కాలం మన పెళ్లి జరగదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీనికి మొత్తం కారణం కావ్య అన్నమాట, మంచి దానిగా నటిస్తూ వెనుక చేరి ఇన్ని గోతులు తవ్వుతుందా, నేనేం ద్రోహం చేశా నీకు, నా జీవితాన్ని నాశనం చేస్తున్నావ్ అని అనుకుంటూ ఉంటుంది స్వప్న.

Brahmamudi: స్వప్న కి కావ్య గురించి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టిన రాహుల్.. తర్వాత ఏమైందంటే!
ఇది ఇలా ఉండగా సరిగ్గా అప్పుడే ఇంటికి ఆటో లో వెళ్తున్న కావ్య షాపింగ్ మాల్ వద్ద ఇవన్నీ ఆలోచిస్తూ నిల్చున్న స్వప్న ని చూసి ఆమె తో మాట్లాడడానికి అక్కడికి వస్తుంది.కావ్యని చూడగానే స్వప్న వచ్చేసావా రాజ్ ని తీసుకొని రాలేదా ఈసారి అని అంటుంది. రాజ్ ఇప్పుడు ఎందుకు వస్తారు అక్క, తనకి ఆఫీస్ ఉంటుంది కదా. అప్పుడు స్వప్న మంచిగా ఉన్నట్టు నటిస్తూ నా వెనుక ఎన్ని గోతులు తవ్వుతున్నావే, నేను నీ కంటే అందంగా ఉంటాను , తెలివిగా ఉంటాను ఎక్కడ నిన్ను డామినెటే చేస్తానో అని భయపడి నన్ను ఆ ఇంటికి కోడలిగా రానివ్వకుండా చెయ్యడానికి ఎంతో ప్రయత్నిస్తున్నావు , ఎన్నో ఎత్తులు ఇస్తున్నావు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా పై ఎత్తులు వేసి నీకు దెబ్బకి దెబ్బ తీస్తాను అని సవాలు విసురుతుంది. అప్పుడు కావ్య స్వప్న ని నచ్చచెప్పాలని ఎంతో ప్రయత్నిస్తుంది కానీ, స్వప్న మాత్రం రాహుల్ తన బుర్రలో ఎక్కించిన ఆలోచనల మత్తులో కావ్య ని నోటికి వచ్చినట్టు తిట్టేస్తుంది.

Krishna Mukunda Murari: మురారిని బెదిరించిన ముకుందకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ..
అప్పుడు కావ్య ఏమిటి స్వప్న ఇలా మాట్లాడుతుంది.. ఓహో ! ఇదంతా రాహుల్ గాడి పన్నాగం అన్నమాట, నా మంచి తనాన్ని చేతకాని తనం గా తీసుకున్నావుగా నీకు చుక్కలు చూపిస్తా ఆగు అని కావ్య మనసులో అనుకుంటుంది.మరోపక్క స్వప్న ఇంటికి రాగానే ఆమె తండ్రి స్వప్న బట్టలను బయటకి విసిరి, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక మా ఇంట్లో నీకు స్థానం లేదు, ఇలా చెప్పకుండా బయటకి వెళ్లి కొంపలు కూల్చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు స్వప్న నేను ఏ తప్పు చెయ్యలేదు నాన్న, ఇప్పుడు నేను ఏ గుడిలో తలదాచుకోను?, అని అంటుంది.నీలాంటి పాపాత్మురాలికి గుడిలో కూడా స్థానం ఉండదు వెళ్లి బయటకి అని కనకం అంటుంది.వీళ్లకు నచ్చచెప్పి స్వప్న ని లోపలకు తీసుకొని రమ్మని పెద్దమ్మ కనకం మరియు ఆమె భర్త ని బ్రతిమిలాడుతుంది.పెద్దమ్మ మాటలను విని ఈ ఒక్కసారి దీనిని లోపలకు రానిస్తాను, కానీ ఇది మళ్ళీ తప్పు చేస్తే ఇంటి నుండి నువ్వే మెడ పట్టుకొని బయటకి గెంటేయాలి అంటుంది.లోపలకు వెళ్తూ స్వప్న కనకం వద్దకి వచ్చి నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నీ కూతురు కావ్యనే, నేను అక్కడికి వెళ్తే నీ కూతురు ఇక్కడకి వస్తుంది , దాని స్థానం ఇదే అని అంటుంది. కావ్య గురించి అలా మాట్లాడినందుకు స్వప్న చెంప పగలగొడుతుంది.

లోపలకు రమ్మన్నాము అని నీ బుద్ధి చూపిస్తున్నావు కదే, కావ్య గురించి తప్పుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తా అని అంటుంది కనకం. ఇది కావ్య మీద అసూయ చూపిస్తుంది, దీనిని వెంటనే వదిలించుకోవాలని స్వప్న కి పెళ్లి సంబంధం చూసి బయటకి పంపేయాలి అనుకుంటుంది కనకం.మరో పక్క కావ్య ఇంటికి తిరిగి రాగానే ఇది మర్యాదస్తులు ఉండే కుటుంబం, ఇలా చెప్పాపెట్టకుండా బయటకి వెళ్ళడానికి వీలు లేదు అంటూ కావ్య ని మందిలిస్తుంది.మరోపక్క స్వప్న భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తల్లితండ్రులు బాధపడుతూ ఉంటారు. దానికి రేపు వచ్చే సంబంధం కుదిరితే పెళ్లి చేసి స్వప్న జీవితాన్ని బాగు చెయ్యాలనే ఆలోచనలో ఉంటారు తల్లితండ్రులు. తదుపరి ఎపిసోడ్ ప్రోమో లో రాజ్ ఇంట్లో ఉండే రుద్రాణి ఎందుకు స్వప్న కి రాహుల్ కి మనం పెళ్లి చెయ్యకూడదు అని అంటుంది. తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.