Brahmamudi Serial మే 20 ఎపిసోడ్: బ్రహ్మముడి నిన్నటి ఎపిసోడ్‌లో రాహుల్ చెప్పుడు మాటలు విని కావ్యపై రెచ్చిపోయింది స్వప్న. ఎలాగైనా తాను దుగ్గిరాల ఇంటి కోడలిగా వస్తానని, అప్పుడు నీ సంగతి చూస్తానంటూ సవాల్ చేస్తుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన స్వప్నకు కనకం, కృష్ణమూర్తి,ఇంట్లో నుంచి బయటకుపోవాలని లగేజ్ బయటపడేశారు. అయితే మీనాక్షి నచ్చజెప్పడంతో ఇంట్లోకి రాణిస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో, కావ్య,రాజ్ గురక పెడతాడు అనే విషయాన్ని వీడియో తీసి మరీ రుజువు చేస్తుంది. ఇలా మనుషుల గురక ఎక్కడైనా ఉంటుందా, మీకు అసలు గురకే రాదన్నారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఏమంటారు, జూలో యానిమల్స్ కి మీ గురక కి ఏమన్నా డిఫరెంట్ ఉందా, రోజు నేను ఎంత సఫర్ అవుతున్నాను ఇప్పటికైనా అర్థమైందా అని కావ్య అంటుంది.
Brahmamudi Serial Today Episode May 20: Brahmamudi Serial మే 20 ఎపిసోడ్

రాజ్ ఏదో అలసిపోయి గురక పెట్టి ఉంటాను,ఏదో దానికి నువ్వు సీక్రెట్ ఆపరేషన్ చేసినట్టు తెగ ఫీల్ అవుతున్నావ్ ఏంటి, అయినా రోగి ని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అని ఒక పెద్ద హీరో అన్నారు తెలుసా అని రాజ్ అంటాడు. అయ్యో రాజ్ గారు నేను మిమ్మల్ని ఏమనట్లేదండి మీరు గురక పెడతారన్న విషయాన్ని ఒప్పుకోండి అంటుంది కావ్య. రాజ్ రెండు రోజుల్లో గురక మానేస్తాను అని చాలెంజ్ చేస్తాడు కావ్యతో, కావ్య చెవిలో దూది పెట్టుకుని,పడుకుంటుంది.

ఇక డాక్టరు రాజ్ వాళ్ళ ఇంటికి వస్తాడు, డాక్టర్ ని చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు, డాక్టర్,డాక్టర్ అంటూ ఒకరి తర్వాత ఒకరు అందరూ డాక్టర్ని చూసి షాక్ అవుతూ అడుగుతుంటారు. నన్ను రాజ్ రమ్మన్నాడండి అని చెప్పి డాక్టర్ అంటాడు. రాజ్ నీ వెంటనే రమ్మనండి అని అంటాడు డాక్టర్. కావ్య వెళ్లి రాజు తో డాక్టర్ వచ్చారు అని చెప్తుంది. రాజ్ వెంటనే అమ్మో డాక్టర్ వీళ్ళకి గురకపెట్టే విషయం చెప్తే అందరికి తెలిసిపోతుంది అని హడావిడిగా కిందకు వస్తాడు. డాక్టర్ కరెక్ట్ గా రాజ్ గురక పెడతాడు అని చెప్పే టయానికి రాజ్ అరుస్తూ వచ్చి డాక్టర్ మీరు ఏ విషయం చెప్పద్దు. మీరంతా కంగారు పడకండి డాక్టర్ని డైట్ కంట్రోల్ కోసం పిలిచాను జస్ట్ త్రీ కేజీ పెరిగా నేను అంతే అని డాక్టర్ని పైకి తీసుకెళ్తాడు. కావ్య మాత్రం మనసులో ఇంత కంగారు పడుతున్నాడు ఏంటి? ఏమయింటుందో అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజ్ డాక్టర్ నీ పైకి తీసుకెళ్లి తన రూమ్ లోకి కూర్చోబెట్టి, డాక్టర్ చిన్న గురక సమస్య అని ఇంట్లో వాళ్లకు చెప్పలేదా అని అడుగుతాడు. రాజ్ డాక్టర్ మాట్లాడుకోవడం కావ్య రూమ్ బయట నుంచి చూస్తుంది. రాజ్ నేను అంతకుముందు గురక పెట్టడం వల్ల మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు ఆ విషయం నాకు తెలియదు, ఇప్పుడు నేను గురక పెట్టడం వల్ల ఇంకో మనిషి ఇబ్బంది పడటం నాకు రాత్రి అర్థమైంది. దీనికి మందులు ఏమైనా ఉంటాయా ఇది సాల్వ్ అవుతుందా అని రాజ్ డాక్టర్ని అడుగుతాడు. డాక్టర్ గారు కొన్ని మందులు సూచించి కొన్ని సూచనలు చేస్తారు. కావ్య ఈయన మంచోడే కానీ కొంచెం మొండోడు అని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari: మురారిని బెదిరించిన ముకుందకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ..
ఇక స్వప్నకి పెళ్లి చూపులు చూడ్డానికి పెళ్లి వారి ఇంటికి వస్తారు. కనకం వారందరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. పెళ్లి వారంతా అప్పుని చూసి మాకు కావాల్సింది అబ్బాయి కాదండి అమ్మాయి అని అంటారు. కనకం వెంటనే పెళ్లి వారితో స్వప్న గురించి మీరు అంతా తెలిసి కూడా అని అనబోతూ ఉండగా, మీనాక్షి కనకం నేను స్వప్న గురించి వాళ్ళకి ఏం చెప్పలేదు నువ్వు అరవబాకు అని అంటుంది. కనకం వెంటనే చెప్పలేద నువ్వు అని పెద్దంగా అరుస్తుంది. పెళ్లి వారి వెంటనే ఏం చెప్పలేదు ఏంటి అని అడుగుతారు, ఇద్దరు కలిసి ఏదో కవర్ చేసి పెళ్లి వాళ్ళని మభ్యపెడతారు.

మీనాక్షి పెళ్ళికొడుకు ని ఇది మొదటి పెళ్లి చూపులేనా అని అడుగుతుంది. లేదండి ఇది రెండో పెళ్లి చూపులు అని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ చెబుతుంది. మొదటిది ఎందుకు వద్దనుకున్నారు అని మీనాక్షి అడుగుతుంది. మొదటిసారి సంబంధం అమ్మాయి ఎవరితోనో తిరిగి వచ్చిందట, అందుకని వద్దనుకున్నామండి అని చెప్తుంది. దీంతో మీనాక్షి కనకం ఇంట్లో వాళ్లంతా బిత్తర పోయి చూస్తూ ఉంటారు. కనకం వెంటనే నిజం చెప్పేస్తే మంచిదేమో అక్క చెబుదామా అని అంటుంది. ఏంటండీ ఏదో చెప్పాలంటున్నారు అని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అడుగుతుంది. వాళ్లు అమ్మాయిని చూపించండి ముందు అని అంటారు. దీంతో కనకం స్వప్న దగ్గరికి వచ్చి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అని అంటుంది. స్వప్న అమ్మ నేను ఇప్పుడు ఈ పెళ్లికి రెడీగా లేను అంటుంది. కనకం ఫైనల్ గా నువ్వు ఈ పెళ్లి చూపులకు రావాల్సిందే అని, లేదంటే కట్టు బట్టలతో బయటకు వెళ్లి అని బెదిరిస్తుంది. ఇంటి పరువు తీయకముందే నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నావ్ అని కనకం చెబుతుంది. స్వప్న సారీకి బ్లౌజ్ మ్యాచ్ అవ్వట్లేదు అమ్మ చూడు అని చెప్తుంది. కనకం ఫోన్ పక్కన పెట్టి బ్లౌజ్ కోసం వెతుకుతూ ఉంటుంది. స్వప్న ఇదే తడువుగా ఫోన్ తీసుకొని, నెంబర్ ని సేవ్ చేసుకుంటుంది.

తన ఫ్రెండ్ కూతురి తో సహా ఇంటికి వస్తుందని అమెరికా నుంచి వస్తుందని చెబుతుందిఅపర్ణ.ఇక్కడే ఉంటారు ఉన్నన్ని రోజులు మనమే చూసుకోవాలి అని చెప్తుంది అపర్ణ. రాజ్ తాతగారు వాళ్లని రాజ్ చూసుకుంటాడు అని చెప్తారు. ఈలోపు రుద్రాణి, రాహుల్ వాళ్ళని చూసుకుంటాడు అని చెప్తుంది. అరుంధతికి కూతురు ని మన రాహుల్ కిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతుంది. వెంటనే అపర్ణ రాహుల్ కిమ్మని అడుగుదామా, అడగడం కాదు వదిన నువ్వే ఒప్పించాలి. రాహుల్ ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలి నేను అని అంటుంది అపర్ణ. కుటుంబ సభ్యులంతా రాహుల్ కి ఏ పని లేదని పిల్లని ఇవ్వరు అన్నట్టు మాట్లాడతారు. రుద్రాణి మాత్రం రాజ్ తర్వాత ఇంట్లో పెద్దవాడు రాహుల్ అయితే రాహుల్ కి ఇవ్వకుండా, కళ్యాణ్ కి పెళ్లి చేయడం ఏంటి అని అంటుంది రుద్రాణి. అమ్మమ్మ గారు ఆలు లేదు చూలు లేదు అసలు వాళ్ళు రాకముందే మీలో మీరు ఎందుకు గొడవ పడతారు అని అపర్ణ ని, రుద్రనిని ఆపుతుంది. మీరు ఎలాగైనా నా కొడుకుకి సంబంధం కుదిరించాలి అని గట్టిగా చెప్తుంది రుద్రాణి. అపర్ణ ధాన్య లక్ష్మీ ఇద్దరు రూమ్ లోకి వెళ్లిపోతారు. రుద్రాణి ఏంటి తోడికోడలు ఇద్దరు వెళ్లిపోతారు ఎవరికి పట్టనట్టు, నా కొడుకు పెళ్లి జరిగి తీరాల్సిందే అని అంటుంది. ఇంట్లో అందరూ వెళ్లిపోతారు.

రుద్రాణి ఆలోచిస్తూ వుండగా రాహుల్ అక్కడికి వచ్చి ఏమైంది మమ్మీ అని అంటాడు. ఇప్పుడు ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలుసా అంటుంది. రాహుల్ తెలుసునా తెలుసు రూప అంతా చెప్పింది అంటాడు. 1000 కోట్ల ఆస్తిపరాలను చేసుకుంటే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించు రాహుల్ నువ్వు ఎటువంటి పిచ్చి వేషాలు వేయకు అని రుద్రని చెప్తుంది. ఎలాగైనా నీకు ఈ సంబంధం కుదిరేటట్టు చేస్తాను అని రుద్రాణి రాహుల్ చెప్తుంది.రాహుల్ సరే అంటాడు. రేపటి ఎపిసోడ్లో కావ్య దగ్గర రాజ్ మాట తీసుకుంటాడు. మీ అక్క లాంటి మనిషి మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు, మాట ఇచ్చావు మర్చిపోవద్దు అని రాజ్ కావ్య దగ్గర స్వప్న ఈ ఇంటి కోడలు అవ్వకూడదు అని దానికి నీ సహకారం ఉండకూడదని మాట తీసుకుంటాడు… అక్కడ స్వప్న మాత్రం పెళ్లి చూపులుకి దగ్గర కూర్చున్నా కూడా దుగ్గిరాల వాళ్ళింటి కోడల్ని అవ్వాలి అని మనసులో గట్టిగా అనుకుంటుంది. చూడాలి కావ్య, మాట ఇచ్చి ఇరుక్కుపోయినందుకు ఏం చేస్తుందో……