NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: స్వప్నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కావ్య.. ఒక్కడివే రావాలని షరతు పెట్టిన అపర్ణ..

Brahmamudi Serial 21 April 2023 today 76 episode highlights
Share

Brahmamudi: స్వప్న ఏదొక విధంగా మళ్లీ ఇంట్లో తిష్ట వేసింది.. ఇక రాజ్ కు దగ్గరైయ్యే ప్రయత్నం చేస్తుంది.. ఎలాగైనా విడగొట్టాలని ఆలోచిస్తుంది.. ఇక కావ్య తన భర్త గురించి ఆలోచిస్తుంది.. అలా రాత్రింతా బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటుంది..కృష్ణమూర్తి అది చూసి రాత్రంతా నిద్రపోలేదా అని అడుగుతాడు. నేను ఇలా చేయకపోతే ఒక పది రోజులు రాత్రుల పాటు మీకు ఏమి ఉండదని బాధగా చెప్తుంది. అంత గొడవ జరిగినా కూడా ఇంత అందంగా ఎలా వేయగలిగావు చెయ్యి తొణకలేదా అంటాడు. అదే కళాకారుల గొప్పదనం అంటుంది. రాత్రి జరిగిన దానికి మీ ఆయన నిన్ను దోషిగా చేయలేదా అని అడుగుతాడు. అంటుకుంది కానీ దాన్ని పోగొట్టుకుంటానని ధైర్యం చెప్తుంది.

Brahmamudi Serial 21 April 2023 today 76 episode highlights
Brahmamudi Serial 21 April 2023 today 76 episode highlights

Krishna Mukunda Murari: ఈ పెళ్లోద్దన్న నందిని మురారి ఆపెస్తాడా.? కృష్ణ గౌతమ్ నందిని పెళ్లి చేసిందా.? సూపర్ ట్విస్ట్..
రాహుల్ రాజ్ కి ఫోన్ చేస్తాడు. నేను ఎక్స్ పెక్ట్ చేసింది జరిగింది రాత్రి స్వప్న ఇక్కడికి వచ్చిందని అనగానే షాక్ అవుతాడు. కావ్య స్వప్నని బయటకి పంపించిందని నువ్వు చెప్పింది కరెక్ట్ అంటాడు..అయితే కావ్యను అక్కడే వదిలేసి వస్తున్నావా అంటాడు..లేదు తీసుకొస్తున్నాను అందుకు వేరే కారణం ఉందిలే అంటుండగా స్వప్న వచ్చి పిలుస్తుంది. డోర్ బయట నిలబడమని చెప్తాడు.. ఇక స్వప్న నీకు చాలా అన్యాయం జరిగింది నేను వెళ్ళిపోవడం అవకాశంగా తీసుకుని కావ్య బెన్ఫిట్ పొందింది. అది నేను మీ చెల్లి తేల్చుకుంటాం మధ్యలో నీ ఎనాలసిస్ అవసరం లేదు.. నేను వెళ్లిపోతే పెళ్లి ఆగిపోతుందని అనుకున్నా కానీ కావ్యని పెళ్లి చేసుకుంటారని అనుకోలేదు.. మీ చెల్లి మోసం చేసిందని బయట పడితే శిక్ష అనుభవిస్తుంది కానీ నువ్వే మోసం చేశావని తెలిస్తే దుగ్గిరాల వారసుడిని ఎందుకు మోసం చేశానా అని జీవితాంతం బాధపడేలా చేస్తాను అప్పటి వరకు నీ చెల్లి గురించి చెడుగా చెప్పే అర్హత నీకు లేదు వెళ్ళు అని రాజ్ స్వప్నకు వార్నింగ్ ఇస్తాడు..

Brahmamudi Serial 21 April 2023 today 76 episode highlights
Brahmamudi Serial 21 April 2023 today 76 episode highlights

Nuvvu nenu prema: పద్మావతిని విక్కీ పెళ్లి చేసుకుంటాడా?.. కృష్ణ నిజస్వరూపం బయటపడుతుందా..?

కావ్య వచ్చి మేము వెళ్లిపోతున్నామని అంటుంది. రాహుల్ అప్పుడే స్వప్నకి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కావ్య లిఫ్ట్ చేస్తుంది. అసలు నీకు బుద్ధి ఉందా రాజ్ వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పినా కూడా అక్కడికి ఎందుకు వెళ్లావ్ అని అరుస్తాడు. ఈ వాయిస్ రాహుల్ ది అంటే స్వప్నని ట్రాప్ చేసింది ఇతనా అని కావ్య షాక్ అవుతుంది. రాజ్ దగ్గరకి వెళ్ళి ఏం మాట్లాడావ్ పెళ్లి నుంచి లేచిపోయింది నాతో అని చెప్పకు నువ్వు నేను రోడ్డున పడాల్సి వస్తుంది అంటుండగా రాజ్ రావడం చూసి కాల్ కట్ చేస్తుంది. ఉండమని కనకం రాజ్ ని బతిమలాడుతుంది. కానీ రాజ్ మాత్రం క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఈరోజు కోపంతో వెళ్తున్న ఈయన అభిమానంతో ఇంటికి వస్తారని కావ్య సర్ది చెప్తుంది.

Brahmamudi Serial 21 April 2023 today 76 episode highlights
Brahmamudi Serial 21 April 2023 today 76 episode highlights

మన ఇంటికి చిచ్చు పెట్టిన మనిషిని బయటకి తీసుకొచ్చి రాజ్ కి అప్పగిస్తానని స్వప్నకి వార్నింగ్ ఇస్తుంది. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పి వెళ్తుంది ఏంటని ఫోన్ చెక్ చేసుకుంటుంది. రాహుల్ అని తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతుంది.రాజ్ వాళ్ళు ఇంట్లోకి అడుగుపెట్టబోతుంటే అపర్ణ ఆగు అని అరుస్తుంది. మొదటి సారి కన్న తల్లి మాట పెడ చెవిన పెట్టి ఇష్టం లేని కొంపకీ వెళ్లావ్. ఈ మార్పు నీలో రావడానికి కారణం అయిన ఆ మనిషిని ఈ ఇంట్లోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నా. ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ ఇంట్లో దింపి రమ్మని కళ్యాణ్ కి చెప్పమని అపర్ణ అంటుంది. క్షమించు అక్క నా కొడుక్కి ఆ పాపం నేను అంటగట్టలేనని ధాన్యలక్ష్మి ఎదురు తిరుగుతుంది. నీకు దెబ్బ తగిలినప్పుడు మీ అమ్మ తట్టుకోలేక అక్కడికి వస్తే ఎందుకు తనతో రానని సరైన వివరణ ఇచ్చుకోమని ఇంద్రాదేవి నిలదీస్తుంది.. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి..

Brahmamudi: మళ్ళీ ఇంటికి చేరిన స్వప్న.. కావ్య కాపురంలో నిప్పులు పోస్తుందా?


Share

Related posts

Intinti Gruhalakshmi 12August 709: సామ్రాట్ కి వార్నింగ్ ఇచ్చిన నందు.. షాకై చూసిన తులసి, లాస్య..!

bharani jella

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

kavya N

పుట్టినరోజు నాడు మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ రెడీ చేస్తున్న చిరంజీవి..??

sekhar